S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/15/2017 - 01:22

తమిళనాడులో రాజకీయ అస్థిరతకు, అధికార అన్నాడిఎంకె పార్టీలో ఆధిపత్య పోరాటానికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాలే కారణమని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఇంతటి సుదీర్ఘ గందరగోళం తలెత్తటానికి కారణం- జయలలిత తన తర్వాతి నాయకత్వాన్ని ముందుగా తయారు చేయకపోవడమే. కనీసం తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలోనైనా ఆమె తన రాజకీయ వారసులెవరో చెప్పలేదు.

02/14/2017 - 01:06

రాజకీయాలలో తిరుగుబాట్లు కొత్తకాదు. అప్పుడెప్పుడో ఔరంగజేబు తండ్రిపై తిరుగుబాటు చేశాడు. ఈమధ్య అఖిలేష్ యాదవ్ ములాయంపై తిరుగుబాటు చేశాడు. చరిత్ర పునరావృతమయింది. తమిళనాడులో ఆనాడు నెడుంజెళియన్‌మీద కరుణానిధి తిరుగుబాటు చేస్తే, ఈనాడు పన్నీరు సెల్వం ఆ పాత్ర పోషించాడు. తమిళనాడులో తిరుగుబాటు రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. ద్రవిడ సంస్కృతి పేరుతో పెరియార్ రామస్వామి ఒక ఉద్యమం ప్రారంభించాడు.

02/13/2017 - 00:54

కాలానుగుణంగా పాలకుల స్వరం మారుతుందనడానికి ఈసారి బడ్జెటే చక్కని ఉదాహరణ. గత మూడు సార్లు స్మార్ట్ సిటీల చుట్టూ, మేక్ ఇన్ ఇండియా చుట్టూ, స్టార్టప్‌ల చుట్టూ తిరిగిన బడ్జెట్ ఈసారి గ్రామాలవైపు, పేదవారివైపు, రైతుల వైపుగా దృష్టి సారించింది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్, రాబోయే సాధారణ ఎన్నికల నజరానాగా ప్రవేశపెట్టడం జరిగిందనేది కాదనలేని సత్యం.

02/12/2017 - 00:22

మహిళా సమస్యలకు పరిష్కారం అనే్వషించేందుకు ఏపి సర్కారు మూడురోజుల పాటు ఆకాశమంత ‘డిజిటల్ పందిరి’ వేసి, స్కూలు పిల్లల పేరంటాలతో పవిత్రనదీ సంగమతీరాన ‘మహిళా పార్లమెంటు’ సమ్మేళనం జరుపుతోంది. అతివలు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై చర్చించి వాటికి ఉపాయ మార్గాలు కనుగొంటే సంతోషమే. కానీ, ఈ మూడు రోజుల మహిళల ముచ్చట్లు ఆ దిశగా పయనించాయా?

02/11/2017 - 01:10

భారతదేశ దిశ, దశలను మార్చివేసిన రెండు చారిత్రాత్మక సంఘటనల శతాబ్ది ఉత్సవాలను జరుపుకొనడం ఈ తరం చేసుకున్న అదృష్టం. ఈ రెండు సంఘటనల మూల ధర్మం, సిద్ధాంతం ఒకటే. అణగారిన ప్రజల ఉద్ధరణకు కార్యరూపం ఒకటైతే, పీడిత శోషిత ప్రజల అభివృద్ధికి ‘ఏకాత్మ మానవతావాదం’, ‘అంత్యోదయ’ సిద్ధాంతాలను ప్రవచించిన మహానుభావుడు జన్మించి వందేళ్లు కావడం మరొకటి.

02/10/2017 - 00:46

శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అం టున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ (్ఫజికల్లీ ఛాలెంజ్‌డ్ పెర్సన్స్), ‘మరొక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ (అదర్‌వైజ్ ఏబుల్డ్ పెర్సన్స్) అని వీరికి గౌరవనామాలు.

02/09/2017 - 00:15

నేపాల్‌లో చైనా పెట్టుబడులు పెరుగుతుండడం మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కుట్రలో భాగం! నేపాల్‌కు వివిధ దేశాల నుంచి లభిస్తున్న పెట్టుబడులలో చైనావారి వాటా అరవై ఎనిమిది శాతమన్నది ఇప్పుడు వెల్లడైన వాస్తవం. గత ఆర్థిక సంవత్సరం నేపాల్‌కు తరలివచ్చిన ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’- ఫారిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ-లో చైనా వాటా నలబయి శాతం!

02/08/2017 - 01:08

ప్రభుత్వాల నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి దానికి డబ్బు డిమాండ్ చేయటం ఓ సంస్కృతిగా మారుతోంది. తెలంగాణలో ఇప్పుడు ఇది మరింత ఎక్కువగా కన్పిస్తోంది. ఈ సంస్కృతి నిజంగా ‘సంక్షేమం’ కిందకు వస్తుందా? ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి నెమ్మదిగానైనా దీనికి పగ్గాలు వేయటం అవసరం.

02/07/2017 - 01:09

‘హిపోక్రసీ’ అనే పదం, ‘్భరతీయుడు’ అనే పదం సమానార్థకాలు! మనవాళ్లు లోకవంచనే కాదు, ఆత్మవంచన కూడా చేసుకోగలరు. ‘అన్‌సంగ్’ అనే ఆంగ్ల పదానికి ‘అనాదృత’ అనే సంస్కృత పదాన్ని సమానార్థకంగా ఇప్పుడు వాడుతున్నారు. ‘మరుగునపడిన మాణిక్యాలు’, ‘మట్టిలో మాణిక్యాలు’ అని కూడా అంటున్నారు. దేశంలో భారీ సంఖ్యలో ‘సెలబ్రిటీస్’ ఉన్నారు. వారికి ధనమూ కీర్తి పుష్కలంగా లభిస్తున్నాయి.

02/06/2017 - 01:07

‘కుక్కతోక వంకరెందుకో..’ తెలియనట్లే బడ్జెట్ రహస్యాలు అంత సులువుగా అర్థం కావు. ఆర్థికశాస్త్ర నిపుణులే వి విధ రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వుంటారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక విశే్లషణలు ప్రతి బడ్జెట్ సందర్భంగా చూస్తునే వుంటాం. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకోవడం చదువుకున్నవారికే కష్టం. అందుకే ప్రతి బడ్జెట్‌ను ఓ రొటీన్ వ్యవహారంలా చూడడం అలవాటైంది.

Pages