S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

07/13/2016 - 06:53

భారీ ఆనకట్టలు కట్టినప్పుడు నిర్వాసితుల పునరావాసం కీలక సమస్యగా మారుతున్నది. వారికి పరిహారం, పునరావాసం పూర్తి కాకుండా ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రారంభించరాదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో స్పష్టం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టుల కోసం వేలాది కోట్ల భారీ వ్యయానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాలు పునరావాసం విషయంలో శ్రద్ధ చూపడంలేదు.

07/11/2016 - 23:40

దక్షిణ భారతంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు బాగా విస్తరించాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాలకు భద్రత లేకుండా పోతున్నది. అనంతపురానికి ఐసిస్ భూతం చేరింది. దేశంలో హై ఎలర్ట్ ప్రకటించారు. కేజ్రీవాల్, కెసిఆర్, సిద్దరామయ్య వంటి ముఖ్యమంత్రులకు ఇది పరీక్షా సమయం.

07/11/2016 - 05:00

ఈ నెల అయిదవ తేదీన జరిగిన కేంద్ర మంత్రి మండలి మార్పులు వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినటువంటివని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కాదనేందుకు తగిన కారణం లేదు. అందులో తప్పుపట్టేందుకు కూడా ఏమీలేదు. ప్రభుత్వం వారిది, ఎన్నికలను ఎదుర్కొనేది వారు, గెలవటం అవసరం. అందుకు తగినట్లు ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వటం, కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకోవటం తప్పదు.

,
07/10/2016 - 03:53

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు విదేశీయాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మోదీ-బాబు స్థాయి వేరయినప్పటికీ, ఇద్దరూ పోటాపోటీగా విదేశాలు చుట్టివస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని, బాబు చేస్తున్న విదేశీ పర్యటనలు జయప్రదమయి, రాష్ట్రంలో పెట్టుబడుల జడివాన కురిస్తే సంతోషమే.

07/09/2016 - 07:47

ఆనందానికి విషాదం ఎప్పుడు విలోమంగా వుంటూనే వుంది. ఒకరి అవసరాలు మరొకరికి అనవసరాలుగా వుం టాయి. అనవసరం అనే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి నిరోధకులుగానే కనబడతారు. ఓ సమస్యను పరిష్కరించడానికై మరో సమస్యను ముందుకు తేవడం పాలక నీతి. ఒక రాజెప్పుడూ పక్క రాజును నిద్రపోనీయనట్లే పాలకులెప్పుడు పాలితుల దృష్టిని మళ్ళించడం ఓ కౌటిల్య నీతే!

07/08/2016 - 03:17

అణుశక్తిని సాధించడం దేశ రక్షణ అవసరాలలో చాలా ముఖ్యమైనది. అణ్వాయుధాలు కలిగి వున్న దేశంగా ప్రపంచ పటంలో గుర్తింపు పొందడం వ్యూహాత్మకమైన చర్య. అవి ప్రయోగించకుండానే కలిగి వున్న దేశంగా పొరుగు దేశాలకు భయం కలిగించడమే ఆ వ్యూహం లక్ష్యం. మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు మన దేశంపై దాడులు చేసాయి. భూభాగాలను ఆక్రమించాయి. ఇప్పటికీ వాటితో మన సంబంధాలు అంత బాగాలేవు.

07/07/2016 - 07:08

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూన్ నెల 26వ తేదీ నుంచి జూలై ఒకటవ తేదీ వరకు చైనాలో జరిపిన వాణిజ్య పర్యటన గొప్ప చారిత్రక సంఘటన! ఈ ‘వాణిజ్యం’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, అవశేష ఆంధ్రప్రదేశ్ నుండి దశాబ్దులుగా చైనాకు దొంగగా ఎగుమతి అవుతున్న ఎర్రచందనం కలపతో ముడివడి ఉంది. ఈ ‘వాణిజ్యం’ ఏళ్లతరబడి చైనీయ ‘సంప్రదాయ వైద్యచికిత్స’ భోంచేస్తున్న మన పులులతో ముడివడి ఉంది.

07/06/2016 - 01:06

రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా సెప్టెంబర్ 4న తన పదవీ కాలం పూర్తయిన తరువాత తాను ఇంకా కొనసాగాలని కోరుకోవడంలేదని రఘరామ్ రాజన్ ప్రకటించగానే దేశంలో ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతోందనే ఆందోళనలు బయలుదేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అన్నంత భయాందోళనలు కలగచేసారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి మేధావుల అవసరం లేదని రాహుల్‌గాంధీ అవహేళన చేసారు.

07/05/2016 - 04:39

హైదరాబాద్ నగరం ఐసిస్ గుప్పెట్లోకి వెళ్లిందనే విషయం ఇవ్వాళ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చిందని అనుకోవటం పొరపాటు. 2015వ సంవత్సరం నిక్కీ జోసఫ్ అనే ఐసిస్ ఉగ్రవాద నాయకురాలిని అరెస్టుచేసినప్పుడే ఈ విషయం బహిర్గతమయింది. ఇంటిలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉందని హెచ్చరించినా కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

07/04/2016 - 04:40

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని భవనాలకు గత బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగటం, ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాలలోకి ఆనందోత్సాహాలతో ప్రవేశించడం, ఆ సంరంభాలను టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలతో గమనించడం శాశ్వతంగా గుర్తుండిపోయే దృశ్యాలు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలోచించిన వారికి బహుశా రెండు భావనలు కలిగివుంటాయి.

Pages