S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/19/2017 - 02:34

ఉగ్రవాదం మూలాలపైన, దేశంలో మతపరమైన చీలికపైన చర్చకు అంతే లేదనిపిస్తోంది. ‘ఐసిస్’తో సం బంధాలున్న కొంతమంది యువకులను ఇటీవల తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యద్భుత సమన్వయంతో అరెస్టు చేయడాన్ని- ‘మైనారిటీలకు అపరాధ క్షమాపణలు చెప్పుకొనే’ దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు.

03/18/2017 - 00:56

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. భారత్‌లోని అంగుళం భూ మిని కూడా శత్రుదేశాలు వినియోగించుకోకుండా కట్టడి చేస్తూ అత్యంత కీలకమైన ‘శత్రు సంపత్తి 2017’ బిల్లును పార్లమెంట్‌లో మోదీ సర్కారు ఆమోదింపచేసింది.

03/17/2017 - 00:53

ప్రపంచ వ్యాప్తంగా అయిదేళ్ల లోపు బాలల మరణాల్లో నాలుగోవంతు మరణాలకు పర్యావరణ కాలుష్యమే కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. విశ్వవ్యాప్తంగా ఏటా 1.7 మిలియన్ల మంది బాలలు కాలుష్యం కాటుకు బలైపోతున్నారు.

03/16/2017 - 07:32

ఈశాన్య భారతంలోని మణిపూర్ ప్రాంతంలో భారతీయ జనతాపార్టీ బలం గణనీయంగా పెరగడం జాతీయతానిష్ఠ పట్ల పెరిగిన ధ్యాసకు నిదర్శనం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల తరువాత మణిపూర్‌లో ఎన్.వీరేంద్ర సింగ్ ముఖ్యమంత్రిగా భాజపా ప్రభుత్వం ఏర్పడడం కేవలం రాజకీయ పరిణామం కాదు. ఇది మన దేశ సార్వభౌమ అధికారం పరిరక్షణకు, మన ప్రాదేశిక సమగ్రతా భద్రతకు, సాంస్కృతిక జాతీయ సమైక్యభావ జాగృతికి దోహదం చేస్తున్న శుభంకర పరిణామం!

03/15/2017 - 00:22

కొన్నిచోట్ల గెలిచినందుకు బిజెపి, మరికొన్నిచోట్ల పైచేయి సాధించినందుకు కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవచ్చుగాక. కేవలం రాష్ట్రాలు, సీట్లు అనే అంకెలకు పరిమితమై ఆలోచిస్తే ఇరువురు ప్రత్యర్థుల సంబరాలకు వేర్వేరు కారణాలుంటాయి. కానీ, రాజకీయమన్నది కేవలం రాష్ట్రాలు, ఓట్లు, సీట్లు, ప్రభుత్వం ఏర్పాట్లు అనే గణాంక వివరాలకు పరిమితం కావటం కొన్ని సందర్భాలలో జరుగుతుంది.

03/14/2017 - 00:42

హైదరాబాద్‌లో ఇటీవల ‘అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ’ పక్షాన జరిగిన సదస్సులో కొందరు వక్తలు- కేరళలో జరుగుతున్న హత్యారాజకీయాలను ప్రముఖంగా ప్రస్తావించి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ డిజిపి దినేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేరళలో సిపిఎం జరుపుతున్న దమనకాండను వివరించారు. కేరళ నుంచి ‘హత్యారాజకీయాల’ బాధితులు కొందరు ఈ సదస్సుకు హాజరై అక్కడి రక్తపాత చరిత్రను కళ్లకు కట్టినట్టు తెలిపారు.

03/13/2017 - 01:02

ఇందిరా గాంధీ హయాంలో జరిగిన రెండు మంచి ప నుల్లో ఒకటి బ్యాంకుల జాతీయకరణ, మరొకటి రాజభరణాల రద్దు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చెప్పుకోతగ్గ సంస్కరణలు కూడా ఈ రెండే! వీటితోపాటు భూసంస్కరణలు కూడా జరిగి వుంటే భారతదేశ ముఖచిత్రమే మారిపోయి వుండేది.

03/12/2017 - 08:42

జన మానస స్వాదుజలం
సమరార్ణవమై లేచెను,
మతోన్మాద రాజకీయ
మలిన శిఖల ముంచెత్తను
అవినీతి విషాలు సోకి
కమిలిన ఉత్తర సీమల
కమల పుష్ప పవనమ్ముల
పరిమళాలు సభ తీరెను..

03/11/2017 - 01:08

హత్యలు, హింసాత్మక కార్యక్రమాలను ఒక రాజకీయ సాధనంగా వాడుకోవడం కమ్యూనిజం సిద్ధాంతంలో అంతర్భాగం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసాత్మక మార్గాలను అవలంబించడంలో కమ్యూనిస్టులు ఏనాడూ సంకోచించలేదు. ‘ఆయా సమయాల్లో నెలకొని ఉన్న సామాజిక పరిస్థితులను బలప్రయోగం ద్వారానే పక్కకి నెట్టివేయడం వల్ల తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవచ్చున’ని కమ్యూనిస్టు పార్టీ 1848లో విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది.

03/10/2017 - 00:14

ప్రపంచం మొత్తమీద యువశక్తి అధికంగా ఉన్నది భారత్‌లోనే. అధిక జనాభాకు సంబంధించి చైనా అగ్రభాగాన ఉన్నప్పటికీ, యువత విషయంలో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. చైనాలో 26.9 కోట్ల మంది యువతీ యువకులు ఉండగా, భారత్‌లో 10 నుంచి 24 ఏళ్లలోపు వారి సంఖ్య 36.5 కోట్లు. ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాప్యులేషన్-2014’ ప్రకారం మన దేశ జనాభాలో 30 శాతం మేరకు యువశక్తి ఉంది.

Pages