S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/17/2017 - 01:42

పాఠశాల ప్రవేశ దరఖాస్తులో ‘మతము’ అనే కాలమ్‌లో ‘మతం లేదు’ అనే అంశాన్ని కూడా చేర్చాలని హైదరాబాద్‌కు చెందిన దంపతులు డి.వి.రామకృష్ణారావు, క్లారెన్స్ కృపాలిణి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. 2010లో తమ కూతుర్ని పాఠశాలలో చేర్పించిన సందర్భంగా మొదలైన ఈ పోరాటం చివరికి హైకోర్టుకు చేరగా, గత నెల 21న ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ విషయంగా వివరణ కోరడం జరిగింది.

04/16/2017 - 08:52

పురాణాల్లో విభీషణుడు, శకుని వంటి పాత్రలు అరడజనుకు మించి కనిపించవు. కానీ, తెలుగు రా ష్ట్రాల్లో బలం ఉండీ పెంచుకోలేక, తనకు తాను శక్తిహీనంగా మారుతున్న బిజెపికి మాత్రం శకుని, విభీషణుల సంఖ్య బోలెడు. ఏ పార్టీ అయినా బలం లేకపోయినా అధికారంలోకి రావాలని ఆశిస్తుంది. అది తప్పేమీ కాదు. కోరిక లేని వారు ఏమీ సాధించలేరన్నది పెద్దలు చెప్పే మాటనే.

04/15/2017 - 02:21

ఒకే రకమైన భావజాలం కలిగిన వ్యక్తులు ఒక కూటమి లేదా దళంగా ఏకమై ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజల ఆమోదం పొంది చట్టసభల ద్వారా జనం శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తూ వాటి అమలు విధానాన్ని నిత్యం పర్యవేక్షించడం రాజకీయ పార్టీల ప్రధాన లక్షణం. ప్రజామోదం పొందలేక ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సి వస్తే, అధికార పక్షం చేసే మంచి పనులను సమర్ధిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను సవరించాల్సిన బాధ్యతను నిర్వహించాలి.

04/14/2017 - 01:27

‘వంద తప్పలు చేస్తే గానీ శిశుపాల వధ’ జరగదు కాబట్టి కేసిఆర్ నూరు తప్పుల వైపు ప్రయాణం చేస్తున్నారు! ఇక్క డ ‘వధ’ అంటే తెరాస గద్దె దిగడమే! తాను ‘పంది’ అంటే ‘అ వును’ అనే వాళ్లు, ‘కాదు నంది’ అంటే కాదనే ‘వందిమాగధులు’ చుట్టూ చేరితే అది ‘కెసిఆర్ ప్రభుత్వం’ అవుతుంది. సరిగ్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా అడుగులు వేశాడో, కేసిఆర్ అలాంటి ‘పాదయాత్ర’నే చేస్తున్నాడు.

04/13/2017 - 07:13

‘అశ్వని’ కురిస్తే అంతా నష్టం- అన్నది వ్యవసాయ ప్రపంచంలో మారుమోగిన ప్రాచీన సూక్తి. ‘్భరణి’ కురిస్తే ‘్ధరణి’ పండును- అన్నది సకాల వర్షాన్ని స్వాగతించే సూక్తి. అశ్వని, భరణి వంటి ‘కార్తె’లతో ముడివడిన సేద్యం గురించి, వర్షం గురించి మన దేశంలోని వ్యవసాయ శాస్త్ర పట్ట్భద్రులకు, స్నాతకోత్తర పట్ట్భద్రులకు తెలుసా? అన్నది సందేహం..

04/12/2017 - 01:10

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు సరిగ్గా మరొక రెండు వారాలలో ఈనెల 26వ తేదీన ప్రారంభం కానున్నా యి. మూడు రోజుల ఆరంభోత్సవాల తర్వాత వివిధ కార్యక్రమాలు మొ త్తం సంవత్సరం పొడవునా సాగనున్నాయి. ఉస్మానియాకు నూరేళ్లు పూర్తికావటం ఒక్క తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటికీ గర్వించదగ్గ విషయం. ఇంకా బాగా చెప్పాలంటే మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇరుగు పొరుగు రాష్ట్ర వాసులకు కూడా.

04/11/2017 - 00:41

సంజయ్‌లీలా బన్సాలీ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. రాజస్థాన్‌కు చెందిన ‘చిత్తూరు రాణి పద్మిని’ జీవిత చరిత్ర ఆధారంగా ‘పద్మావతి’ అనే సినిమా నిర్మించాలని ఆయన సంకల్పించాడు. జనరంజకంగా ఈ చారిత్రక సినిమాను రూపొందించాలని తపన పడి, అందుకోసం కావలసిన స్క్రిప్టును కూడా తయారుచేసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. చారిత్రక సినిమాలను తీయడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు.

04/10/2017 - 00:49

గొల్ల శ్రీనివాస్ మేకల్ని, గొర్రెల్ని మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇది కూడా వార్తేనా? అనే సందేహం రావచ్చు! ‘మనిషి కుక్కను కరిస్తే’ వార్తెలా అవుతుందో శ్రీనివాస్‌ది అలాంటి వార్తనే! అట్టహాసంగా ‘బడిబాట’ చేపట్టిన రోజే చెరువులో పడిన గొర్రెల్ని రక్షించబోయి, మరో పెద్దమనిషితోపాటు శ్రీనివాస్ ఆకస్మికంగా మరణించాడు.

04/09/2017 - 01:20

కాశ్మీర్ బాటలో పశ్చిమ బెంగాల్ మాత్రమే ‘ఇస్లామీకరణ’ వైపు కదులుతోందని భావిస్తే మనం పొరబడినట్లే! తమిళనాడు సైతం ‘ఇస్లామీకరణ’కు ఏమంత దూ రంగా లేదనే చెప్పాలి. ‘జల్లికట్టు’ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాట జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది.

04/08/2017 - 07:07

రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తికి కలసికట్టుగా తూట్లు పొడవడాన్ని భారత దేశ ప్రజాస్వామ్య వాదులు ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర గవర్నర్, శాసన సభాపతి, ముఖ్యమంత్రి.. ముగ్గురూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారే. రా జ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామని వాగ్దానం చేసినవారే. అటువంటి ఆ ముగ్గురు నేతలూ నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ సాక్షిగా రాజ్యాంగం మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

Pages