S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/05/2019 - 21:51

హైదరాబాద్‌లో నూతన సచివాలయం నిర్మాణం పేరుతో ఇప్పుడున్న పాత భవనాలను కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే నూతన సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగపరచటమే అవుతుంది. ప్రస్తుత సచివాలయ భవనాలు పటిష్టవంతంగా ఉన్నాయని వాటిని కూల్చివేయరాదని, నూతన సచివాలయం అవసరం లేదని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

07/05/2019 - 02:07

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చెయ్యడం మంచి నిర్ణయం. ఆ నిర్ణయంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమేరకన్నది తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. మరికొన్ని పరిణామాలు చూశాకే ఆ విషయం చెప్పగలం. తనలాగే ఇంకా చాలామంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన మాటలు సత్యదూరం కావు. కాంగ్రెస్ పార్టీ, ఆమాటకొస్తే ఏ జాతీయ పార్టీ అయినా బలహీనం కావడం దేశానికి మంచిది కాదు.

07/04/2019 - 02:41

భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతి పద్ధతులతో మొదలయ్యింది. తర్వాతి కాలంలో అనేక కొత్త విధానాలు, కొత్త పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడి నిచ్చే సంకరాలు సాగులోకి వచ్చాయి. పంటలకు వచ్చే తెగుళ్ళ నివారణకు వివిధ రసాయనాల వాడకం మొదలయ్యింది.

07/03/2019 - 04:34

దేశీయంగా ఒకప్పుడు 82 శాతం ఉన్న వ్యవసాయ కుటుంబాలు- నేడు 62 శాతానికి కుదించుకు పోవడం పాలనాపరంగా ప్రభుత్వాలు చేయూత నివ్వకపోవడం, అన్నదాతలను ప్రోత్సహించే నైజం పాలకులకు లేకపోయాయన్నది కఠోర వాస్తవం. భూమిని నమ్ముకొని రైతులు, వారి కుటుంబ సభ్యులు నిరంతర కష్టంతో పంటలు సాగుచేస్తారు. పంట ఉత్పత్తుల అంచనాలతో కుటుంబ వ్యవస్థ ప్రగతిని రైతు ఆశిస్తాడు.

06/28/2019 - 02:39

బాక్సైట్ తవ్వకాలను అనుమతించిన పాత జీవోను రద్దుచేస్తూ, ఇక ముందు తవ్వకాల్ని అనుమతించబోమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. గిరిజనులకు, పర్యావరణానికి మేలుచేసే నిర్ణయం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. బాక్సైట్ తవ్వకాలు మన్యప్రాంతాన్ని నీరు నిలవని ఎడారిగా మార్చడమేకాకుండా, గిరిజనుల్ని జీవనోపాధికి దూరం చేస్తాయి.

06/27/2019 - 01:51

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యం పంటకు ప్రసిద్ధి. ఈ జిల్లాల్లో పండిస్తున్న లక్షలాది టన్నుల ధాన్యాన్ని అన్నదాతలు సహా రాష్టవ్య్రాప్తంగా ఎవరూ తినకపోవటం దురదృష్టకరం. గోదావరి జిల్లాల్లో 9 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేస్తుండగా అందులో 7 లక్షల ఎకరాల్లో ‘ఎంటీ యు-3626’ అనే బొండాలు రకాన్ని పండిస్తున్నారు. దొడ్డురకం బియ్యాల్లో బొండాలు మరీ ముతకవిగా పేరుపొందాయి.

06/25/2019 - 02:12

విమానయాన రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నవేళ విమానయాన సంస్థలు ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని పోటీపడడం హర్షణీయం. కానీ, ఈ పరుగులో ఒక్కప్పుడు మార్కెట్‌లో 22.5 శాతం వాటాతో 195 రోజువారీ సర్వీసులు, 37 గమ్యస్థానాలతో ఒక వెలుగు వెలిగిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకొని కష్టాలను ఎదుర్కొంటోంది.

06/21/2019 - 21:50

ప్రాథమిక ఆరోగ్యం పట్టాలు తప్పితే ఎంతటి పెనుప్రమాదమో బిహార్‌లో తాజా ఉదంతం తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగం దాదాపు ఒకేలా దయనీయ స్థితిలో ఉంది. దానిని సరిదిద్దడం, లోపాల్ని అధిగమించడం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కర్తవ్యం. ఉదాసీనతతో ఉన్నా, అరకొర సంస్కరణలు చేసినా, అసలు సమస్యకి పొంతన లేని పరిష్కారాలు వెతుకుతూ కూర్చున్నా ఫలితం సున్నాయే.

06/20/2019 - 01:29

పదిహేడో లోక్‌సభ కొత్తగా కొలువుతీరిన తరుణంలో అఖిల పక్షాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు స్ఫూర్తిమంతంగా ఉన్నాయి. ‘సమావేశాలను ఆటంకపరచడం ద్వారా ప్రజల మనసుల్ని గెలవలేం, రాజకీయ విభేదాల్ని విస్మరించి పార్టీలన్నీ దేశ ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేయాల’న్న మోదీ దిశానిర్దేశం భేషుగ్గా వుంది.

06/19/2019 - 02:01

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సీ-2018 పోస్టులకు అభ్యర్థుల ఎంపికకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసి, ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. అయితే, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ పోస్టులకు సంబంధించి విద్యార్హతల ధ్రువపతాల పరిశీలనతోపాటు పూర్వపు సర్వీసు అర్హతలు కూడా నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది.

Pages