S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/09/2017 - 00:44

రైతు ఆదాయం 2022 నాటికి రెట్టింపు అనే నినాదం బాగా ప్రచారాన్ని పుంజుకుంటున్నది. రైతు ఆదాయం రెట్టింపు అవుతుందా, రైతు పండించిన పంటలు ఉత్పత్తుల విధానం రెట్టింపు అవుతుందా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. ఇది జరగాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి కేంద్రానికి తోచినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు తోచినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం అనే ఎజెండాను ముందేసుకుని ఊరడింపు కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

10/08/2017 - 00:41

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్న విషయం జగన్‌కు ఆలస్యంగా అర్ధమయినట్లుంది. కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దూరం చేసుకున్న తర్వాత గానీ ఆయనకు తత్వం బోధపడనట్లుంది. మూడున్నరేళ్ల తర్వాత కారణాలను అర్ధం చేసుకుని, దూరమైన ఓటు బ్యాంకును దరిచేర్చుకునేందుకు అమలుచేస్తున్న వ్యూహం ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నదే ఇప్పుడు చర్చ.

10/07/2017 - 00:45

భారత స్వాతంత్య్ర సమరానికి ఆత్మవిశ్వాసాన్ని, ఆయుధాన్ని అందించిన ఉద్యమం గాంధీజీ నిర్వహించిన చంపారన్ సత్యాగ్రహం. దేశానికి స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన ఆ సంఘటన జరిగి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యాయి. మండుటెండల సమయంలో వేసవికాలం ఉదయానే్న.. ఏప్రిల్ 10, 1917న మహాత్మాగాంధీ కలకత్తా నుండి పాట్నాకు ఏసి కూడా లేని రైలులో వచ్చారు.

10/06/2017 - 01:09

‘‘ఓదేశాన్ని పాలించే రాజు తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడట. ప్రక్కనే ప్రధానమంత్రి ‘‘మహారాజా! దేశ దేశాలను జయించిన మీరు ఎందుకు చింతాక్రాంతులై ఉన్నారు’’ అడిగాడు. రాజు సమాధానం ఇస్తూ ‘‘మంత్రివర్యా! ఈమధ్య నాకో అనుమానం మొదలైంది. ప్రపంచంలో అందరూ భార్యకు భయపడుతారా! నేనొక్కడినేనా? ఆలోచించి చెప్పండి’’ అన్నాడు. ‘‘లేదు రాజా! భార్యకు భయపడనివాడు ఎవ్వడూ లేడు.

10/04/2017 - 20:19

మానసిక స్వచ్ఛత, బౌద్ధిక స్వచ్ఛత కనిపించవు. కనిపించని శాస్ర్తియ సత్యాలను అంగీకరించకపోవటం, వాటిని మూఢ విశ్వాసాలుగా చిత్రీకరించడం మన దేశంలోని ‘ప్రత్యక్ష ప్రమాణ’వాదులను ఆవహించి ఉన్న విదేశీయ భావదాస్యం. ఈ భావదాస్యం ఈ దేశాన్ని దురాక్రమించిన విదేశీయ బీభత్సకారులు మనపై పెత్తనం చెలాయించిన నాటిది! ఇంటిలో తిష్ఠవేసిన దొంగలు ‘ఇంటితనాన్ని’ మూఢ విశ్వాసం అని నిర్థారించారు.

10/03/2017 - 21:58

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే దేశాన్ని నడిపిస్తున్నాయా? న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని భావించవచ్చా? అనేక కుంభకోణాల్లోనే కాదు, రాజ్యాంగ సంక్షోభ సమయంలోనూ సుప్రీంకోర్టు సహా వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులు పెను సంచలనాలకు దారి తీశాయి.

10/03/2017 - 00:04

‘నదీనాం సాగరో గతిః’ అన్నట్లు సినీ రంగంలో గ్లామర్ తగ్గి వార్థక్యం వస్తే రాజకీయ అరంగేట్రం చేయటం భారతదేశంలో పరిపాటి. అమెరికాలో కూడా రీగన్ తన సినీ పాపులారిటీని ఓట్ల కిందికి మార్చుకొని అమెరికా అధ్యక్షుడయినాడు.

10/01/2017 - 23:32

దాదాపు 80 శాతం ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయంలో 76 శాతం పనిచేసేది ఎవరో తెలుసా! ఆకాశంలో సగమని చెప్పే మహిళ! ‘నాట్లు వేయడం, కలుపు తీయడం, కోతకోయడం, అవసరమైతే దున్నడం, రొప్పడం, బరం పెట్టడం, పశువులను మేపడం వంటి పనులన్నీ నేనే చేస్తాను. అప్పులకు జడిసో, బెదిరో ధరలేదనో ఇంటాయన తనువు చాలిస్తే ఇంటిల్లిపాదినీ సాకేది నేనే! అత్తమామల్ని, ఆడబిడ్డల్ని వదిలి గల్ఫ్ బాట పడితే వారి బాగోగుల్ని చూసేది నేనే!

09/30/2017 - 00:06

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఎన్నికలకు సిద్ధం కావడానికి వీలుగా తన మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారని రెండు మూడు నెలలుగా కథనాలు వెలువడుతూ ఉంటే ఏదో బ్రహ్మాండం జరుగబోతున్నట్లు అందరూ భావించారు. అయితే మంత్రివర్గంలో మార్పులు జరిగిన తీరు అందరికీ విస్మయం కలిగించింది.

09/29/2017 - 00:17

ఇద్దరు తాగుబోతులు మధ్యరాత్రి పనె్నండు గంటలకు నిండుగా తాగి ఓ వివాదం ముందు పెట్టుకుని కొట్లాడుతున్నారు.! ఆకాశంలోకి చూపించి ఒకడు అక్కడ కనిపిస్తున్నది చంద్రుడని, మరొకడు సూర్యుడని వాదించుకుంటున్నారు. వాళ్లిద్దరు ఎంతసేపు వాదించుకున్నా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. హటాత్తుగా ఓ పెద్దమనిషి ఆ తోవకుండా వెడుతున్నాడు. అతణ్ణి ఆపి ఆకాశంలో కనిపిస్తున్నది సూర్యుడా! చంద్రుడా! తేల్చిపొమ్మన్నారు తాగుబోతులు.

Pages