S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

08/29/2017 - 00:50

తమిళులకున్న భాషాభిమానం గొప్పదే! కానీ, ఇతర భాషలపట్ల వారికి ఉన్న చులకన భావమే భరించరానిది! ముఖ్యంగా దక్షిణాది భాషలన్నింటిపట్లా ఉన్న తక్కువ భావంతో ఆ భాషలని అణచివేయడానికి చేసిన ప్రయత్నం ఖండించదగ్గది! తమిళం కన్నా తెలుగు ప్రాచీనమైనదని డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి రాసిన వ్యాసాన్ని 2003లో ‘నడుస్తున్న చరిత్ర’లో ప్రచురించారు. ఈ పత్రిక సామల రమేష్‌బాబు సంపాదకత్వంలో తెలుగు భాషకి అంకితమై వచ్చిన పత్రిక.

08/27/2017 - 23:28

ఓసారి అనాట్‌లుక్ ఆంగ్లపత్రిక ఎంపిక చేసిన పది వృత్తులపై ప్రజాభిప్రాయాన్నికోరింది. అందులో వ్యభిచారంతోపాటుగా రాజకీయ వృత్తిని కూడా చేర్చింది. జనాలు వ్యభిచారానికి పదో స్థానాన్ని, రాజకీయాలకు తొమ్మిదో స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే సర్వేను తిరిగి ఇప్పుడు చేపడితే బహశ ఈస్థానాలు తారుమారు కావచ్చు! అందుకే రాజకీయాల్లో విత్తనాలు ఒకరు చల్లితే పంట మరొకరు కోసుకుంటారని అంటారు.

08/27/2017 - 00:20

ఈ వారంలో ముగిసిన నంద్యాల ఉప ఎన్నికలో నిర్మొహమాటంగా చేయి చాచిన జనం అవినీతి, రెండురోజుల క్రితం దేశాన్ని కుదిపివేసిన డేరా బాబా అనుచరుల అరాచకం చూసిన తర్వాత మెడమీద తల ఉన్న వారికెవరికైనా వచ్చే ఆవేదనే ఇది! ఈ రెండు ఘటనల్లో ఒకటి జనం అవినీతి, రెండోది వారి అరాచక మనస్తత్వం ఆవిష్కృతమయింది.

08/25/2017 - 00:17

ఒక తల్లికి ఇద్దరు కొడుకులున్నారు. అందులో ఒకడి వయసు 20 ఏళ్లు. వాడు అమాయకుడు. లోకం పోకడ తెలియనివాడు. తల్లిదండ్రులు ఇంట్లో పెట్టిన నియమాలకు అనుగుణంగా జీవించేవాడు. రెండవ వాడికి పదేళ్లు, కానె్వంట్‌లో చదువుకుంటున్నాడు. ఇతనిపై ఇంటివాళ్ల ప్రభావం కన్నా బయటవాళ్ల ప్రభావం ఎక్కువ. ఎప్పుడూ షరతులు పెడుతుంటాడు. మారాం చేస్తాడు. ఏది ఇచ్చినా సంతృప్తి చెందడు. ఒకటి ఇస్తే ఇంకోటి కావాలని ఏడుస్తాడు.

08/24/2017 - 01:19

‘దమయంతీ స్వయంవరము’ అనే సాంఘిక నవలను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1960వ దశకంలో రచించాడు. ‘ప్రపంచీకరణ’ వల్ల భారతీయత భంగపడుతుండడం అందులోని ఇతివృత్తం! భారతీయ సంప్రదాయ వైద్య చికిత్సకులు అణన్నర-తొమ్మిది నయాపైసలు-తో తయారుచేయగల మందును ‘అల్లోపతి’ మందుల సంస్థలు పది రూపాయలకు అమ్మడం గురించి ‘కవిసమ్రాట్’ వాపోయాడు!

08/22/2017 - 23:50

‘బారాహోతీ’.. ఉత్తరఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో టిబెట్ సరిహద్దు వద్ద ఓ గ్రామం. సహజంగా పర్వత ప్రాంతం కావడంతో ఇక్కడ జనాభా తక్కువ. ఒకప్పుడు ఉత్తరఖండ్ ఉత్తరప్రదేశ్‌లోని భాగమే. ఉత్తరఖండ్ ఆవిర్భావానికి ముందు కూడా బారాహోతీలో 1959వ సంవత్సరంలో చైనా సైనికులు చొరబాటుకు తెగబడ్డారు.

08/21/2017 - 02:30

అడిగిన పద్యాన్ని అప్పజెప్ప లేదని టీచర్ చావబాదగా వనపర్తి జిల్లా శేర్‌పల్లిలోని ఆనంద్ అనే మూడో తరగతి విద్యార్థి వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చావుబతుకులతో పోరాడుతున్నాడు. ఆనందంగా గడపాల్సిన ఈ విద్యార్థి జీవితానికి ఉపాధ్యాయుడు యమకింకరుడుగా మారితే, విద్యా విధానం యమపాశంగా మారింది. అయినా బండబారిన మన హృదయాలకు ఇదో బాధాకరమైన వార్త కాకపోవచ్చు!

08/20/2017 - 00:25

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు నూతన రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై గత మూడేళ్లుగా సాగుతున్న చర్చలకు బిజెపి కేంద్ర నాయకత్వం తాజాగా ముగింపు నిచ్చింది. రాష్టప్రతి ఎన్నిక వరకు అందీ అందనట్లుగా స మాధానం చెప్పిన బిజెపి అధినాయకులు, పోలింగ్ ముగిశాక తాము నియోజకవర్గాల పెంపునకు వ్యతిరేకం అని తేల్చేశారు.

08/19/2017 - 00:18

ఈ సృష్టిలో కోట్ల జీవరాశులున్నాయి. ప్రతి జీవి మానవ జీవితానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి మనకు ఎన్నో వనరులను సమకూరుస్తోంది. ఈ వనరులు మన అవసరాలు తప్ప, మన విలాసాలు తీర్చడానికి కాదు. పెడ ధోరణులు పట్టిన ఆధునికత క్రమంగా అడవులను, వన్యమృగ సంతతిని నిర్మూలిస్తోంది. ఇందుకు ప్రగతి పేరుతో మనిషి చెప్తున్న ఆధునికత ఒక కారణమైతే, మరొక కారణం వెర్రితలలు వేస్తున్న మానవుని భోగలాలస.

08/18/2017 - 00:32

ఓ బియ్యం మిల్లులో ఎలుకలను చంపడానికి యజమాని ఓ గండుపిల్లిని తెచ్చిపెట్టాడు. ఆ పిల్లి రోజూ విపరీతంగా ఎలుకలను తినేస్తున్నది. పిల్లి భయంతో ఎలుకలు బయటకు రావడం మానేశాయి. మొత్తానికి ఓరోజు ఎలుకలన్నీ ఓ కలుగులో సమావేశం అయ్యాయి. దీనికి పరిష్కారం ఎలా? అని ఆలోచిస్తే పిల్లిమెడలో గంట కట్టడమే సరైన ఆలోచన అని అన్నీ తేల్చాయి. కానీ, పిల్లి మెడలో గంట కట్టడానికి అన్నీ భయపడ్డాయి.

Pages