S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/25/2017 - 01:54

విజయనగరం జిల్లా కూనేరు వద్ద హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో నలభై ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గాయాలపాలు కావడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, అలసత్వమా, విద్రోహచర్యా అన్నది పక్కనపెడితే - రైల్వే భద్రత రానురానూ తీసికట్టుగా తయారౌతుందన్నది కాదనలేని సత్యం.

01/24/2017 - 05:41

జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడం హర్షణీయం. దీన్ని వెంటనే తప్పనిసరిగా అమలుచేయాలి. జాతీయ రహదారుల పక్కనేగాదు గ్రామీణ రహదారులపై కూడా మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించాలి. నిత్యం మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు లెక్కలేనంతమంది. తత్ఫలితంగా తరచూ రోడ్డుప్రమాదాలు జరిగి ఎంతోమంది మరణిస్తున్నారు.

01/23/2017 - 00:42

విశ్వంలోనే అత్యుత్తమ జీవన విధానంగా భారతీయత వినుతి కె క్కింది. ‘అహింసా పరమో ధర్మః’ అన్న వేదోక్తి మానవులందరూ అహింసా ప్రవృత్తిని అలవరచుకొని, వైషమ్యాలు పక్కనపెట్టి సమైక్యంగా కలిసిమెలిసి జీవించాలని బోధిస్తోంది. ప్రార్ధించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అంటూ భారతీయత సమాజసేవ వైశిష్ట్యాన్ని చాటి చెప్పింది.

01/21/2017 - 01:52

‘జాతీయ నేర గణాంకాల నివేదిక’ తాజా సమాచారం ప్రకారం గత సంవత్సరం రైతు ఆత్మహత్యలు అంతకుముందుకన్నా నలభై రెండు శాతం మేరకు పెరిగాయి. ఒక్క సంవత్సరంలోనే 12,602 మంది అన్నదాతలు, రైతుకూలీలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంటే- సగటున గంటకు ఒకటి చొప్పున రైతు ప్రాణం గాలిలో కలసిపోవడం ఆందోళనకరం. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు అయిన మనదేశంలో రైతుల దీనస్థితికి పాలకుల విధానాలే కారణం.

01/20/2017 - 01:56

ఖమ్మం జిల్లా రెండుగా విడిపోయిన తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి ఆలయంతో పాటు పర్ణశాల, పెద్దమ్మగుడితోపాటు పర్యాటక కేంద్రాలైన కినె్నరసాని, మణుగూరు చేరిపోయాయి.

01/19/2017 - 05:33

ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠం గమ్యంగా రేస్ మొదలైంది. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన ఇస్తామంటూ ‘కమలం’ పట్టుకొని మోదీ, సామాజిక న్యాయం జెండాతో ఏనుగు అంబారీపై మాయావతి, వేగంలో వెనకున్నా వ్యూహంలో ముందున్నామంటూ ‘చెయ్యి’ ఊపుతూ రాహుల్ గాంధీ ఎన్నికల రేస్‌కి రెడీ అయిపోయారు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తన ‘సైకిల్’కి స్టాండ్ తియ్యలేదు నిన్నటిదాకా.

01/18/2017 - 00:46

విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఇరవైవేల ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జిఒ)ల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడం సాహసోపేత నిర్ణయం. ఇలాంటి కఠిన నిర్ణయాలతో దేశ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న నరేంద్ర మోదీ వంటి సమర్ధవంతమైన ప్రధాని లభించడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం.

01/17/2017 - 01:37

శత్రువు బలంగా ఎదుగుతున్నప్పుడు ధైర్యంగా ముఖాముఖిగా ఎదుర్కోవడంతోపాటు, శత్రువుకు సహకరించే మిత్రులతో స్నేహం చేసి వీలైనంతగా ఏకాకిని చేసే ప్రయత్నం ఎంతో అవసరం. ఇదే వ్యూహాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ అతి చాకచక్యంగా అమలుచేయడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా పాకిస్తాన్‌కు ఒకప్పటి చిరకాల మిత్రులైన ఆప్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలు క్రమంగా దూరంగా తొలగిపోతున్నాయి.

01/16/2017 - 00:32

విద్య అనేది వ్యక్తి అభ్యున్నతికి సోపానం. విద్యార్థులు, యువకులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. విద్యార్థులకు పాఠశాల నిజంగా గుడి లాంటిది, ఉపాధ్యాయులే దేవుళ్లు. అయితే, బడిలాంటి గుడులు ఇపుడు శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని ఊళ్లల్లో అయితే ఆరుబయటే విద్యాబోధన గావిస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఒకే గదిలో ఒకటినుండి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి.

01/14/2017 - 00:33

‘ప్రజల సొమ్ముతో డిజిటల్ సోకులు, వంటగ్యాస్ బుకింగ్ సమయంలో వినియోగదారుల జేబులకు చిల్లులు’- అంటూ ఓ వర్గం మీడియాతో పాటు కొందరు విపక్ష నేతలు మోదీ విధానాలను ఏకపక్షంగా విమర్శించడం సరికాదు. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం కొందరికి అలవాటుగా మారింది. కేంద్రం విధానాలపై వ్యతిరేకత ఉంటే నేరుగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయవచ్చు.

Pages