S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

04/26/2016 - 23:38

జల దృశ్యంలో ఒక మొక్కగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ 16 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో 29వ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ దృష్టిని ఆకట్టుకునే మహా వృక్షంగా ఎదిగింది. ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదమే టిఆర్‌ఎస్‌కు ఊపిరిగా నిలిచి, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ప్రభుత్వ పని తీరే అసలైన బలం. బుధవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతోంది.

04/25/2016 - 23:38

పరిశోధనాత్మక పాత్రికేయంలో ప్రమాణాలు పాటిస్తూ, నిరవధికంగా పోరాడుతున్న జర్నలిస్టులకు ప్రణామాలు. ప్రభుత్వాలు చేయలేని పనిని జర్మన్ పత్రికలు చేయడం ప్రపంచంలో ఎనిమిదవ వింత. పనామ అనే దేశం ఉత్తర దక్షిణ అమెరికాలకు మధ్యలో ఉం ది. ఇక్కడ ఎందరో ప్రముఖులు తమ బ్యాంకు ఖాతాలను తెరిచారు.

04/25/2016 - 07:08

ఉత్తరాఖండ్ పరిణామాలు చివరకు ఏ విధంగా ముగుస్తాయన్నది అట్లుం చి, అన్ని పార్టీలు కలిసి దేశ ప్రజలకు ఒక మాట ఇస్తే బాగుంటుంది.

04/24/2016 - 05:18

హరప్పా, మొహంజోదారోలలో చక్కటి ప్రణాళికలతో పట్టణ నిర్మాణాలు జరిగాయని, తాగునీటి సౌకర్యాలతో పాటు, మురుగునీటి కాలువల వ్యవస్థ అభివృద్ధికరంగా ఉండిందని చరిత్రలో చదుకున్నాం. ఇది క్రీస్తుపూర్వం నాటి ప్రగతి చిహ్నం. దాదాపు ఐదువేల సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పారిశ్రామిక విప్లవంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి.

04/23/2016 - 04:15

వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈనాటికీ రైతు కష్టపడుతూనే ఉన్నాడు. స్వల్ప ఋణాలు కూడా చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పదివేల రూపాయలు చెల్లించలేక నల్గొండలో కొనే్న ళ్ల క్రితం రైతు ఆత్మహత్యకు పాల్పడగా, రూ.9 వేల కోట్ల రుణం ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేశాడు. రైతు ఆర్థికంగా బలపడేందుకు, రైతుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం చాలా ఏర్పడింది.

04/20/2016 - 22:03

వెన్న వంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు? నువ్వేనా??
కొవ్వెక్కిన నవ చైనా!
ఎదరొమ్మున బాకు రువ్వి
యేమెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ
ఛీఛీ విష వీచీ..
సామ్యవాద మనుపేరిట
సామ్రాజ్య పిపాస దీర్చ
నెంచు కుటిల జాతీ!
ఇదా రాజనీతి??’’

04/19/2016 - 23:54

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు.

04/19/2016 - 00:40

కృపాల్‌సింగ్ పేరు విన్నారా? అతనిని 1992లో వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా చూశాను అని పాకిస్తాన్ చెబుతున్నది. గత పాతిక సంవత్సరాలుగా ఇతడు కోట్ లక్‌పాట్ జైలులో (పంజాబ్ ప్రావెన్స్) మగ్గుతున్నాడు. 2016, ఏప్రిల్ 13న అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరణించినట్లు ప్రకటించారు. గూఢచారి అంటూ పాక్ ప్రభుత్వం అతనిపై నేరారోపణ చేసింది.

04/18/2016 - 06:28

పలువురు ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ 2019 ఎన్నికలకోసం జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ ఉద్దేశమని, అందుకోసం కాంగ్రెస్,వామపక్షాలతో సహా వీలైనన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

04/17/2016 - 05:28

ఇంత అస్తవ్యస్తంగా ఉన్న విద్యారంగం బాగుపడాలంటే, కొఠారీ తోపాటు హైదరాబాద్, అలహాబాద్ హైకోర్టులు ఆదేశించినట్టు అధికారుల, ప్రజా నాయకుల, ఉపాధ్యాయుల పిల్లలందర్ని నైబర్‌హుడ్ పాఠశాలల్లోనే చదివించాలి. మాధ్యమం (మాతృభాషనే శాస్ర్తియమైనది) ఏదైనా అందరికి కామన్ విద్యా బోధన జరగాలి. ఈలెక్కన కెసిఆర్ తను చదువుకున్న దుబ్బాక పాఠశాలకు ఏకంగా దాదపు రూ.11 కోట్లను మంజూరు చేశారు.

Pages