S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

08/02/2017 - 02:54

వానలకు, వనాలకు సంబంధం ఉన్నది. చెట్లు లేకుండా వర్షాలు రావు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా అడవుల శాతాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి అడవులు 33 శాతం ఉండేలా చర్యలు ప్రారంభించారు. మూడేళ్ల కాలవ్యవధిలో అటవీ ప్రాంతాల్లో 100 కోట్లు, నివాస ప్రాంతాల్లో 120 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పించారు.

08/01/2017 - 00:21

స్వలాభం కోసం అధికార పార్టీలోకి ఫిరాయించే వారిపై చట్టరీత్యా వేటువేసేలా చట్టాలను కఠినతరం చేయాలి. ఓటర్లు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పదవుల కోసం పార్టీ మారడం సమంజసం కాదు. రకరకాలుగా ప్రలోభపెట్టో, భయపెట్టో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను అధికార పార్టీవారు చేర్చుకోవడం ఎంతవరకు హర్షించదగ్గ విషయం? ఎన్నో ఏళ్లుగా అండదండలుగా ఉంటూ రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన పార్టీని పదవీ వ్యామోహంతో వీడిపోవడం సరికాదు.

07/31/2017 - 02:01

తెలుగు రాష్ట్రాలలో అధికారపక్ష నాయకులు, విపక్ష నాయకులు ఉద్యోగులపై సైతం అనుచితంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఎక్కువుతున్నాయి. టిఆర్‌ఎస్‌కు చెందిన ఒక మంత్రి ఇటీవల ఒక వ్యక్తిని బెదిరించిన ఘటన మరువకముందే మరో ఎంఎల్‌ఏ జిల్లా మేజిస్ట్రేట్‌గా చెప్పబడే కలెక్టర్‌పై అనుచితంగా వ్యవహరించడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత అయిన వ్యక్తి సైతం ఒక సంఘటనలో కలెక్టర్‌ను దూషించడం బెదిరించడం జరిగింది.

07/29/2017 - 00:14

బిహార్‌లో మహాకూటమికి మంగళం పాడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జెడియు నేత నితీశ్‌కుమార్ ‘కమలం’ నీడకు చేరడం ఊహించిన పరిణామమే. గత కొన్ని నెలలుగా బిజెపితో ఆయన సఖ్యంగా మెలుగుతూ రావడం, కలిసి కాపురం చేస్తున్న లాలూ పార్టీతో ఎడమొహం పెడమొహంగా వుండడం లోక విదితమే. ‘కమలం’ నీడ కోరుకోవడం నితీశ్ అవసరమే కావచ్చు, రాజకీయంగా తప్పు కాకపోవచ్చు. కానీ అందుకుచూపిన కారణాలు ఏమాత్రం నమ్మదగినవి కావు.

07/28/2017 - 00:49

పాలనలో పారదర్శకత పెంచేందుకు దోహదం చేస్తూ, ప్రజల చేతిలో వజ్రాయుధంలా నిలిచిన ‘సమాచార హక్కు చట్టాని’కి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రంలో పాలించిన యుపిఏ ప్రభుత్వం పనె్నండు సంవత్సరాల క్రితం పదునైన ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పనె్నండేళ్ళ కాలంలో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ఫలితాలు సాధించిన ఉద్యమకారులు ఎందరో వున్నారు.

07/25/2017 - 00:00

ఉత్తరాంధ్రలో అక్రమ స్కానింగ్ సెంటర్లు, అబార్షన్ క్లినిక్‌లు, సరోగసీ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంది. పుట్టబోయేది ఆడపిల్ల అని స్కానింగ్‌లో గుర్తిస్తే వెయ్యి రూపాయలకే అబార్షన్ చేసేస్తున్నారు. పిల్లలు పుట్టనివారిని ఫెర్టిలిటీ క్లినిక్‌లు ‘సరగోసి’ పేరిట వలలో వేసుకుని లక్షలాది రూపాయలు గుంజేస్తున్నాయి.

07/23/2017 - 23:43

ఈ మధ్య అరకు వెళ్లే రైల్లోంచి ఒక విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ జారి పడి ప్రాణాలు కోల్పోవడం దయనీయం. గత వారమే ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు విద్యార్థులు నదిలో బోటు షికారు చేస్తూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ సెల్ఫీయే ఆఖరి జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారి బంధువులకు, సమాజానికి ఎంత గుండెకోత! ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులే అధికంగా ఇలాంటి సరదాలకు బలైపోతున్నారు.

07/22/2017 - 00:11

ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా గాక బెదిరింపులతో కొనసాగిస్తూ లబ్ది పొందాలనుకోవడం చైనా రాజకీయ దుర్నీతిగా మారింది. తాజా సరిహద్దు వివాదం నేపథ్యంలో- 1962లో జరిగిన యుద్ధం నుండి గుణపాఠం నేర్చుకోమని మన దేశాన్ని చైనా హెచ్చరించింది. నిజమే..

07/21/2017 - 00:30

తనపై దాఖలైన అవినీతి కేసు భాజాపా కుట్ర, కక్ష సాధింపు అని బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ అనడం సహజమే. అయితే కుట్రలు పన్నడం, కక్ష సాధించడంలో ఆయనేమీ తక్కువ తినలేదు. గోద్రా రైలు దహనం ఘటనలో బోగీ తలుపులు బిగించి ఓ మతస్థులు రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి కిరోసిన్, పెట్రోలు వెదజల్లి నిప్పు పెట్టారని ప్రజలకు తెలుసు.

07/19/2017 - 01:15

మాదకద్రవ్యాలు వాడి మత్తులో పడి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్న యువతీ యువకులు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈమధ్య సుమారు వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఈ విషవలయంలో చిక్కుకున్నారని వస్తున్న వార్తలు మనసును కలచివేస్తున్నాయి. మత్తుమందుకోసం ఓ ఆడపిల్ల నగ్నంగా ఫొటో తీయించుకుందని విని ఆశ్చర్యం, బాధ కలిగాయి.

Pages