S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

06/04/2016 - 06:41

‘గాంధీ, నెహ్రూ పేర్లను తొలగించడం అభివృద్ధికి సూచికకాదు..’ అం టూ శివసేన అధికార పత్రిక సామ్నా మే 28 నాటి సంపాదకీయంలో మోదీ రెండేళ్ల పాలనపై ఓ కథనం రాసింది. దాదాపుగా ఇలాంటి మాటల్ని గత ఆరు దశాబ్దాలుగా ప్రతి ప్రధానమంత్రి ప్రస్తావించారని, చివరికి కొన్ని మాసాలు ప్రధానిగా ఉన్న దేవెగౌడ కూడా తన హయాంలోనే అభివృద్ధి జరిగినట్టు ప్రచారం చేసుకున్నాడంటూ ఆ పత్రిక ఉటంకించింది.

06/03/2016 - 04:02

భారతీయ జనతాపార్టీ మొట్టమొదటిసారిగా హిందీ రాష్ట్రాలనుంచి ఈశాన్య ప్రాంతాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద రాష్టమ్రైన అసోంలో పూర్తి మెజారిటీతో అధికార పగ్గాలను చేపట్టింది. ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన ఆరు రాష్ట్రాల మొత్తం జనాభా కంటె అసోం జనాభా రెట్టింపుకంటె అధికం. టీ, ముడిచమురు, అడవులు, నీరు వంటి సహజవనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రం కూడా.

06/02/2016 - 06:09

‘‘తెలంగాణ సాధించామని సంబరపడుతున్నారు. ఈ సంబరాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆరునెలలు గడిస్తే కెసిఆర్‌పై తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరిగి ఆంధ్రలో కలిపేయమని ఉద్యమిస్తారు.’’ తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా ఉన్న టిజి వెంకటేశ్ చెప్పిన మాటలివి. ఆయన కోరుకున్న తెలంగాణ అది.

06/02/2016 - 06:00

కోతియుగం, రాతియుగం వంటి కృత్రిమ కాల విభాగాలను చేసినవారికి సహజ చారిత్రకపరిణామ క్రమాన్ని వివరించే ఆవిష్కరణలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ పాశ్చాత్యులు మన నెత్తికెత్తిపోయిన కట్టుకథల ప్రభావం నుంచి మన విద్యావ్యవస్థకు ఇప్పటికీ విముక్తి లభించలేదు.

05/31/2016 - 23:49

ఎంతో కాలంగా ఎదురుచూసిన ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష రాసి మృత్యువును ఆహ్వానించిన ఇద్ద రు అభ్యర్థులు. కారణం-సరిగా రాయలేదనే భావన, ఉద్యోగం దొరకదనే వేదన! పిల్లల్ని 3పోటీ2అనే క్రీడ పేరున కోచింగ్ అనే కానె్సంట్రేటెడ్ క్యాంపులో బంధించడానికై తీసుకెళ్ళుతున్న ముగ్గురు పిల్లలతో సహా తల్లిదండ్రులు కామారెడ్డిలో ఘోర ప్రమాదానికి గురి!

05/31/2016 - 00:04

‘‘గుడారం రోజు కిరాయి ఐదువేలు. మూడు నెలలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెంట్ వేసి విద్యార్థుల చేత ధర్నాలు చేయిస్తున్నారు. ఇంత డబ్బు విద్యార్థులకు ఎక్కడినుండి వచ్చింది? అంటే విద్యార్థి సంఘం పైన రాజకీయ జోక్యం ప్రత్యక్షంగా పెరిగింది’’, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజకుమార్ సాహు మే 10న ఒక పత్రికా విలేకర్ల సమావేశంలో అన్న మాట ఇది.

05/30/2016 - 05:08

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 19వ తేదీన వెలువడినప్పటినుంచి కాంగ్రెస్, వామపక్షాల స్పందనను గమనించగా తాము ఎందుకు ఓడామన్న విషమైగాని, మునుముందు ఏమి చేయాలన్న ప్రశ్నపైకాని వారికి ఏమీ అర్థమవుతున్నట్టు లేదు. ఇందులో కొత్త కూడా ఏమీ కనిపించదు. గతంలోనూ ఇదేవిధంగా ఓడారు. ఇదే పద్ధతిలో అయోమయపు స్పందనలు చేశారు. గంతలు కట్టుకొని తొట్రుపడుతూనే పోయారు.

05/29/2016 - 03:26

బ్రాహ్మణులను, మనుస్మృతిని, మనుధర్మ శాస్త్రాన్ని, బ్రాహ్మణిజాన్ని, హిందూమతాన్ని అహర్నిశలూ కించపరుస్తూ మాట్లాడడం పరిపాటై పోయింది ఇటీవల కొందరికి.

05/28/2016 - 00:55

సమయానుకూలమైన రీతిలో సాంస్కృతిక దౌత్యాన్ని ప్రయోగించటంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట. గత రెండేళ్ల కాలంలో హిందూమతం, బౌద్ధమతం, ఇస్లాముల మధ్య ఉన్న అంతర్లీన బంధాన్ని ఉపయోగించుకుని, విదేశీ సంబంధాలను బలోపేతం చేయగలిగారు. ఇందుకు తాజా ఉదాహరణ, ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళాలో అనుసరించిన వ్యూహమే.

05/27/2016 - 05:13

దాదాపు 50 లక్షల మంది ఇన్సూరెన్సు తీసుకున్న కార్యకర్తలు, పార్టీ ఫిరాయించిన 17 మంది ఎమ్మెల్యేలు, అధికారం వచ్చి రెండేళ్లయినా ఇంతవరకూ రాని పదవుల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్న తమ్ముళ్ల సాక్షిగా..నేటి నుంచి మొదలుకానున్న టిడిపి మహానాడు కార్యకర్తల బ్రహ్మోత్సవం మూడురోజులు జరగనుంది.

Pages