S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/27/2016 - 01:48

మేము ఎల్‌ఇడి బల్బులు వాడుతున్నాం. వీటితో సమస్య ఏమంటే- ఇవి గది అంతటా ఒకే విధమైన వెలుగు ఇవ్వవు. బల్బు ముందు భాగంలో 2,3 అడుగుల మేర వెలుతురు బాగానే వుంటుంది. దూరం ఎక్కువ అవుతున్నకొద్దీ వెలుతురు తగ్గుతోంది. వస్తువులైతే కనిపిస్తాయి కానీ, చదువుకోవడం, రాసుకోవడం వంటివి ఆ వెలుతురులో కుదరదు. ప్రభుత్వం ఇరవై రూపాయలకు రెండు ఎల్‌ఇడి బల్బుల ఇచ్చింది కానీ, అదనంగా కావాలంటే మార్కెట్‌లో ఒక్కో బల్బు ధర రూ.

09/26/2016 - 03:21

భారత భూభాగాలు ఆక్రమించి భారత్‌లో విప్లవ కారులకు, విధ్వంసాలకు సహాయం సహకారం అందించి భారత్‌కు ఎన్.ఎస్.బి.లో సభ్యత్వం వద్దు అని ప్రపంచ దేశాలకు చాటి, నిత్యం భారత్‌పై నిప్పులు రేపుతున్న శత్రుదేశమైన చైనాకు అమరావతి నిర్మాణంలో సాంకేతిక పరులకు అప్పగించి ఎర్ర చందనం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకొన్న ఆంధ్ర సి.ఎం. పరిశ్రమ స్థాపనకు స్థలాలు ఇస్తామనడం శోచనీయం.

09/24/2016 - 00:39

అన్నదానం, వస్తద్రానం కంటే అవయవ దానం చాలా గొప్పది. బ్రెయిన్‌డెడ్ అయిన వారి, కోమాలోకి వెళ్లి సాధారణ పరిస్థితికి రావడం అసాధ్యమైన పరిస్థితులలో క్షతగాత్రుని రక్తసంబంధీకుల అనుమతితో, చట్టపరమైన అనుమతుల ద్వారా అవయవ దానం చేస్తే ప్రత్యక్షంగా మరొక రోగికి పునర్‌జీవితం ప్రసాదించిన వారౌతారు. విదేశాలలో ఈ అవయవ దానంపై మంచి అవగాహన కలిగి నిస్వార్థంగా దానం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

09/22/2016 - 22:35

తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికేనా పుష్కరాలకు అంత హడావిడి చేశారు. గత పుష్కరాల్లో ఎటువంటి ఆర్భాటం లేకుండా కనీసం స్నాన ఘట్టాల వద్ద ఒక్క పోలీసు కూడ కాపలాగా లేడని లీలామాత్రంగా గుర్తు. ప్రజలకు పుష్కరం గురించి తెలియదా?! పుష్కరాల సందర్భంగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానించటం దేనికి? దేవుని కార్యానికి అందరూ పెద్దలే కదా!

09/22/2016 - 06:56

ఇటీవల (ఆగస్టు 30-సెప్టెంబరు 3తేదీల మధ్య) నెల్లూరు నగరంలో ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 10 తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల్లో అన్ని పాఠాలలో ఎన్ని రకాలుగా ప్రశ్నలు ఇవ్వవచ్చని ఉపాధ్యాయుల్ని పిలిపించి (వీరిని విషయ నిపుణులు అంటారు) ఏసీ రూములో కూర్చోబెట్టి, రెండు పూటలా తేనీరు ఇస్తూ, రోజుకు 7-8 గంటలపాటు పాఠ్యపుస్తకాలను ముందు పెట్టి, వర్క్‌షాపును (పని అంగడి) నిర్వహించారు.

09/20/2016 - 22:13

‘మదర్’ని సెయింట్‌గా ప్రకటించడానికి రెండు అద్భుతాలు అవసరం. ఆ అద్భుతాలేమిటో పత్రికల్లో వచ్చాయి. మాకూ ఒక ఆలోచన వచ్చింది. ఆవిధమైన అద్భుతాలు ఏ హిందూ సన్యాసి అయినా ప్రదర్శిస్తే మన సోదర వామపక్ష మేధావులు, హేతువాద కార్యశూరులూ ఎంత ఎద్దేవా చేసేవారో? ఇంక డాక్టర్లెందుకు? ఆస్పత్రులు మూసేసి ఆశ్రమాలు ప్రారంభించండి అంటూ ఎంత హేళన చేసేవారో. చానళ్లలో నిరంతరాయంగా ఎన్ని వెటకార చర్చలు జరిగేవో. కాని ‘మదర్’ అదృష్టం.

09/20/2016 - 07:58

ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ప్రభు నంద్యా ల నుండి కడపకు నేరుగా రైలు సౌకర్యాన్ని ప్రవేశపెట్టనునన్నట్లు ప్రకటించారు. ఆంధ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఆయన మన రాష్ట్రంనుండి రాజ్యసభకు ఎన్నుకోబడినందున రాష్ట్రానికి అదనంగా రైల్వే సదుపాయాలు ప్రకటించడం అవసరమే. ఈ రైలుబండి ప్రస్తుతం కడపవరకు వెల్లి మళ్లీ నంద్యాల చేరుతుంది. దీనివల్ల కర్నూలు, కడప జిల్లాల ప్రజలు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు.

09/19/2016 - 04:18

నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లు విద్యారంగం లో చేపడుతున్న మార్పులు సరైన పద్ధతిలో లేకపోవడం వల్ల ప్రాథమిక పాఠశాలల్లో బడుగు, పేద విద్యార్థులకు విద్య గగనకుసుమం అవుతోంది. ముఖ్య కారణం విద్యారంగంలో ప్రస్తుతం వున్న మూడంచెల వ్యవస్థను రెండంచెల వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం కసరత్తు చేయడమే. ఇది అమలుచేస్తే అన్ని జిల్లాల్లోని వందలాది పాఠశాలలు సమీపంలోని పాఠశాలల్లో విలీనమవుతాయ.

09/17/2016 - 02:20

కలకత్తాలో మదర్ థెరెస్సాకు స్మారకం ఏర్పాటు చేశారు బాగానే ఉంది. ఆమె చేసిన సేవకు తగిన గౌరవం ఇవ్వడం కొనియాడదగిందే. అయతే వివేకానందుని బోధనలకు ప్రభావితమై ఆయన శిష్యురాలిగా మారిన సోదరి నివేదితను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆమె భారతీయులకు సేవ చేయాలని నిశ్చయంచుకుంది. వివేకానందుని ఆదేశాల మేరకు కలకత్తా ప్రజలకు సన్యాసినిగా సేవలందించింది. ఆడ పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించింది.

09/16/2016 - 05:57

ఇంకా మన రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగుతూ, అటు ప్రభుత్వ పాఠశాలలకు, ఇటు కార్పొరేటు విద్యాసంస్థలకు దీటుగా పనిచేయడం విశేషం. ఈ పాఠశాలల్లో వున్నత విద్యాప్రమాణాలతో, శిక్షణ పొందిన విద్యాబోధకులు అనేక సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేయడం గమనార్హం. కాని వీరి వేతనాలు మాత్రం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమానంగా లేకపోవడం విచారకరం.

Pages