S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

12/29/2015 - 22:35

అంజుమన్ మిన్‌హాజ్-యి-రసూల్ అనే ముస్లిం సంస్థ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శాంతి, సామర్యం కోసం పనిచేస్తున్నది. ఆ సంస్థ చైర్మన్ వౌలాన సయ్యద్ అథర్ డెహ్లావి ఈమధ్య పత్రకారులతో మాట్లాడుతూ ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 99 శాతం ప్రజలు భారత్‌లో కలిసిపోయేందుకు ఇష్టపడతారన్నాడు.

12/28/2015 - 22:50

ఉగ్రవాదుల పుణ్యమా అని ప్రచ్ఛన్న యుద్ధం పోయి ప్రత్యక్ష యుద్ధం మొదలయింది. అంకుల్‌శాం నిజాయితీపరు డే అంటుంది బ్రిటన్, కాదు..అంటుంది రష్యా! మరి ఇందులో ఏది నిజం? అంటే రెండూ నిజాలేనని అనిపిస్తున్నది. అదెలాగో చూద్దాం!

12/28/2015 - 00:38

బీసీలకు క్రీమీలేయర్ నిబంధన వర్తింప చేయగలమంటూ తెలంగాణ ప్రభు త్వం పది రోజుల క్రితం ప్రకటించినప్పటి నుంచి అందుకు వ్యతిరేకంగా బీసీ నాయకులు చేసిన హెచ్చరికలతో వాతావరణం వేడెక్కిపోయింది. అటువంటి స్థితిలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ ఈశ్వరయ్య ఈ నెల 24న హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ, క్రీమీలేయర్ నిబంధన సరైనదేనని, అది అమలు కావాలని చెప్పిపోయారు.

12/25/2015 - 23:57

జూలై నెల పదిహేడవ తేదీ, 2015న ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలో వచ్చిన ఒక వార్త కథనం ఇలా ఉంది; ‘‘ఆశిష్‌జోషి అనే ఒక సీనియర్ ప్రభుత్వాధికారి జూన్ నెల 12వ తేదీన ఎసిబి అధికారులను కలిసి, దిల్లీ మాజీ హోంశాఖ కార్యదర్శి రాజేంద్రకుమార్ అవినీతి కార్యకలాపాలపై విచారణ జరిపించాలని కోరారు. కానీ నెలరోజుల వరకూ ఎసిబి అధికారులు దానిపై స్పందించలేదు. అపుడు ఆశిష్‌జోషి సిబిఐ తలుపు తట్టాలనుకున్నారు.

12/24/2015 - 22:37

థామస్ రాయటర్స్ ఫౌండేషన్ జరిపిన సర్వేలో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాలలో మూడవదిగా పాకిస్తాన్ నెలకొంది. దేశంలో పౌర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా మహిళలపై హింసను నిరోధించడంకోసం పలు చట్టాలు తీసుకువచ్చారు.

12/24/2015 - 04:09

బడి వదలి పెట్టే సమయానికి వర్షం ప్రారంభమైంది... అందువల్ల ఐదేళ్ల పాపను అమ్మమ్మగారు చేయి పట్టుకొని ‘బరబరా’లాక్కెళ్లుతున్న దృశ్యం ఆ వీధిలో ఆవిష్కృతమైంది... వడివడిగా నడవకపోతే తడిసి ముద్దయిపోయే ప్రమాదం ఉంది, చిరుజల్లులు వెల్లువలా మారకముందే పాపాయితో సహా అమ్మమ్మగారు ఇల్లుచేరుకోవాలి మరి!! అయినప్పటికీ వానలో నానక తప్పని స్థితి...

12/23/2015 - 03:12

భారతదేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో ఉన్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు.

12/22/2015 - 04:37

ఔను! వీరికి కోట వెంకటాచలం పేరు తెలియదు. కల్హణుని రాజతరంగిణి తెలియదు. బెంగాల్‌లోని కాలాపానీ తెలియదు. కాశింరజ్వీ దురంతాలు తెలియవు. గత నవంబర్ 9న కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది.

12/21/2015 - 05:01

బడుగులకు రాజ్యం, బిసిలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం అనే మాటలు చిరకాలంగా వినవస్తున్నాయి. ఇటీవలి దశాబ్దకాలంలో ఇంకా ఎక్కువగా. ఇది మంచిదే. అందులో తగినంత అర్ధం ఉంది. కాని ఈ వర్గాలకు రాజ్యాధికారం లభించేలోగా మరేమైనా కూడా కావాలా, లేక ఏదీ అక్కరలేదా?

Pages