S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/25/2017 - 07:33

ప్రజాస్వామ్య సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ జనజీవన
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి...

05/24/2017 - 07:44

ప్రతిరోజూ ఉదయానే్న ‘అలారం’ పెట్టుకుని మరీ నిద్రలేచి ఎనిమిదేళ్ల రెహానా ఉరుకులు పరుగులతో ముస్తాబవుతుంది స్కూలుకు పోదామని.. అయితే- ఆ రోజు కూడా బడి తలుపులు తెరచుకోలేదని తెలిశాక ఆమెకు నిరాశే.. యూనిఫాం ధరించి బడికి బదులు ఇంట్లో కూర్చోవాల్సి వస్తోందని ఆమె దిగాలు పడుతోంది.. తన ఈడు పిల్లలంతా బాగా చదువుకుని పెద్దయ్యాక డాక్టర్లవుతామని చెబుతుంటారు..

05/23/2017 - 08:26

నెలరోజులు తిరగక ముందే దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకున్నాయి. మూడురోజుల గాలింపు చర్యల సందర్భంగా దాదాపు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని చత్తీస్‌గఢ్‌లోని ‘యాంటీ నక్సల్స్ ఫోర్స్’ చీఫ్ అవస్థి ప్రకటించారు. నక్సలైట్ల ఏరివేతకు తాము ప్రారంభించిన ‘వేట’ ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

05/22/2017 - 07:34

అస్పృశ్యుల హక్కుల కోసమే కాదు, జంతుబలుల నిషేధానికి, జోగినీ వ్యవస్థ అంతానికి ఆయన అలుపెరుగని పోరాటం చేశాడు.. 1920 ప్రాంతంలో హైదరాబాద్ బస్తీలలో భయానకమైన ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలు పెద్దఎత్తున మరణించినపుడు ఆయన తన సంస్థ ద్వారా ఎనలేని సేవలందించి నిజాం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు..

05/21/2017 - 07:57

‘అభివృద్ధిలో మనం దేశానికే ఆదర్శం, కొన్నాళ్లకు ప్ర పంచానికే ఆదర్శం, మన రాజధాని అమరావతి- సింగపూర్‌లా.. కాకపోతే ఇస్తాంబుల్‌లా.. అదీ కాదంటే షాంఘైలా మెరిసిపోతుంది. రాష్ట్రం నిండా బుల్లెట్ రైళ్లు, కేబుల్ కార్లు, ప్రతి జిల్లాకు ఓ విమానాశ్రయం, ఇక మనకు లోటేముంది?’ ..ఈ ప్రకటనలు వింటేనే మనకు కడుపు నిండిపోతుంది, కళ్లు చెదిరిపోతాయి, ఏ పాల పుంతలోకో వెళ్లిపోతాం.

05/20/2017 - 00:56

పటిష్ఠంగా అమలవుతున్న భారత విదేశాంగ విధానాలు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ఖండంలో రాజకీయ ఆర్థిక అంశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇందుకు సాక్ష్యం రెండు ప్ర ముఖ ఘటనలు. ఒకటి- విస్తృత ప్రాతిపదికన చైనా తలపెట్టిన ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ సదస్సును భారత్ బహిష్కరించడమే కాక తన చర్యకు కీలక ఆర్థిక శక్తుల మద్దతును కూడగట్టగలిగింది.

05/19/2017 - 07:41

ఓ ఆశ్రమం వాకిట్లో సన్యాసి కూర్చునివుంటే తన ముందు నుంచి ఓ నీడ పరిగెత్తుతున్నట్టు అనిపించింది. ఆ నీడను ఆపి ‘నీవుఎవరు?’ అని ప్రశ్నించాడు సన్యాసి. ‘నేను మృత్యుదేవతను.. పక్కనున్న నగర జనాన్ని ప్లేగు వ్యాధితో చంపడానికి వెళ్తున్నాను’ అంది ఆ నీడలాంటి ఆకారం. ‘ఎంతమందిని నీవు చంపబోతున్నావు?’ అని సన్యాసి ప్రశ్నిస్తే- ‘దాదాపు పదివేల మందిని..’ అని మృత్యుదేవత చెప్పింది.

05/17/2017 - 23:39

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి మన జాతీయ చరిత్రకు జరిగిన, కొనసాగుతున్న అన్యాయాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చరిత్రకు జరిగిన వక్రీకరణల’ను ఇలా ప్రముఖంగా ప్రస్తావించడం బహుశా ఇదే మొదటిసారి. బాబర్, అక్బర్ తదితర మొఘల్ కుటుంబానికి చెందిన వారిని ‘పరిపాలకులు’గా పేర్కొనడం చరిత్రకు జరిగిన ఘోరమైన విఘాతం!

05/17/2017 - 01:12

‘రాజుగారి కొడుకులు- ఏడు చేపల కథ’ ఇంకా నడుస్తూనే ఉంది. ఏడో చేప ఎండకపోవడానికి కారణం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఒక ఐఐటి ఎదురుగా జిరాక్స్ సెంటర్ నడిపిన కుర్రాడు వృత్తి నైపుణ్యంతో నాలుగు ముక్కలు నేర్చుకుని, చోరకళానైపుణ్యంతో సర్ట్ఫికెట్లు సృష్టించుకొని, సంభాషణా చాతుర్యంతో ఇంటర్వ్యూలో నెగ్గి, ఓ విశ్వవిద్యాలయంలో ఆచార్యత్వం పొందాడు.

05/16/2017 - 00:52

మన దేశంలో ఏ రాజకీయ పార్టీకీ లేనంత నూట పాతికేళ్ల పైబడిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ మనుగడ ఇపుడు ప్రశ్నార్థకమైంది. డెభ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఐదున్నర దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన చరిత్ర దీనికి ఉంది. నెహ్రూ లాంటి క్రాంతదర్శి, ఇందిరాగాంధీ లాంటి వీరనారి ఈ పార్టీ తరఫున దేశానే్నలిన వారే.

Pages