S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/11/2019 - 05:10

నగరాలు నిలువున పెరుగుతుండడం మన జాతీయ జీవన ప్రగతి రథప్రస్థానాన్ని నిలదీస్తున్న వైపరీత్యం! అంగారక గ్రహానికి అంతరిక్ష నౌకను పంపగల దేశంలో అంగార జ్వాలలు అంతస్థుల భవనాలను ఆహుతి కొంటుండడానికి కారణం ఈ ‘నిలువు’ వైపరీత్యం! పాత గోడలు వర్షాకాలంలో కూలిపోవచ్చు, కాని కొత్త కట్టడాలు ఎండల కాలంలో సైతం కూలిపోతున్నాయి.

12/10/2019 - 23:46

‘న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోరాదు.. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుంది.. సత్వర న్యాయం అంటూ ఎక్కడా ఉండదు.. కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న సమయం, అందులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని పరిస్థితి, వైఖరిని మనం పునఃపరిశీలించాల్సి ఉంది..

12/10/2019 - 23:34

శరణార్థుల శిబిరంలో
పురుడు పోసుకున్న శిశువు,
ఆకాశపు నీడలందు
ఆటలాడు చిన్ని శిశువు,
తరతరాల చారిత్రక
సహనానికి సింధువు...
సంధించడు, చిందించడు
ఒక నిరసన బిందువు!

12/10/2019 - 23:22

పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారి క్వామర్ జావీద్ బజవా పట్ల అక్కడి సైనిక దళాలలో వ్యతిరేకత పెరుగుతుండడం పెద్దగా ప్రచారం కాని పరిణామం. పదవీ కాలవ్యవధి ముగిసిన తరువాత మరో మూ డేళ్లు పదవిలో కొనసాగాలన్న బజవా వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ‘బెడిసికొట్టుడు’కు కారణం సైనిక దళాలలో బజవాకు తగ్గిపోయిన పలుకుబడి.

12/05/2019 - 00:44

మన అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోని సముద్ర జలాలలో గూఢచర్య కలాపాలను నిర్వహిస్తుండిన చైనా నౌకను మన నౌకాదళం వారు తరిమివేయడం చైనా దురాక్రమణ వ్యూహానికి ఎదురుదెబ్బ! చైనా ప్రభుత్వం కవ్వింపు చర్యలను మానలేదనడానికి ఇది మరో నిదర్శనం. మనదేశాన్ని యుద్ధంలో ఓడించడం వీలుకాదన్నది చైనా గ్రహించిన వాస్తవం. అందువల్లనే క్రీస్తుశకం 1962లో వలె పెద్దఎత్తున మరో దురాక్రమణ సాగించడానికి చైనా పూనుకొనడం లేదు.

12/04/2019 - 00:04

నిర్మాణోం కే పావన్ యుగ్ మే హమ్ చరిత్ర నిర్మాణ కరే- నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మనం సౌశీల్యాన్ని నిర్మిద్దాము-అన్నది ఒక హిందీ కవి చెప్పిన మాట! రహదారుల నిర్మాణం నిరంతరం కొనసాగుతున్న సమయంలో ఇలా ప్రజల సౌశీల్యం కూడ పెంపొందడం సమాంతర పరిణామం కావాలన్నది మానవీయ స్ఫూర్తి. సౌశీల్యం లేని వాహన చోదకుల వల్ల నిరంతరం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి.

12/03/2019 - 00:42

పౌరసత్వపు చట్టానికి ప్రతిపాదిస్తున్న ‘సవరణ’ ఈశాన్య ప్రాంతంలోని ఆరు రాష్ట్రాలకు వర్తింపచేయరాదన్న ప్రభుత్వ నిర్ణయం విచిత్రమైన పరిణామం. అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తరిమివేతకు గురి అయిన ఇస్లామేతర మతాల వారికి మన దేశపు పౌరసత్వం కల్పించడానికి ఈ ‘సవరణ’ వీలు కల్పిస్తోంది. ఇలా పౌరసత్వం పొందిన ‘శరణార్థులు’ దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు.

12/01/2019 - 04:45

మన దేశ రక్షణ విభాగానికి తగినన్ని నిధులు లేవన్న వాస్తవానికి చైనా ‘విస్తరణ’ విచిత్రమైన నేపథ్యం. చైనా తన సైనిక పాటవాన్ని నిరంతరం విస్తరిస్తోంది, వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తోంది, దౌత్య దౌర్జన్యకాండను తీవ్రతరం చేస్తోంది, వ్యూహాత్మక బీభత్సకాండను వ్యవస్థీకరిస్తోంది. ఈ చతుర్ముఖ విస్తరణకు ప్రధాన లక్ష్యం మన దేశం.

11/29/2019 - 01:28

ఇంప్లాంటెడ్ కాంటాక్ట్ లెన్స్- ఐసీఎల్- ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన నయన చికిత్స. దృష్టి మాంద్యాన్ని తొలగించి నిశిత దృష్టిని కలిగించడానికి వీలుగా ఈ ‘లెన్స్’ను కంటిగుడ్డులో అమర్చుతున్నారు. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి లోపాలు అపవాదాలు మాత్రమే. ఈ లోపాన్ని అతిగమించడానికి వీలుగా కంటి అద్దాలను అమర్చుకోవడం నేత్ర చికిత్సలో భాగం.

11/28/2019 - 01:50

వివిధ పక్షాల సైద్ధాంతిక పతనం మహారాష్టలో నడుస్తున్న రాజకీయానికి ప్రాతిపదిక. ఘోరమైన అవకాశవాదం నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమ ఆర్భాటానికి ఇతివృత్తం! ‘జనాదేశం’ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన మార్గదర్శకమన్నది గతమైపోయింది, హతమైపోయింది.. జనాదేశాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా ఉల్లంఘించవచ్చునన్నది మహారాష్టలో ప్రభుత్వ నిర్మాణ ప్రహసనాన్ని ప్రదర్శించిన, ప్రదర్శిస్తున్న రాజకీయ పక్షాలవారు నిరూపించిన ‘నీతి’!

Pages