S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

01/01/2019 - 03:39

కాలగర్భంలో కలసిన 2018 సంవత్సరం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. జాతీయ రాజకీయాలను అతలాకుతలం చేసిన సంవత్సరం ఇది. గతించిన సంవత్సరంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కాస్త బలం పుంజుకుంటే భాజపాకు మాత్రం చేదు అనుభవాలు మిగిలాయి. జాతీయ స్థాయిలో ‘కూటముల’ను ఏర్పాటు చేసేందుకు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఎత్తుకు పైఎత్తులు వేసిన సంవత్సరం ఇదే.

12/25/2018 - 01:49

ఇల్లు అలకగానే పండుగ కాదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే వచ్చే సంవత్సరం లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం భావించే పక్షంలో పప్పులో కాలేసినట్లే. కాంగ్రెస్ దాదాపు 120 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటే తప్ప రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టలేరు.

12/18/2018 - 01:52

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అంతా ఊహించిందే జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం శీతాకాల సమావేశాలను భ్రష్టుపట్టిస్తున్నాయి. గతవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏ ఒక్కరోజు కూడా సజావుగా జరుగలేదు.

12/11/2018 - 01:58

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా ఉంది. తామెంత గొ డవ చేసినా అధికార పక్షం పార్లమెంటు ఉభయ సభలను ప్రశాంతంగా నడిపించాలని ప్రతిపక్షం ఆశించటం బాధ్యతారాహిత్యం అవుతుంది. అలాగే, ప్రతిపక్షాన్ని పట్టించుకోకుండా పార్లమెంటును ఏకపక్షంగా నడిపించుకోవాలని భావించటం అధికార పక్షం తప్పిదం అవుతుంది.

12/04/2018 - 03:18

ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధమంటున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలను ఎంత మాత్రం విశ్వసించలేం. పాకిస్తాన్ సైనికాధికారుల చేతిలో కీలుబొమ్మైన ఇమ్రాన్ ఏం చెప్పినా అది ఆచరణ సాధ్యం కాదు. ఇమ్రాన్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు దాదాపు నాలుగు లక్షల మంది పాకిస్తాన్ సైనికులు ఎన్నికల ప్రక్రియలో పనిచేశారు.

11/27/2018 - 01:48

లోక్‌సభ, శాసనసభల ఎన్నికల సమయంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తమ ఆస్తులు, అప్పులపై చేస్తున్న ప్రకటనలు ప్రజలను మోసగించే చర్యలుగా కనిపిస్తున్నాయి. ఇదో తప్పనిసరి తంతులా మారిందే తప్ప అభ్యర్థుల నిజాయితీకి ప్రతిబింబంగా కనిపించడం లేదు.

11/20/2018 - 00:29

వోటర్లు ప్రలోభాలకు లొంగిపోయి, తమ బాధ్యతను విస్మరిస్తే- అసమర్థ, నిరంకుశ, అవినీతి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రస్తుతం తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం తారస్థాయికి చేరింది. వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో వోటర్ల ‘నాడి’పై లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే అవకాశం ఉంది.

11/13/2018 - 00:24

ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, ఆ తర్వాత ప్రజలను వంచించడం రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌లతో పాటు ఇతర విపక్షాలు, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించి, ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలను అమలు చేయని ఈ పార్టీలు ఇప్పుడు గుప్పిస్తున్న వాగ్దానాలను అమలు చేస్తాయనే గ్యారంటీ లేదు.

11/06/2018 - 01:47

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు విపక్షాలు చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? ఎన్డీఏను ఎదుర్కొనేందుకు దీటైన కూటమిని ఏర్పాటు చేయాలన్న విపక్ష నేతల ప్రయత్నాలు నెలలు గడుస్తున్నా కొ లిక్కి రాలేదు. తాజాగా తెదేపా అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను సమైక్య పరిచే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

10/30/2018 - 04:09

అక్రమాలపై దర్యాప్తు జరపాల్సిన కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ) సీనియర్ అధికారులే అడ్డదారులు తొక్కారు. అత్యుత్తమ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐలో తాజా పరిణామాలు, దీనిపై అధికార, విపక్ష పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అధికార దాహంతో ఉన్న నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని భ్రష్టుపట్టిస్తున్నారు.

Pages