S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

06/23/2016 - 23:51

దేశంలో గాంధీ కుటుంబానికి ఇక శంకరగిరి మాన్యాలే దిక్కవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఓటమిపాలై భారత రాజకీయపటంలో బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని చూసి ఈ సారి శ్రీమతి సోనియా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీలు ఎన్నికల ఫలితాలు చూసి బిక్కచచ్చిపోయారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

06/23/2016 - 06:03

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నుండి తాత్కాలిక అమరావతికి తరలిపోవాలా? వద్దా? అన్న తటపటాయింపునకు గురికావడం కుతూహలగ్రస్తులకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో ‘‘కలకల మంటున్న అవశేష ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణం నిర్మానుష్యమై వెలవెల పోతున్న’’ దృశ్యం కొందరి ఉత్కంఠకు ప్రేరకం.

06/21/2016 - 23:56

ప్రపంచంలో ఎక్కడ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొన్నా ఎక్కువగా నష్టపోయేది మహిళలు, బాలలే. ప్రస్తుతం ఇస్లామిక్ ఉగ్రవాద భూతం ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న మారణకాండలో సహితం వీరే సమిధలవుతున్నారు. ఇంగ్లాండ్‌లోని మిర్రర్ పత్రిక కథనం ప్రకారం రాబోయేతరం హంతక ఉగ్రవాదులకు జన్మ ఇవ్వడానికి 31 వేలమంది గర్భిణి స్ర్తిలను ఐఎస్‌ఐఎస్ సిద్ధంగా ఉంచింది.

06/21/2016 - 04:34

ఈనెల అలహాబాద్‌లో భాజపా జాతీ య కార్యవర్గ సమావేశం ఆర్భాటంగా జరిగింది. అంటే 2017లో రాబోయే యుపి ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలహాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. 1. సేవ, 2. సంతులనం, 3.సంయమనం, 4.సమన్వయం, 5. సకారాత్మకత, 6. సంవాదం.

06/20/2016 - 05:26

ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో రెం డు ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించా యి. ఒకటి గాంధీభవన్‌లో, రెండవది తెలంగాణ భవన్‌లో. అవేమిటన్నది తెలిసిందే. గాం ధీభవన్‌లో ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జ్ అయిన దిగ్విజయ్‌సింగ్, పార్టీ ప్రముఖుల తో సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానమైన చర్చనీయాంశం కాంగ్రెస్ వాదు లు అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లకుం డా ఆపడం ఎట్లా, పార్టీని పటిష్ట చేయడం ఎలాగన్నది.

,
06/19/2016 - 02:20

రాజకీయాల్లో నైతిక విలువలు నేతిబీర చందం. రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని, తాము విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నామని, అసలు తామొక్కరే నైతిక మడి కట్టుకున్నామని ఎవరైనా చెబితే, సదరు నైతికమూర్తుల వ్యక్తిత్వాన్ని నిలువునా శంకించాల్సిన రోజులివి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈమధ్య ఫిరాయింపు రాజకీయాలపై వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారాయని మహా ఆవేదన చెందారు.

06/18/2016 - 00:19

నసీరొద్దీన్ కొడుకుతో కలిసి గాడిదను తోలుకుంటూ సంతకు పోతుంటాడు. ఎదురుపడిన కొందరు, గాడిదను నడిపించుకుంటూ మీరు నడుచుకుంటూ పోవడమేంటని ఆశ్చర్యపడతారు. దీంతో కొడుకును గాడిదపై ఎక్కించి తాను నడుస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన మరికొందరు, తండ్రి నడుస్తూ, కొడుకును గాడిదపై కూర్చుండబెట్టడమేంటని అంటూ వాపోతారు.

,
06/16/2016 - 23:35

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలు సహజంగానే ప్రపంచం అంతటా ఆసక్తి కలిగిస్తుంటాయి. సంవత్సరం పైగా జరిగే ఈ ప్రక్రియ కలిగించే ఆసక్తి బహుశా మరే దేశాధినేత ఎన్నిక కలిగించదు. అయితే ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నికలు తీవ్రమైన అలజడిని కలిగిస్తున్నాయి.

06/16/2016 - 05:23

రాజ్యాంగపు వ్యవహారాలకు రాజకీయాలను పులమడం, రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగపు ముసుగును తొడగడం దశాబ్దులుగా నడిచిపోతున్న తతంగం. అందువల్లనే రాజ్యాంగ సంస్కరణల గురించి ఏకాభిప్రాయం కుదరలేదు..లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి వీలైన పద్ధతులను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏకాభిప్రాయం గురించి మళ్లీ ధ్యాస కలుగుతోంది.

06/15/2016 - 03:46

గ్రీన్‌హౌజ్ శాతం జనహననం
వాయువుల వివరాలు
ఉత్పత్తి రంగం (సంవత్సరానికి)
........................................................................
కట్టడాలు, 6.4 4.3 మిలియన్లు
నిర్మాణాలు
రవాణా 14 1.0 మిలియన్లు

Pages