S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

04/09/2019 - 04:28

ఎన్నికల సమయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ప్రజల ముందు పెట్టే మేనిఫెస్టోలు నానాటికీ ప్రహసనంలా మారుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలు ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకునేందుకు చేసే మోసపూరిత ఎత్తుగడగా తయారయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చే హామీలు చాలావరకూ ఆచరణకు నోచుకోవటం లేదు. మేనిఫెస్టోల పేరిట ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ అధికారంలోకి వచ్చాక మన నేతలు హామీలను విస్మరిస్తున్నారు.

04/02/2019 - 03:10

ఎన్నికలు సమీపించినపుడు మాత్రమే రైతులకు రుణమాఫీ, పెన్షన్లు, ఇతర రాయితీ పథకాలను ప్రకటించటం, వాటిని ఆగమేఘాలపై అమలు చేయడం మన పాలకులకు పరిపాటిగా మారింది. బీదరికాన్ని తొలగిస్తాం, రైతులను ఆదుకొంటామని నేతలు ఇస్తున్న హామీలు కేవలం నినాదాలుగా మారుతున్నాయి. నిజంగా రైతులను ఆదుకోవాలని, బీదరికాన్ని తొలగించాలనే లక్ష్యం, చిత్తశుద్ధి, పట్టుదల, నిజాయితీ మన రాజకీయ నాయకుల్లో లేదు.

03/19/2019 - 01:13

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుత ప్రభుత్వ పని తీరును సమీక్షించటంతోపాటు, తాము అధికారంలోకి వస్తే అద్భుతాలు సాధిస్తామని చెబుతున్న నేతల గురించి లోతుగా ఆలోచించి ఓటర్లు తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల క్రితం దేశాన్ని నడిపించే బాధ్యతను స్వీకరించిన నాయకులు ఏ మేరకు హామీలను నెరవేర్చారు? దేశాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు?

03/12/2019 - 02:11

దాదాపు నాలుగు వందల తొంభై సంవత్సరాలుగా కొనసాగుతున్న అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం మధ్యవర్తిత్వం, సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే పరిష్కారం అవుతుంది. హిందూ, ముస్లిం మతాలకు చెందిన నాయకులు పెద్ద మనసుతో వ్యవహరించి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. సుప్రీం కోర్టు ఎంతో దూరాలోచనతో అయోధ్య వివాదంపై వెంటనే తీర్పు ఇవ్వకుండా మధ్యవర్తిత్వానికి తెర లేపింది.

03/05/2019 - 02:06

పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ స్థావరంపై మెరుపు దాడులు చేయించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పరువుప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ప్రపంచం దృష్టిలో మన గౌరవ మర్యాదలను మరింతగా పెంచారు. వ్యూహాత్మకంగా చేసిన వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారు. పాకిస్తాన్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్న చైనాకు సైతం స్పష్టమైన సందేశం పంపించడంలో మోదీ విజయం సాధించారు.

02/26/2019 - 04:49

ఇస్లామిక్ ఉగ్రవాదులు పుల్వామాలో కారుతో ఆత్మాహుతి దాడి చేసి నలభై మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను పొట్టన పెట్టుకున్న సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం శోచనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని అడ్డం పెట్టుకుని అధికార పార్టీని విమర్శించటం వలన ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ప్రయోజనం కలుగుతుందనే నిప్పులాంటి నిజాన్ని ప్రతిపక్ష నాయకులు గ్రహించటం మంచిది.

02/19/2019 - 00:12

ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్‌లో అనునిత్యం మారణ హోమం సృష్టిస్తున్న పాకిస్తాన్‌ను శత్రుదేశంగా మన నేతలు ఎందుకు ప్రకటించరాదు? మన దేశాన్ని శత్రుదేశంగా భావిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మనం కూడా పాకిస్తాన్‌ను శత్రుదేశంగా ప్రకటించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

02/12/2019 - 00:05

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయటం ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక బెడిసికొడతాయా? ముఖ్యంగా రాహుల్ ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకుని భీకరదాడి కొనసాగిస్తున్నారు. ‘మోదీ దొంగ’ అంటూ అనునిత్యం ఆరోపణలు గుప్పిస్తున్నారు.

02/05/2019 - 00:00

ప్రతిసారీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తాయిలాలు, రాయితీలు ప్రకటించే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరాల జల్లు కురిపించడం వెనుక- ఓట్లు దండుకోవాలనే దురాలోచన తప్ప మరొకటి కనిపించటం లేదు.

01/29/2019 - 01:51

ప్రియాంకా వాద్రా ఎట్టకేలకు గత్యంతరం లేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ కష్టాలు తీరుతాయా? జాతీయ స్థాయిలో తన మనుగడను నిలుపుకొంటుందా? అనే ప్రశ్నలకు రాబోయే పరిణామాలే సమాధానం ఇస్తాయి. ప్రియాంక రంగప్రవేశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యానికి అద్దం పడుతోంది.

Pages