S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

06/20/2017 - 01:01

వైద్య కళాశాలల నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ యాజమాన్యాలు పిజి వైద్య విద్య రుసుములను రు 5.80 లక్షల నుంచి రు.24.20 లక్షలకు పెంచడం, ఇందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు ఆమోద ముద్ర వేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. న్యాయస్థానం జోక్యంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయం అమలు లోకి రాలేదు. కానీ, వైద్య విద్యలో వ్యాపార దృక్పథం ప్రబలుతోందనడానికి 400 శాతం మేరకు రుసుములు పెంపు నిర్ణయం తిరుగులేని దృష్టాంతం.

06/19/2017 - 01:44

వినియోగదారులకు ఏ మాత్రం తెలియకుండా పాలు, పళ్లు, కూరలు, చివరకు నీళ్లు కూడా కల్తీమయం చేసి ఆరోగ్యాలను చెడగొడుతున్నారు. నీతి నియమాలు లేని లాభాపేక్షే పరమావధిగా భావించే వ్యాపారులు ఇప్పుడు కల్తీ బియ్యం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేసి మంచి బియ్యంలో కలిపి అమ్ముతున్నారని వింటున్నాం. ఈ దొంగ వ్యాపారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తిని చితకబాదారుట.

06/17/2017 - 02:06

నూతన రాష్టప్రతిగా ప్రస్తుత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని ఎంపిక చేయాలని భాజపాకు ఎవ్వరూ సిఫారసు చేయనక్కరలేదు. రాష్టప్రతి పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకునే సత్తా ఆ పార్టీకుంది. రాజ్యసభ అధ్యక్షునిగా అన్సారీ విపక్షాలవైపే ఎక్కువగా మొగ్గు చూపేవారన్న ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని రాష్టప్రతిగా ఎంపిక చేసుకుని కొత్త తలనొప్పులు తెచ్చుకోవాలని ఏ పాలక పార్టీ కోరుకోదు.

06/16/2017 - 00:38

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో నవ నిర్మాణ దీక్ష పాటించింది. ఇక జరగాల్సింది ‘ఆరోగ్య పరిరక్షణ దీక్ష’. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకున్నాయి. వర్షాలు మొదలయ్యాయి. విష జ్వరాల సీజన్ కూడా ప్రవేశించినట్టే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మన్య ప్రాంతం ఏటేటా ఇదే సీజన్లో మంచాన పడడం మొదలవుతుంది.

06/15/2017 - 01:33

కవితకు అందమమరె
తెలుగు వెలుగు కుదిరె
భావమధురిమదిరె
చాంగురే బంగారు మన సినారె

తెలుగులో గజలుకు జీవమిచ్చింది వీరె
కవులందరిలోన వీరి దారి వేరె
బహుళ శైలియందీయనారితేరె
తెలుగు భాషకు తెచ్చె గొప్ప పేరె
ఘనమైన కవివర్య మన సినారె

06/14/2017 - 01:00

రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు తెలంగాం సిఎం కేసిఆర్. గత ఏడాది అన్ని పార్టీల రాజకీయ నాయకుల పనితనం గురించి సర్వేలు నిర్వహించి, ఎవ్వరూ తప్పుపట్టకుండా ఉండేందుకు కొందరు ప్రతిపక్ష నాయకుల పనితీరుకు కూడా మార్కులు ఎక్కువ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై సర్వేలు నిర్వహించి అందరినీ మభ్యపెట్టారు.

06/13/2017 - 00:44

నింగికెగసిన తెలుగు సాహితీ ధృవతార సినారె రాజ్యసభ సభ్యునిగా ఉండగా, అదే సమయంలో లోక్‌సభ సభ్యునిగా ఉండడం నా అదృష్టం. మమకారంతోపాటు, స్వచ్ఛమైన తెలుగు నుడికారం ఆయన మాటల్లో ఇమిడిపోయేవి. పబ్లిక్ మీడింగులంటే ఇంక చెప్పనక్కరలేదు. ఆయన ప్రసంగం ఓ తెలుగు నదీ ప్రవాహమే. శ్రోతలు అందులో మునిగి తేలి ఆస్వాదించాల్సిందే కానీ వర్ణించడం కష్టం.

06/12/2017 - 01:12

పర్యావరణ పరిరక్షణకై 196 దేశాల మధ్య జరిగిన ‘పారిస్ ఒప్పందం’ నుండి అమెరికా నిష్క్రమించడం పూర్తిగా బాధ్యతా రాహిత్యం. పారిశ్రామికీకరణ అనంతరం గత శతాబ్దంలో భూమిపై పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలలో 27 శాతం అమెరికావారి చలవే. పర్యావరణాన్ని పాడుచేసే కర్బన ఉద్గారాలు వెలువడుతున్న ప్రపంచ దేశాల్లో అమెరికాది రెండో స్థానం. అది గత సంవత్సరం 16 శాతం మేరకు ఉంది. భారత్ వాటా 6 శాతానికి మించదు.

06/11/2017 - 01:13

మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా పేదోడ్ని, నా వద్ద ఏముంది? బూడిద తప్ప... అని మాత్రం అనకండి. ఎందుకంటారా? ఇటీవల సంగారెడ్డిలో టి.కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రభృతులు కాసేపు భేటీ వేశారు.

06/10/2017 - 00:30

రాజకీయ అవసరాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మన నేతలకే చెల్లింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అత్యధికంగా అధికార పార్టీ నుండి ఎంపీలు ఎన్నికవుతూ, పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా నిలిచారు. కానీ, కేంద్రం మెడలు వంచి తమకు న్యాయంగా రావాల్సిన నిధులను రప్పించుకోవడంలో వారు ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం టిడిపి హయాంలో కూడా అదే కథ పునరావృతమైంది.

Pages