S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

02/18/2020 - 02:16

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వంపై విజయం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల చిట్టా, జాతీయ పౌరుల రిజిష్టరుపై విజయం, మతతత్వవాదంపై లౌకికవాదం విజయం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నియంతృత్వం, మతతత్త్వం ఓడిపోయిందంటూ కుహనా లౌకిక వాదులు ప్రచారం చేస్తున్నారు.

02/11/2020 - 01:22

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యవహారం, వ్యాఖ్యల మూలంగా తన ప్రతిష్టను తాను దిగజార్చుకోవటంతోపాటు కాంగ్రెస్ మనుగడను ప్రమాదంలో పడవేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ బతికి బట్టకట్టటం దాదాపుగా అసాధ్యమని పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు.

02/04/2020 - 01:54

భారత రాష్ట్రపతిని కూడా పార్టీ రాజకీయాలకు బలి చేయటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం తగదు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గత శుక్రవారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు చేసిన గొడవ ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

01/28/2020 - 01:37

రెండు రోజుల క్రితం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. భారత రాజ్యాంగానికి మనం ఇచ్చే ప్రాధాన్యతకు గణతంత్ర దినం నిదర్శనంగా ఉంటోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల ఫలితంగా రాజ్యాంగం భ్రష్టుపడుతోందంటూ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు పదే పదే ఆరోపిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్.పి.

01/21/2020 - 01:20

మూడు ముస్లిం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిసాతన్‌లలో మతపరమైన హింస మూలంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఏ రాష్ట్రం కూడా ఆపలేదు. ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేరళ, పంజాబ్ చేస్తున్న ప్రకటనలు, శాసన సభలో ఆమోదించిన తీర్మానాలు ఎంత మాత్రం చెల్లుబాటు కావు.

01/14/2020 - 04:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ పౌర రిజిష్ట్రేషన్ (ఎన్.ఆర్.సి)ని అన్ని ప్రతిపక్షాలతోపాటు ముస్లిం మైనారిటీ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్.ఆర్.సి తమ ప్రయోజనాలు దెబ్బ తీస్తుందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తమ పౌరుల వివరాలు రిజిష్టరు చేసి గుర్తింపు కార్డులు ఇస్తుంటే భారతీయ పౌరులకు ఎందుకు ఇవ్వకూడదన్నది ప్రశ్న.

01/08/2020 - 02:46

భారతదేశ లౌకిక తత్వం, రాజ్యాంగ విలువల పరి రక్షణకు ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) వద్దంటూ ప్రారంభమైన ఉద్య మం ఇప్పుడు ఇస్లాం మత ప్రయోజనాల పరిరక్షణ ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్యమం ‘ముస్లింల గుర్తింపుపరిరక్షణ’కు అన్నట్టుగా మారిపోయింది.

12/31/2019 - 00:14

2019సంవత్సరంలో ప్రాంతీయ ప్రార్టీలు అందలం ఎక్కితే జాతీయ పార్టీలు గడ్డుపరిస్థితుల్లో పడిపోయాయి. బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు గత సంవత్సరం తమ, తమ లక్ష్యాలను సాధించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. కేంద్రంలో గత ఆరు సంవత్సరాల నుండి అధికారంలో ఉండటంతోపాటు దేశం దశ, దిశను మార్చివేసే కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న బి.జె.పి. ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది.

12/24/2019 - 02:53

‘ భారత దేశం’ బతికి బట్టకట్టాలంటే పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరసత్వ రిజిష్టరు (ఎన్.ఆర్.సి) ఎంతో అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించటం వెనక పదవీ రాజకీయంతోపాటు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం కొనసాగుతోంది. అందుకే ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టటం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు పలు రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి.

12/17/2019 - 02:00

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి దురదృష్టంగా మారారు. ఇవి నేను చెబుతున్న మాటలు కాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చెబుతున్న మాటలు. రాహుల్ గాంధీ చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి తప్ప లాభం కలిగించటం లేదు, రాజకీయంగా మేలు చేయటం లేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

Pages