S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

11/02/2016 - 08:23

మన దేశంలో కుల రాజకీయాలు ఎప్పుడూ ఉన్నవే. స్వాతంత్య్రం తర్వాత, స్వాతంత్య్రానికి ముందు, బ్రిటిష్ పాలనకు ముందు, మొఘల్ కాలానికి ముందు ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం కూడా ఇవి కనిపిస్తాయి. కుల రాజకీయాలు చేయటమేగాక, రాజ్యాలను ఏలిన వారిలో పై కులాలవారు, కింది కులాలవారు చరిత్ర పొడవునా ఉన్నారు. ఈ విధమైన రాజకీయ ఆధిపత్యాలు ఒక పార్శ్వం.

11/01/2016 - 07:08

సమాజ సంబంధ సేవలనే బ్రాహ్మణులు చేస్తున్నారని, అయినా ఆ కులస్థుల్లో కొం దరి పరిస్థితి దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బుల కోసం అర్చకులు ఎదురుచూసే దుర్భర పరిస్థితులను అధిగమించాలని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ అన్న మాటలను విశే్లషించాల్సిన తరుణమిది. ప్ర భుత్వం, మేధావులు కలసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా కెసిఆర్ సూచించారు.

10/30/2016 - 00:47

అనగనగా ఓ సుబ్బారావు. కూతురి పెళ్లికోసం సంబంధాలు చూస్తున్నాడు. ఆయన ఇంటికొచ్చిన పెళ్లిళ్ల పేరయ్య తాను తెచ్చిన వరుడి గుణగణాలు ఇలా చెప్పాడు.. ‘అబ్బాయి సుందరాంగుడు. ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఏ చెడ్డ అలవాటూ లేదు.’.. ఈ మాటలకు సుబ్బారావు పరవశుడయ్యాడు. ‘కానీ..’ అని పేరయ్య మధ్యలోనే ఆగిపోయాడు. తన ఆనందానికి బ్రేకులు వేసిన పేరయ్య వైపు చూసి- ‘మళ్లీ..

10/29/2016 - 04:26

జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలో విలీనమై ఈ నెల 26 నాటికి సరిగ్గా 69 వసంతాలు గడిచాయి. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం 1947’కు లోబడి- ‘నేను..

10/27/2016 - 23:41

‘శతమానం భవతి’... అంటూ పెద్దలు చిన్నవారిని నూరేళ్లు నిండుగా జీవించాలని ఆశీర్వదిస్తూ వుంటారు. ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తే గనుక ‘సంపూర్ణ జీవితం’ అనుభవించినట్టని వారి దృష్టిలో అర్థం. ఈ నూరేళ్ల జీవితంలో ముఖ్యమైన మజిలీలుగా షష్టిపూర్తి, సప్తతి, అశీతి, సహస్ర చంద్రోదయం వంటి వేడుకలు నిర్వహించడం మన భారతీయ సంప్రదాయం.

10/27/2016 - 03:29

‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే హిందీ చలనచిత్రం విడుదలకు ఆటంకాలు తొలగిపోవడం గురించి గొప్పగా ప్రచారం జరుగుతోంది! ఈ సినిమాలో పాకిస్తాన్‌కు చెందిన ఫవాద్‌ఖాన్ అనే నటుడు ప్రముఖ పాత్రను పోషించాడట! పాకిస్తాన్‌లోని ప్రముఖులలో అత్యధికులు ప్రచ్ఛన్న ‘జిహాదీ’లు! ఆ దేశ అభినయ కళాకారులలో సైతం అత్యధికులు ప్రచ్ఛన్న జిహాదీలు! ప్రత్యక్ష ‘జిహాదీ’లు ఇస్లాం మతేతర ప్రజలను దాదాపు పదునాలుగు శతాబ్దులుగా హత్య చేస్తున్నారు..

10/26/2016 - 07:23

ప్రస్తుతం మళ్లీ వివాదంగా మారి చర్చ సాగుతున్న ‘తలాక్’ ప్రశ్నకు మూల కారణం- ముస్లిం సమాజం తన సంస్కరణలు తాను తెచ్చుకోకపోవటం. ఆ పని జరిగి ఉన్నట్లయితే బయటి సమాజానికి గాని, చట్టాలూ- రాజ్యాంగానికి గాని, చివరకు తమను ‘వ్యతిరేకుల’ని భావించే వర్గాలకు గాని ఆ విషయాలలో ‘జోక్యం’ చేసుకునేందుకు అవకాశమే లభించదు. కాని భారతదేశంలోని ముస్లిం సమాజపు పెద్దలు ఈ సాధారణమైన తర్కాన్ని గుర్తించటం లేదు.

10/24/2016 - 23:43

మానవ చరిత్రలో ఒక గతి తర్కం ఉన్నదంటారు సైద్ధాంతికులు. నూరేండ్లు నత్తగుల్లగా నడిచిన చరిత్ర ఉన్నట్లుండి ఒక్కసారి మలుపు తిరిగి జవనాశ్వంలా పరుగిడవచ్చు. 1947-1971, 1977-1991, 2014 ఇలా కొన్ని సందర్భాల్లో భారతదేశ చరిత్రలో ప్రభంజనాలు వీచాయి. భారత్‌పై పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉంది.

10/24/2016 - 06:43

నిన్నటిదాకా అటవీ జిల్లాగా, ఆదివాసుల జిల్లాగా అక్షరక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదటి జిల్లాగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ‘ఆదివాసీ అస్తిత్వాన్ని’ కోల్పోతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి. జలపాతాలకు, ప్రకృతి సోయగాలకు, అటవీ, జల సంపదకు,పత్తితోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యంగా మదనపల్లి తర్వాత ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండలాల్లో టమాటోలు పేరెన్నికగన్నాయి.

10/23/2016 - 01:12

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అడుగులు విచిత్రంగా, విభిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబు వ్యవహారశైలిని పరిశీలించిన వారెవరికైనా ఇలాంటి అనుమానమే ఏర్పడుతుంది. ఈ ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. కెసిఆర్ విషయంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది.

Pages