S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

06/04/2017 - 04:14

నడిరోడ్డుపై గొడ్డు మాంసంతో ‘పెద్దకూర పండగ’ (బీఫ్ ఫెస్టివల్) హడావుడి.. రోడ్డుపక్కనే ఆవులను వధించి వాటి మాంసాన్ని జనానికి పంచిపెట్టడం.. దున్నపోతుల తలలు పట్టుకొని వాడవాడలా ఊరేగడం.. ఇలా నిరసనలు చేస్తూ నిప్పులు రాజేస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి, వామపక్షాలకు ఇప్పుడు- ఊపరి సలపని పని.. మోదీ ప్రభుత్వంపై రభస చేయడం, ఆగ్రహం ప్రకటించడమే ఈ విపక్షాల ఏకైక ఎజెండా.

06/03/2017 - 00:11

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ సమాధానం దొరకని కొన్ని చిక్కు ప్రశ్నలను పరిష్కరించే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ‘సమస్యల బూచి’ని చూపించి తమ రాజకీయ, సాంఘిక ప్రయోజనాలు ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీలకు, శక్తులకు, వ్యక్తులకు, కొన్ని మీడియా సంస్థలకు ఇది మింగుడు పడడం లేదు.

06/02/2017 - 00:22

చందూలాల్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుంటే అతని పదేళ్ళ కుమారుడు పాఠశాలలో గెల్చుకొన్న పెద్ద బహుమతితో ఎదురొచ్చాడు. ‘ఇది ఎలా వచ్చింది? ఇనే్నళ్లలో నేనే సంపాదించనంత ట్రోఫీ నీవు ఎలా గెల్చావు?’ అని కొడుకును అడిగాడు చందూలాల్. మా హెడ్మాస్టర్ ఓ ప్రశ్న వేస్తే, దానికి సరైన సమాధానం ఇచ్చి గెలిచానని అన్నాడు కొడుకు.

06/01/2017 - 03:33

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ధార్మిక క్షేత్రాలను సందర్శించి రావడం ఒకే భాషా కుటుంబానికి చెందిన రెండిళ్లలోని సోదరీ సోదరుల మధ్య మమతానురాగాలు మరింతగా వికసించడానికి దోహదం చేసిన శుభ పరిణామం! ఈ పరిణామ స్ఫూర్తి రెండు తెలుగు రాష్ట్రాల పుట్టిన దినం పండుగలకు ‘సాంస్కృతిక తోరణం’ వంటిది.

05/31/2017 - 06:38

వధ కోసం కబేళాలకు పశువుల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని స్వాగతించడానికి బదులు కొందరు లేనిపోని రాజకీయ కోణంలో గందరగోళం సృష్టించడం సముచితం కాదు. పశువులను కేవలం వ్యవసాయ పనులకే విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మూగజీవాలకు వరం లాంటిది.

05/30/2017 - 05:14

అలనాటి అంతర్జాతీయ స్థాయి ‘రోల్ మోడల్’ నాయకత్వం- లీలామాత్రంగానే మిగిలిపోతోంది. అలాంటి ఉద్ధండ నాయకులు, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, తమ తమ దేశాలకు వారు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ ప్రాంతాల గురించి ఆ మహానాయకులు పడ్డ ఆరాటం, పోరాటంలో నిబద్ధత- ఇప్పటి తరం నేతల్లో ఉన్నాయా? ఇలాంటి ఉన్నత లక్షణాలన్నీ ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించాయనడం అతిశయోక్తి కాదు.

05/29/2017 - 06:11

‘ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మార్చాలి. ఇది ఉపన్యాసాలు వినడం ద్వారానో, పుస్తకాలు చదవడం ద్వా రానో మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమై, వారి సమస్యల్ని తెలుసుకొని, వారి పోరాటాల్లో భాగస్వామ్యమైతేనే సాధ్యం..’ అన్న మార్క్సు మాటలు మార్క్సిజానికి, లెనినిజానికి, మావోయిజానికి ఇరుసుగా పనిచేస్తూ ప్రపంచ రాజకీయాల్ని, ఆర్థిక సూత్రాల్ని అవగాహన చేసుకొనడానికి పనిచేస్తూనే వున్నాయి.

05/28/2017 - 07:14

దేశ సరిహద్దుల్లో ప్రాణత్యాగాలు చేసిన సైనికుల విషయంలో మాత్రం ఈ ‘లౌకికవాదులు’ స్పందించరు. మానవ హక్కుల కార్యకర్తల తీరు మరీ దారుణం. వారి దృష్టిలో తీవ్రవాదులు,
ఉగ్రవాదులు, మావోయిస్టులకు మాత్రమే మానవ హక్కులనేవిఉంటాయి. అందుకే
రాజ్యాంగాన్ని సమీక్షించాలని ఎంఎం షక్దర్ సూచిస్తున్నారు.

05/27/2017 - 05:22

మాతృభాష అంటే సొంత భాష. సాధారణంగా వ్యక్తులకు తమ తల్లిదండ్రులు మాట్లాడే భాషే మాతృభాష అవుతుంది. శిశువు మరొక భాషా ప్రాంతంలో ఉండి అక్కడ పెరిగితే- ఆ ప్రాంత ప్రజల భాష అలవడితే అది ఆ శిశువు మాతృభాష అవుతుంది. పాఠశాలలో విద్యార్థి భాషేతర విషయాలను నేర్చుకునేటప్పుడు బోధనకు ఉపయోగించే భాషను బోధనా భాషగా పరిగణిస్తారు. ‘మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్’.. దీనినే బోధనా మాధ్యమం అని కూడా అంటారు.

05/26/2017 - 07:52

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ రచయిత డామినిక్ ల్యాబ్రరె ‘ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ అనే పుస్తకం రాశాడు. ఈ ప్రసిద్ధ రచయిత ‘డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్‌వౌంట్ బాటన్’ పేరుతో రాసిన మరో పుస్తకంలో వౌంట్ బాటన్‌తో తాను జరిపిన ఇంటర్వ్యూను ప్రచురించాడు.

Pages