S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/26/2016 - 07:23

ప్రస్తుతం మళ్లీ వివాదంగా మారి చర్చ సాగుతున్న ‘తలాక్’ ప్రశ్నకు మూల కారణం- ముస్లిం సమాజం తన సంస్కరణలు తాను తెచ్చుకోకపోవటం. ఆ పని జరిగి ఉన్నట్లయితే బయటి సమాజానికి గాని, చట్టాలూ- రాజ్యాంగానికి గాని, చివరకు తమను ‘వ్యతిరేకుల’ని భావించే వర్గాలకు గాని ఆ విషయాలలో ‘జోక్యం’ చేసుకునేందుకు అవకాశమే లభించదు. కాని భారతదేశంలోని ముస్లిం సమాజపు పెద్దలు ఈ సాధారణమైన తర్కాన్ని గుర్తించటం లేదు.

10/24/2016 - 23:43

మానవ చరిత్రలో ఒక గతి తర్కం ఉన్నదంటారు సైద్ధాంతికులు. నూరేండ్లు నత్తగుల్లగా నడిచిన చరిత్ర ఉన్నట్లుండి ఒక్కసారి మలుపు తిరిగి జవనాశ్వంలా పరుగిడవచ్చు. 1947-1971, 1977-1991, 2014 ఇలా కొన్ని సందర్భాల్లో భారతదేశ చరిత్రలో ప్రభంజనాలు వీచాయి. భారత్‌పై పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉంది.

10/24/2016 - 06:43

నిన్నటిదాకా అటవీ జిల్లాగా, ఆదివాసుల జిల్లాగా అక్షరక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదటి జిల్లాగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ‘ఆదివాసీ అస్తిత్వాన్ని’ కోల్పోతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి. జలపాతాలకు, ప్రకృతి సోయగాలకు, అటవీ, జల సంపదకు,పత్తితోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యంగా మదనపల్లి తర్వాత ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండలాల్లో టమాటోలు పేరెన్నికగన్నాయి.

10/23/2016 - 01:12

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అడుగులు విచిత్రంగా, విభిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబు వ్యవహారశైలిని పరిశీలించిన వారెవరికైనా ఇలాంటి అనుమానమే ఏర్పడుతుంది. ఈ ఇద్దరిలోనూ ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తోంది. కెసిఆర్ విషయంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది.

10/22/2016 - 01:18

‘తలాక్’ అన్న పదానికి ‘విడిపోవడం’ అని అర్థం చెప్పుకోవచ్చు. ఇస్లాం మత సూత్రాల ప్రకారం భర్త మూడుసార్లు ‘తలాక్, తలాక్, తలాక్’ అని ఉచ్చరించి అత్యంత సునాయాసమైన పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చేయవచ్చు. ఒకవేళ ఆమెనే తిరిగి వివాహం చేసుకోదలిస్తే- ఆ స్ర్తి మరొక పురుషుడిని వివాహం చేసుకుని కొంతకాలం కలిసి జీవించి అతని నుంచి విడాకులు పొంది, తిరిగి తన మొదటి భర్త వద్దకు చేరుకోవచ్చు.

10/20/2016 - 22:05

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మన దేశంలో జరిగిన ఉద్యమాల గురించి ఆలోచించేటప్పుడు- సుందర్‌లాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్, మహేష్ చంద్ర మెహతా వంటి కొందరు పురుష పర్యావరణ ఉద్యమకారుల పేర్లు కొందరికి జ్ఞాపకం రావొచ్చు.

10/20/2016 - 03:07

దురాక్రమించిన విదేశీయ మూకలపై ఒకప్పుడు అగ్నివర్షం కురిపించిన ‘అజనాభం’ ఇప్పుడు విదేశాల నుంచి ఆయుధాలను కొంటోంది. పిడుగుల జడి వంటి అస్తశ్రస్త్రాలను సంధించిన ఈ సనాతన భూమి ‘బడుగు’ రూపం ధరించి ఇతర దేశాల వద్ద తూటాలను, తుపాకులను అభ్యర్థిస్తోంది! మన దేశం ‘అజనాభం’.. అంటే సృష్టికి జన్మస్థానం. తొలి మానవులు భారతదేశంలో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించారు.

10/18/2016 - 23:48

నగరాలకు, గ్రామాలకు మధ్య దూరమెంత?- అనే పాత ప్రశ్న ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న దానిని బట్టి మరొక మారు ముందుకు వస్తున్నది. గత రెండేళ్లుగా ముఖ్యంగా ఇటీవలి మాసాలలో- నగరాలలో వినవస్తున్న మాటలు ఏమిటో తెలిసిందే. కానీ, గ్రామీణ ప్రజానీకం ఏమనుకుంటున్నదీ తెలియటం లేదు. బహుశా దినపత్రికల జిల్లా టాబ్లాయిడ్లలో అవి రిపోర్టు అవుతుండవచ్చు. అవి నగరాలలో అందుబాటులో ఉండవు గనుక విషయం తెలిసే అవకాశం లేదు.

10/17/2016 - 22:55

భారత్‌లోని మొత్తం 125 కోట్ల మంది ప్రజలు నేడు ప్రధాని నరేంద్ర మోదీకి అండగా ఉంటే, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పాకిస్తాన్ ‘పే రోల్స్’లో ఉన్నారు. లోగడ 1962, 1965, 1971 సంవత్సరాల్లో పాక్‌తో యుద్ధాలు వచ్చాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. దేశంలోని ధర్మాధికారులంతా ప్రజల మధ్యకు వచ్చి జాతికి ధైర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందించాలి.

10/16/2016 - 23:23

పోచంపాడు నీటిపారుదల ప్రాజెక్టు కాలువల నిర్మాణం పనుల పర్యవేక్షణకై వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వస్తే- ‘విలువ తక్కువ’గా భావించి దాన్ని కాదని- చేనేతనే గౌరవ కులవృత్తిగా నమ్ముకొని జీవనం కొనసాగిస్తే... దినసరి కూలీగానే బతుకీడుస్తున్నానంటూ 64 ఏళ్ల వెంకటస్వామి నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నాడు.

Pages