S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/15/2016 - 05:57

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన నిరాడంబరత్వాన్ని ఆవిష్కరిచారు. చలన చిత్ర నటుడు పవన్ కల్యాణ్ కూడా తన నిరాడంబరత్వాన్ని అనావరణం కావించడం తెలుగునేలపై సంభవించిన సమాంతర పరిణామం. అంతరం లేకపోలేదు. సుదీర్ఘరాజకీయ ప్రస్థాన స్మృతులు చంద్రబాబు భావోద్వేగానికి గురిచేశాయి. చేశాయని ప్రచారమైంది. ఇటీవలికాలంలో చంద్రబాబు నాయుడు తరచు భావోద్వేగానికి గురి అవుతున్నారు.

09/14/2016 - 06:21

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ఎన్‌జివో. లండన్‌లో 1961లో ఒక ఆంగ్ల కార్మిక న్యాయవాది పీటర్ బెనిసన్ దీన్ని ప్రారంభించాడు. పోర్చుగల్‌లో నాటి నేతల మానవహక్కుల ఉల్లంఘనను ఉటంకిస్తూ ప్రతిరోజు ఏదో ఓ చోట ప్రజలపై పాలకులు జరుపుతున్న దౌర్జన్యాలను నిరసిస్తూ ఆయన ఆంగ్లపత్రికలలో వ్యాసాలు రాసేవాడు. అదే కొందర్ని మేల్కొల్పింది. బెనిసన్‌కు కొందరు సహచరులు అనుచరులు లభించారు.

09/12/2016 - 23:48

గుజరాత్ రాష్ట్రంలో ‘ఉనా’ అనే ప్రదేశంలో కొన్నాళ్ల క్రితం అల్లర్లు జరిగాయి. రాహుల్ గాంధీ వారిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడికి రమాబెన్ అనే ఆమె వచ్చి పెద్దగా ఏడ్చింది. రాహుల్‌గాంధీ ఆమెను ఓదారుస్తున్న చిత్రాలు టీవీల్లో ప్రదర్శించారు. ఆ తర్వాత ఫోటోసెషన్ ముగిసింది. వెళ్లిపొండని జర్నలిస్టులకు చెప్పారు. రాహుల్ ఓ విమానం ఎక్కి న్యూఢిల్లీకి చేరుకున్నారు.

09/12/2016 - 01:05

సింగూరు రైతులనుంచి ‘‘్భములు సేకరించిన పద్ధతిని’’ తప్పుపడుతూ సు ప్రీంకోర్టు ఆగస్టు చివరి రోజున ఇచ్చి న తీర్పును సరిగా అర్థం చేసుకోవడానకి బదులు సిపిఎం నాయకత్వం, తన చర్యలను సమర్థించుకునేందుకు సాకులను వెతుకుతున్నది. 2006లో సిపిఎం ప్రభుత్వం టాటాకార్ల పరిశ్రమకోసం 997 ఎకరాలను సేకరించడం తెలిసిం దే. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి భూసేకరణ తప్పదన్నది సిపిఎం వాదన.

09/11/2016 - 04:16

డంత రాగం తీసి పిట్టంతపాట పాడాట్ట వెనుకటికో గానగంధర్వుడు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రకటన కూడా అలాగే ఉంది. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తున్నామంటూ జైట్లీ చేసిన ప్రకటన ఏపి ప్రజలను ఆగ్రహోదగ్రులను చేసింది. హోదాపై ప్రకటన చేసేవరకూ అమిత్‌షా ఏపికి రావద్దని, బిజెపి నేతలను అడ్డుకోవాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి గతంలో పిలుపునిచ్చారు.

09/10/2016 - 07:47

నిరంతరం పారే నీరే స్వచ్ఛంగా వుం టుంది. నాల్కలపై నానే భాషనే చిరకాలం కొనసాగుతుంది. ఇంటి భాష, తల్లి భాషనే చిన్నారులను నిజాయితిగా ఎదిగిస్తుంది. అధ్యయనాన్ని, అవగాహనను కలిగిస్తుంది. తలెత్తుకొని జీవించేలా చేస్తుంది. ప్రపంచంలో తలెత్తుకుంటున్న దేశాలన్నీ ఈ భాషా నీతితోనే లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి.

09/09/2016 - 00:10

సుమారు సంవత్సరంన్నరగా వాయిదావేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని అయిష్టంగానే చేపట్టడానికి రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఆయన పట్ట్భాషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు రెండు ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటగా తల్లి సోనియాగాంధీ ఆరోగ్యం క్షీణిస్తూ వుండడంతో ఆమెను ఇంకెంత మాత్రం పార్టీ సారథ్యం స్వీకరించడానికి వెనుకడుగు వేయవద్దని వత్తిళ్ళు పెరుగుతున్నాయి.

09/08/2016 - 04:18

బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతుండడం సహ జ చారిత్రక పరిణామం. క్రీస్తుశకం 1947 నాటి అఖండ భారత విభజన సందర్భంగా బలూచీప్రాంతం, బలూచీ ప్రాం తంలోని సంస్థానాలు పాకిస్తాన్‌లో కలిసిపోవడం కృత్రిమ పరిణామం. ఈ కృత్రిమ పరిణామం కారణంగానే బలూచిస్థాన్ పాకిస్తాన్ దమన కాండకు ఏడు దశాబ్దాలుగా గురి అవుతోంది. చైనా ప్రభుత్వం క్రీస్తుశకం 1949 నుంచి టిబెట్‌ను కొల్లగొడుతోంది.

09/06/2016 - 23:53

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విజయానికి గల ప్రాధాన్యం నైతికతకు ఉండదు. నాయకులు గెలుపు గుర్రాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. విజయంకోసం ప్రజలను ఉద్రేకపరిచే ప్రసంగాలు చేస్తారు. ఇది మనం అన్ని రాష్ట్రాల్లోను చూశాము. అవినీని అంతం చేస్తానని ప్రతిజ్ఞపూని అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పటికి ఐదారుగురు ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోయారు. ముగ్గురు మంత్రులు బర్తరఫ్ అయ్యారు.

09/05/2016 - 04:58

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సామాజిక సంస్కరణలకోసం కృషి చేసే సంస్థ లు ఏవైనా ఉన్నాయా అనే సందేహం కలుగుతున్నది. సంస్కరణలు అనడంలో ఉద్దేశం పేదలను ఆదుకోవడం, పిల్లలకు ఆశ్రమాలు నెలకొల్పి చదువులు చెప్పించడం, వృద్ధులకు సహాయపడడం, వంటివి కాదు. అవి దాతృత్వాలు, ధర్మకార్యాలవుతాయి. అవి అవసరమే. తగిన న్ని ఉన్నాయి కూడా.

Pages