S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/11/2016 - 23:50

న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై ఇటీవల ఒక పరిశోధన జరిగింది. అందులో కొన్ని దిగ్భ్రాంతిని కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడువేల గర్భ నిరోధక కండోమ్స్ దొరికాయి. మాదక ద్రవ్యాలు ఇంజక్షన్ రూపంలో తీసుకొనే సూదులు దొరికాయి. గంజాయి వంటి ఇతర పదార్ధాలు యూనివర్సిటీకి సరఫరా చేయబడుతున్నాయి. కాశ్మీరు నుండి ఉగ్రవాదులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

03/11/2016 - 01:31

‘స్వేచ్ఛ’, ‘అసమ్మతి హక్కు’, ‘నేరం చేసే హక్కు, ‘దేనికీ కట్టుబడని భావ ప్రకటన స్వేచ్ఛ’, ‘జాతీయత వర్సెస్ జాతి వ్యతిరేకత’ వంటి పదాలు లేదా పద బంధనాలు అందరినోట వినిపిస్తున్నాయి. ఇవి గణనీయ స్థాయిలో వామపక్ష లేదా అతివాద వామపక్ష శక్తులకు రాజకీయ ఊతాన్నిచ్చాయి. అలాగే విద్యా సంస్థల్లో తరిగిపోతున్న వామపక్ష భావజాలానికి ప్రాణవాయువును అందించాయి.

03/10/2016 - 04:24

మదరాసు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో ప్రతిరోజు జాతీయ గీతాన్ని-నేషనల్ యాంథమ్-ఆలపించాలని మార్చి ఐదవ తేదీన ఆదేశించింది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో విధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి సూచన ఈ ఆదేశానికి నేపథ్యం!

03/08/2016 - 23:34

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కలిసి పనిచేయగలరని, తమను తాము ఒక బలమైన వేదికగా నిర్మించుకోగలరని ఇంకా భావిస్తుండి ఉంటే, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల దృశ్యం వారికొక పెద్ద ప్రశార్థకాన్ని మిగిల్చి ఉంటుంది. ఇకనుంచి కలిసి పనిచేయగలమని, ఇతరులకు ప్రత్యామ్నాయ ప్రకటనలు చేసిన ఆ పార్టీలు ఖమ్మంలో దేనికదిగా నిలబడ్డాయి.

03/08/2016 - 05:09

ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదికి, పడక గదికి అంకితమై పురుషాహంకారానికి బలవుతు జీవచ్ఛవంలా బతికేవారు. అర్ధంలేని ఆచారాలతో, మూఢ నమ్మకాలతో మగవాడి దౌర్జన్యంతో నిరాశా నిస్పహలతో తమలో తామే మూగవేదనని అనుభవించేవారు. అత్తల ఆరళ్లు, ఆడపడుచుల వేధింపులు, కట్టుకున్నవాడి అరాచకాలు, బాల్య వివాహాలతో నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 12 ఏళ్ల వయసున్న బాలికలను 60 ఏళ్ల ముసలాడికి ఇచ్చి కట్టబెట్టేవారు. సతీసహగమం అమల్లో ఉండేది.

03/07/2016 - 04:39

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకడు హతమైనా, హత్యచేసినా వాడు తప్పక ఏ మతానికో, జాతికో, భాషకో చెందినవాడై ఉంటాడు. అతడి మరణానికి గానీ, మారణానికిగానీ కులమతాలే కారణం కానక్కర్లేదు. కానీ రాజకీయ లబ్ధి కోరే స్వార్ధపరులు ఆ వ్యక్తి కులాన్ని, మతాన్ని పేర్కొంటూ ఆ వార్తని వివాదం చేసి కుల మత వైషమ్యాలను రగుల్చుతారు. తద్వారా - తమ పదవులు తిరిగి పొందగలమని వారి ఆశ.

03/05/2016 - 23:21

పేకాటలో గెలవడం ఎంత సహజమో ఓడడం అంతే సహజం. గెలవడానికి గల కారణాల్ని బేరీజు వేసుకున్నట్లే, ఓడడానికి గల కారణాల్ని వెతుక్కుంటాడు ప్రతీ ఆటగాడు. కాని, ప్రతీ పాలకపార్టీ అట్టహాసంగా తన ప్రణాళికను, విధి విధానాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తుంది. అయిదేండ్ల కాలపరిమితికై సిద్ధం చేసిన ఆ ప్రణాళిక, ఆచరణకు నోచుకోదు.

03/04/2016 - 23:30

మోన్‌శాంటో మళ్లీ వార్తల్లోకి వచ్చిం ది. బహుళ జాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ)..మోన్‌శాంటో జాయింట్ వెంచర్ భారత్‌కు జన్యుపరివర్తన విత్తనాల (జిఎం సీడ్స్) సరఫరాలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు కాంపిటిషన్ చట్టంలోని 3(4), 4 సెక్షన్ల ప్రాథమిక దుర్వినియోగంపై విచారణ జరపాలని ఆదేశించింది.

03/04/2016 - 06:22

ఆర్థిక రంగంలో భారత్ ఎక్కడ పొరపాట్లు చేస్తున్నదన్న అంశాన్ని ఆర్థిక సర్వే 2015-16 చక్కగా వివరించింది. అంతే కాదు వీటిని సరిదిద్దుకొనేందుకు వీలైన ఆచరణశీల మార్గాలను కూడా సూచించడం విశేషం. ముఖ్యంగా ఈ సర్వే సూచించిన అతిముఖ్యమైన అంశం వ్యవసాయానికి సంబంధించినది. మనదేశ వ్యవసాయం తృణధాన్యాల కేంద్రంగా మారిపోతున్నదన్నది సర్వే స్పష్టం చేసిన ముఖ్యమైన అంశం.

03/03/2016 - 05:49

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశద్రోహ కలాపాలు జరిగిపోవడం గురించి దేశ ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలోనే పూణె నగరంలో మరో చారిత్రక వైపరీత్యం సంభవించింది. సంఘ విద్రోహ కలాపాలకు పాల్పడినందుకు శిక్షను అనుభవిస్తుండిన సంజయ్‌దత్‌కు అర్థాంతరంగా నిర్బంధ విముక్తి లభించడం ఈ వైపరీత్యం. ఈ సంజయ్‌దత్ హిందీ చలన చిత్రాలలో నటించి పేరుమోసినవాడు.

Pages