S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

11/15/2016 - 22:34

దళితులు, వామపక్షాల మధ్య ఐక్యత అవసరమంటూ కొంతకాలంగా ఉన్నమాట ఇటీవల కొంత బిగ్గరగా వినవస్తున్నది. కానీ ఎక్కువ ముందుకుపోవటం లేదు. అలా పోవటం తేలిక అనిపించటం లేదు కూడా. అందుకు పలు కారణాలున్నాయి. అవి స్థూలంగా అందరికీ తెలిసినవే. వాటిని అధిగమించటం ఎట్లాగన్నది మాత్రం ఎవరికీ అర్థమవుతున్నట్లు లేదు.

11/15/2016 - 06:33

భారత భూభాగంలోకి చైనా చొరబడటం 1950 నుంచే మొదలైంది. ‘మానస సరోవర్’ ప్రాంతం అనాదిగా భారతీయులకు పుణ్యతీర్థ స్థలి. దీన్ని టిబెట్టుతోబాటు చైనా కబళించింది. నేపాల్ ప్రాంతాల్లో చైనా పేపర్ వీ సాలు ఇవ్వటం ఏమిటి..? అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మొత్తం హిమాలయ సానువులను- నేపాల్, టిబెట్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలను హస్తగతం చేసుకోవాలన్న నిర్ణయాత్మక ప్రణాళికలను చైనా అమలుచేస్తున్నది.

11/13/2016 - 21:46

పోపుల డబ్బాల్లో, గల్లా పెట్టెల్లో దాచుకున్న డబ్బులని చాటుమాటుగా లెక్కించుకునే దంపతులు, మోడీ దెబ్బతో ఒక్కదగ్గర కుప్పపోసి లెక్కించుకోగా ఓ ఇంట్లో నాలుగు లక్షలకు పైగా తేలిందని వార్త! ఇందులో అత్యధిక రూపాయలు 500, 1000 నోట్లే కావడం గమనార్హం!

11/13/2016 - 06:47

ప్రధాని మోదీ హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావం దాదాపు అన్ని రంగాలనూ తాకింది. ఇపుడు జేబులో వెయ్యిరూపాయల నోటున్న వాడి కంటే వందరూపాయలున్న వాడే ధనవంతుడి కింద లెక్క. దేశ ఆర్థిక రంగాన్ని కుదిపేసేలా మోదీ ప్రకటన వెలువడిన రాత్రి- వెంటనే మెజారిటీ ప్రజలు స్వాగతించారు. నల్లధనంతోపాటు, నకిలీ కరెన్సీపై మోదీ చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’గా దీన్ని అభివర్ణించారు.

11/12/2016 - 08:32

దేశ ఆర్థికవ్యవస్థకు సమాంతరంగా నడుస్తూ, కొన్ని సందర్భాల్లో మన విధానాలు, ప్రణాళికలను కూడా శాసిస్తున్న నల్లధనంపై మోదీ ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. సమాజంలోని కీలక రంగాలను చెద పురుగులా తినేస్తున్న నల్లధనం నిర్మూలనకు కేంద్రం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఊహించడానికి కూడా భయపడ్డ నిర్ణయాలను మోదీ సర్కారు సాహసోపేతంగా అమలు చేసిందని జాతి యావత్తూ కీర్తిస్తోంది.

11/11/2016 - 07:17

ఇటీవల మనీలాలో ‘మెగసెసే అవార్డు’ అందుకుని ప్రముఖ సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ, బెజవాడ విల్సన్ భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించగా, విల్సన్ గురించి వివరాలు తెలిసిన వారు తక్కువ మందే అని చెప్పాలి. విల్సన్‌కు మెగసెసే పురస్కారం ఎందుకు వచ్చిందీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో అతడికి గల సంబంధం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. విల్సన్ సాగించిన ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ ఉద్యమం అసామాన్యమైంది.

11/10/2016 - 05:36

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామాంకితు డు-నామినీ-డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కానున్నట్టు రష్యా దేశంలోని సైబీరియాలో ఒక ‘మంచు ఎలుగుబంటి’ జోస్యం చెప్పిందట! ఆ జోస్యం నవంబర్ 8న అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో వాస్తవంగా ధ్రువపడింది! ఓడిపోతాడన్న ఉద్ధృత ప్రచారానికి గురి అయిన ట్రంప్ గెలిచి కూర్చున్నాడు, డెమోక్రాటిక్ పార్టీ ‘నామాంకిత’-నామినీ- సుప్రసిద్ధ హిల్లరీ క్లింటన్‌ను ఓడించగలిగాడు!

11/09/2016 - 05:09

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ని జంగా శూన్యమా? కొన్ని మాటలు పైకి వినేందుకే ఆశ్చర్యకరంగా తోస్తాయి. అయినప్పటికీ ‘కళ్లతో ప్రత్యక్షంగా చూడడమే అంతిమ రుజువు’ అనే మాట ప్రకారం ఈ రచయిత ఇటీవల అయిదు నీటి పారుదల పథకాలను చూసిన తర్వాత, ఈ ఆరోపణల పట్ల ఆశ్చర్యం మరింత పెరిగింది.

11/07/2016 - 23:43

భారత్‌పై కక్షగట్టిన పాకిస్తాన్ ఇటీవల ఒక వ్యూహానికి శ్రీకారం చుట్టింది.

11/07/2016 - 00:43

పాలకపక్షాలు ప్రజాభిమానాన్ని పూర్తిస్థాయిలో సాధించుకోవడం ఎంత అవాస్తవమో ప్రజావ్యతిరేకతను పెంపొందించుకోవడం అంతే నిజం. ప్రజాస్వామ్యంలో పాలకపక్షాలే ప్రతిపక్షాలకు జవసత్వాల్ని అందిస్తాయి కూడా! గత 70 ఏళ్లుగా ఈ దేశంలో జరుగుతున్నది ఇదే! ఎన్నికల వేళ మాట్లాడే మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసే చేష్టలకు పొంతనే వుండదు. అతికష్టం మీద అయిదేళ్లు పాలన చేయడం కత్తిమీద సాములా మారింది.

Pages