S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/24/2017 - 00:58

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16వ తేదీన జరగనుంది. రెండు దశాబ్దుల క్రితం ఆయన 1848లో జన్మించారు. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఆయన గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే- ఏ సామాజిక వికృతులను తొలగించడానికి జీవితాంతం ఆయన పోరాడాడో వాటిల్లో చాలా ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

03/23/2017 - 05:50

మనం ఉగాది పండుగను జరుపుకునే సమయంలో భూ మండలంపై ఉత్తర ధ్రువం ప్రాంతంలోని ప్రజలు ‘ఉషస్సు’కు స్వాగతం చెబుతారు! సూర్యుడు ఉత్తరంగా జరుగుతూ భూమధ్య రేఖపై ప్రకాశించడం ఇందుకు కారణం! ఇదే సమయంలో ఉత్తర ధ్రువంలో సూర్యోదయం అవుతుంది. దక్షిణ ధ్రువంలో సూర్యుడు అస్తమిస్తాడు. భూమధ్య రేఖపైకి ఉత్తరాయణ సమయంలో సూర్యుడు వచ్చినప్పుడు ‘సౌరమానం’ ప్రకారం మేష మాసం ఆరంభవౌతుంది.

03/22/2017 - 01:00

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అఖండ విజయం తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ‘ఎప్పుడూ వేరే రాష్ట్రాల్లో గెలిస్తే సంబరమేనా? మీరు ఆ సంబరాన్ని దేశమంతటా చేసుకొనేటట్లు ఎప్పుడు చేస్తార’ని వారిని అడగాలని అనిపించింది. 1990 ప్రాంతంలో భాజపాకు లోక్‌సభలో కేవలం రెండు సీట్లే ఉండేవి.

03/21/2017 - 01:08

రష్యాలో 1917లో ‘బోల్షవిక్ విప్లవం’ వచ్చి కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే పంథాలో 1948లో చైనాలో మావో సేటుంగ్ అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టి రాజకీయ అధికారం చేజిక్కించుకున్నాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి, దక్కించుకున్న రాజకీయ అధికారాన్ని నిలుపుకోవడానికి నిర్దాక్షిణ్యంగా చాలామందిని హతమార్చారు.

03/20/2017 - 01:01

ఆర్టీసీ బస్సులో ఇప్పటికీ ఎంపికి, ఎంఎల్‌ఏకు సీట్లు రిజర్వు అన్న పదాలు ఆ సీటు వెనుక కనపడుతూ ఉంటాయి. కానీ, ఏనాడు ఓ ఎంపి, ఓ ఎంఎల్‌ఏ ఆర్టీసీ బస్సు ఎక్కిన పాపాన పోరు. వారేకాదు- ఎంపిటిసి, జెడ్‌పిటిసి సభ్యులు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడం తమ హోదాకు తగ్గట్టుగా వారు భావించడం లేదు.

03/19/2017 - 02:34

ఉగ్రవాదం మూలాలపైన, దేశంలో మతపరమైన చీలికపైన చర్చకు అంతే లేదనిపిస్తోంది. ‘ఐసిస్’తో సం బంధాలున్న కొంతమంది యువకులను ఇటీవల తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యద్భుత సమన్వయంతో అరెస్టు చేయడాన్ని- ‘మైనారిటీలకు అపరాధ క్షమాపణలు చెప్పుకొనే’ దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు.

03/18/2017 - 00:56

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. భారత్‌లోని అంగుళం భూ మిని కూడా శత్రుదేశాలు వినియోగించుకోకుండా కట్టడి చేస్తూ అత్యంత కీలకమైన ‘శత్రు సంపత్తి 2017’ బిల్లును పార్లమెంట్‌లో మోదీ సర్కారు ఆమోదింపచేసింది.

03/17/2017 - 00:53

ప్రపంచ వ్యాప్తంగా అయిదేళ్ల లోపు బాలల మరణాల్లో నాలుగోవంతు మరణాలకు పర్యావరణ కాలుష్యమే కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. విశ్వవ్యాప్తంగా ఏటా 1.7 మిలియన్ల మంది బాలలు కాలుష్యం కాటుకు బలైపోతున్నారు.

03/16/2017 - 07:32

ఈశాన్య భారతంలోని మణిపూర్ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం గణనీయంగా పెరగడం జాతీయతానిష్ఠ పట్ల పెరిగిన ధ్యాసకు నిదర్శనం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల తరువాత మణిపూర్‌లో ఎన్.వీరేంద్ర సింగ్ ముఖ్యమంత్రిగా భాజపా ప్రభుత్వం ఏర్పడడం కేవలం రాజకీయ పరిణామం కాదు. ఇది మన దేశ సార్వభౌమ అధికారం పరిరక్షణకు, మన ప్రాదేశిక సమగ్రతా భద్రతకు, సాంస్కృతిక జాతీయ సమైక్యభావ జాగృతికి దోహదం చేస్తున్న శుభంకర పరిణామం!

03/15/2017 - 00:22

కొన్నిచోట్ల గెలిచినందుకు బిజెపి, మరికొన్నిచోట్ల పైచేయి సాధించినందుకు కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవచ్చుగాక. కేవలం రాష్ట్రాలు, సీట్లు అనే అంకెలకు పరిమితమై ఆలోచిస్తే ఇరువురు ప్రత్యర్థుల సంబరాలకు వేర్వేరు కారణాలుంటాయి. కానీ, రాజకీయమన్నది కేవలం రాష్ట్రాలు, ఓట్లు, సీట్లు, ప్రభుత్వం ఏర్పాట్లు అనే గణాంక వివరాలకు పరిమితం కావటం కొన్ని సందర్భాలలో జరుగుతుంది.

Pages