S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

02/12/2019 - 00:05

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయటం ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక బెడిసికొడతాయా? ముఖ్యంగా రాహుల్ ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకుని భీకరదాడి కొనసాగిస్తున్నారు. ‘మోదీ దొంగ’ అంటూ అనునిత్యం ఆరోపణలు గుప్పిస్తున్నారు.

02/05/2019 - 00:00

ప్రతిసారీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తాయిలాలు, రాయితీలు ప్రకటించే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరాల జల్లు కురిపించడం వెనుక- ఓట్లు దండుకోవాలనే దురాలోచన తప్ప మరొకటి కనిపించటం లేదు.

01/29/2019 - 01:51

ప్రియాంకా వాద్రా ఎట్టకేలకు గత్యంతరం లేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీ కష్టాలు తీరుతాయా? జాతీయ స్థాయిలో తన మనుగడను నిలుపుకొంటుందా? అనే ప్రశ్నలకు రాబోయే పరిణామాలే సమాధానం ఇస్తాయి. ప్రియాంక రంగప్రవేశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైఫల్యానికి అద్దం పడుతోంది.

01/22/2019 - 00:15

ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్‌జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రతిపక్షాల సమైక్యతను నారింజ పండుతో పోల్చారు. నారింజ పండు బైటికి ఒకటిగానే కనిపిస్తుంది కానీ, లోపల తొనలన్నీ విడివిడిగానే ఉంటాయి. ప్రతిపక్ష నేతలు పైకి ఒకటిగా కనిపించినా, లోపల ఎవరికి వారేనన్నది ఆయన విమర్శ. పాశ్వాన్ పోలిక కొంతవరకూ నిజమే. వాస్తవానికి ప్రతిపక్షం నారింజ పండు మాదిరి బైటికి ఒకటిగా కనిపించటం లేదు.

01/15/2019 - 01:27

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఇస్తున్న రిజర్వేషన్లు, తాజాగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి ఇస్తున్న రిజర్వేషన్లు ఓట్లు దండుకునే మంత్రాంగంగా మారటం శోచనీయం. రాజకీయ నాయకులు తమ పదవులను పదిలం చేసుకునేందుకు రిజర్వేషన్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఆయా సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్దికి ఉపయోగించటం లేదు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరుగుతున్నాయా? లేదా?

01/08/2019 - 01:07

రాజకీయ పార్టీలు నేడు ఓటుబ్యాంకు కోణంలో పార్లమెంటును బలి తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, డీఎంకే, తెలుగుదేశం సహా మరి కొన్ని ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమం పేరుతో పార్టీ ప్రయోజనాలు, అధికారం కోసం పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నాయి.

01/01/2019 - 03:39

కాలగర్భంలో కలసిన 2018 సంవత్సరం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. జాతీయ రాజకీయాలను అతలాకుతలం చేసిన సంవత్సరం ఇది. గతించిన సంవత్సరంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కాస్త బలం పుంజుకుంటే భాజపాకు మాత్రం చేదు అనుభవాలు మిగిలాయి. జాతీయ స్థాయిలో ‘కూటముల’ను ఏర్పాటు చేసేందుకు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఎత్తుకు పైఎత్తులు వేసిన సంవత్సరం ఇదే.

12/25/2018 - 01:49

ఇల్లు అలకగానే పండుగ కాదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే వచ్చే సంవత్సరం లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం భావించే పక్షంలో పప్పులో కాలేసినట్లే. కాంగ్రెస్ దాదాపు 120 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటే తప్ప రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టలేరు.

12/18/2018 - 01:52

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అంతా ఊహించిందే జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం శీతాకాల సమావేశాలను భ్రష్టుపట్టిస్తున్నాయి. గతవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏ ఒక్కరోజు కూడా సజావుగా జరుగలేదు.

12/11/2018 - 01:58

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా ఉంది. తామెంత గొ డవ చేసినా అధికార పక్షం పార్లమెంటు ఉభయ సభలను ప్రశాంతంగా నడిపించాలని ప్రతిపక్షం ఆశించటం బాధ్యతారాహిత్యం అవుతుంది. అలాగే, ప్రతిపక్షాన్ని పట్టించుకోకుండా పార్లమెంటును ఏకపక్షంగా నడిపించుకోవాలని భావించటం అధికార పక్షం తప్పిదం అవుతుంది.

Pages