S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/15/2016 - 22:43

అందరూ టిప్పు సుల్తాన్ జయంతి సభలో నిమగ్నం కాగా- సందట్లో సడేమియాలా అశ్లీల వీడియోలు చూస్తూ కర్నాటక విద్యాశాఖ మంత్రి తన్వీరు అడ్డంగా ఓ వీడియోలో బుక్కయ్యారు. టీవీ జర్నలిస్ట్ తీసిన ఆ వీడియోను మరుక్షణమే టీవీల్లో ప్రసారం చేశారు. ‘నాకు సంబంధించిన వీడియోను తీసి, బయటపెడతావా..’ అంటూ ఆగ్రహంతో ఆ మంత్రివర్యుడు- సదరు రిపోర్టర్, వీడియో తీసిన కెమెరామెన్‌పై పోలీసులకు ఫిర్యాదుచేశారు.

11/15/2016 - 06:40

ఇటీవల ఒక పీఠాధిపతి షిర్డీసాయిబాబాపై వ్యా ఖ్యలు చేసి వివాదాస్పదంగా మారారు. కోర్టు సైతం తక్షణమే స్పందించి అటువంటి వ్యాఖ్యలు చేయరాదని పీఠాధిపతిని కోరింది. షిర్డీసాయి అన్ని కులాలకు, మతాలకు దేవుడు. భిన్నత్వంలో ఏకత్వం గల దేవుడు. పీఠాధిపతులు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. మనుషుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉంటాయి. మనిషి ఏ దేవుడికైనా భయపడతాడు.

11/13/2016 - 21:51

మామిడి పళ్ళు, అరటి పళ్ళు, యాపిల్స్ మొదలైన వాటిని కృత్రిమ విషపు రసాయనాలలో కలిపి రంగుమార్చి వ్యాపారం చేసుకునే అవినీతిమంతుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాయగూరలను కూడా రసాయనిక ద్రావకాలలో కడిగితే అవి నవ నవలాడుతూ అప్పుడే కోసినట్లు అనిపిస్తాయి. అసలే కాయగూరల మొక్కలకు చీడపట్టకుండా చల్లే మందులవల్ల అవి పెరిగేటప్పుడే విష పూరితవౌతున్నాయి.

11/12/2016 - 08:35

అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఇపుడు విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనేక విషయాల్లో ఆది నుంచి దుందుడుకుగా వ్యవహరించిన ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ప్రపంచ దేశాలతో ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న.

11/11/2016 - 07:23

కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తే కాని ఏ పార్టీ అభ్యర్థీ శాసనసభకు ఎన్నిక కాడు. ఎన్నికైన తర్వాత ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ తనకు లాభసాటిగా ఉన్న పార్టీలోకి వెళ్లిపోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలో ఇటీవలి పరిణామాలు చూస్తే పార్టీ ఫిరాయింపులను అరికట్టే అధికారం ఎవరికి ఉందో అర్థం కావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ నిర్ణయంలో ఇంత జాప్యం ఎందుకు?

11/10/2016 - 05:43

అవినీతి వల్ల పుట్టుకొచ్చిన దొంగడబ్బును ప్రధాని మోదీ కొత్తనోట్లతో చిత్తుకాగితాలు చేశాడు. లాకర్లలోనూ, పరుపుల కిందా వున్న నోట్లకట్టలతో ఇక భోగిమంట వేసుకోవచ్చు. క్షణంలో అమీరులు గరీబులు అయిపోయారు.

11/09/2016 - 06:30

లక్షలాది మంది షిరిడీ సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. మహమ్మదీయుడైన భక్తకబీరు రాముణ్ణి కొలవలేదా? స్వరూపానంద వంటి మత ప్రచారకుల తప్పుడు వ్యాఖ్యానాల వల్లే నేడు చాలామంది హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి వలస పోతున్నారు.

11/07/2016 - 23:42

అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ భాషలకు చావు మూడింది. ఎందుకంటే అన్ని పార్టీలకూ ఓట్లే కాని సంస్కృతి, భాషలు అక్కర్లేదు కాబట్టి! త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో శ్రీకృష్ణమిషన్ అన్న పాఠశాల యాజమాన్యం- రోజూ పాఠశాలలో ఇంగ్లీషులో మాట్లాడనందుకు ఉపాధ్యాయులకు 100 రూపాయలు, విద్యార్థులకు 10 రూపాయలు జరిమానా కింద ప్రతిరోజూ కట్టాలని నిబంధన విధించారట.

11/07/2016 - 00:51

తెలంగాణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే ప్రజలు అక్కడి ఉద్యోగులకు చేతులు తడపనిదే ఏదీ కావడం లేదు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను పీడించి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. ఎసిబి అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా అవినీతి తగ్గడం లేదు.

11/03/2016 - 22:33

‘పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం’ అనే మాటలు నినాదాలకే పరిమితమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ అనేక గ్రామాలు, గిరిజన తండాలు ప్రగతికి నోచుకోవడం లేదు. అభివృద్ధి పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండిగా నిధులు విడుదల చేస్తున్నా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. చాలా గ్రామాల్లో ప్రజలకు నల్లాల ద్వారా తాగునీరు అందడం లేదు. కలుషిత జలాలే దిక్కు.

Pages