S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/31/2016 - 23:41

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, కొంతమంది అధికార్లు చెప్పే మాటలు వింటుంటే వాళ్ళు ప్రజలను తమకు ఓట్లు వేసే అమాయకులుగానే భావిస్తారని అర్ధమవుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రిగారు కరువు రహిత రాష్ట్రాన్ని సాధిస్తానని అంటారు. ఏ ఊరు వెళితే ఆ ఊరుని ‘స్మార్ట్’గా చేసేస్తాను ‘అలా ముందకు పోతున్నామని’ అంటాడు. మరొక ప్రక్క ప్రతిపక్ష నాయకుడు జగన్ ‘చంద్రబాబును విమర్శించినా నోరుమెదపలేని స్థితిలో ఉన్నారు.

05/31/2016 - 00:09

సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఐదు గ్రామాల్లో అనేక మంది స్థలాలు కొన్నవారు ఉన్నారు. పూర్వం ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి దాటవేస్తున్నారు. ఈ గ్రామాలు కాక దగ్గర గ్రామాల్లో స్థలాలున్నవారు వారి స్థలం అమ్ముకోలేక కొత్తగా స్థలం కొనుక్కోలేక బాధపడుతున్నవారు ఉన్నారు.

05/30/2016 - 05:15

తెలంగాణా యందు ఇంకుడు గుంటల విషయంలో ప్రముఖుల నివాస స్థానాలలోనూ, అధికారులు తమ నివాసాలలోనూ మంత్రుల నివాస స్థలాల్లోనూ, ఇంకుడు గుంటలకు స్థలాన్ని కేటాయించలేదని వార్తలు వస్తున్నాయ. బోధించడం ప్రచార ఆర్భాటం చేయడం అతి సులభాతి సులభం. కాని ఆచరణలో ఉంచడం అతి కష్టతరం. పెద్దలూ, ప్రభుత్వమూ గమనించుదురుగాక! ప్రముఖులూ ఒకరికి చెప్పేటందుకే నీతులా?! ఏమో?!
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి

05/28/2016 - 01:09

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం తరచూ ప్రమాద హేతువులవుతున్నాయి. ద్విచక్రవాహనాలు మొదలుకొని భారీ వాహనాలవరకూ డ్రైవింగ్ చేసే వారు డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వల్ల పరధ్యానంతో ఎదురుగా వస్తున్న వాహనాలను, పాదచారులను గమనించక ఢీ కొడుతున్నారు. ఫలితంగా వారికివారే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే గాక అమాయకులనూ బలి తీసుకుంటున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

05/27/2016 - 05:08

అసోంలో ఈమధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకు ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు గుణపాఠం చెప్పారు. ఆ రాష్ట్రంలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం దీనికి రుజువు. ఇంతకాలం మైనారిటీలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపిన కాంగ్రెస్ ఎత్తులను వారు చిత్తు చేశారు.

05/26/2016 - 05:53

ఆంధ్రప్రదేశ్, మహారాష్టస్రహా పలు రాష్ట్రాలు కరువుకాటకాలతో తల్లడిల్లుతున్నాయి. త్రాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ వేడిమికి పిట్టల్లా రాలిపోతున్నారు. ఎడారి ప్రాంతాలైన అరేబియా దేశాలలో చుక్కనీరు దొరకదు. వారు సముద్ర నీటిని ప్రాసెస్ చేసి ప్రజలకు త్రాగునీరు, పరిశ్రమలకు తగిన నీరు పుష్కలంగా అందిస్తున్నారు. మన దేశం మూడువైపులా సముద్రం వుంది.

05/25/2016 - 04:56

దాచుకున్న డబ్బుల మీద నెల నెలా వచ్చే వడ్డీని తగ్గించి యిచ్చి అది కొత్త సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టినందువల్ల అని బ్యాంకులు, పోస్ట్ఫాసులు అంటున్నాయి. యేటా ఏప్రిల్ మాసంలో ఫారం 15జి/ 15హెచ్ యిస్తున్నా అసల్లో కోత విధిస్తున్నది స్థానిక స్టేట్ బ్యాంకి. డిడక్ట్ చేసినట్లు సర్ట్ఫికెటు యిస్తాం. రిఫండ్ తెచ్చకోండి అంటున్నది. ఇప్పుడు యింకో సమస్యతోడైంది.

05/24/2016 - 00:20

సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఐదు గ్రామాల్లో అనేక మంది స్థలాలు కొన్నవారు ఉన్నారు. పూర్వం ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి దాటవేస్తున్నారు. ఈ గ్రామాలు కాక దగ్గర గ్రామాల్లో స్థలాలున్నవారు వారి స్థలం అమ్ముకోలేక కొత్తగా స్థలం కొనుక్కోలేక బాధపడుతున్నవారు ఉన్నారు.

05/23/2016 - 04:51

ప్రతిమతానికి సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. కేవలం కొన్ని ఆలయాల్లో మాత్రమే ఈ కట్టుబాట్లు ఉండం ఆ మతం ఉన్నతికే. స్ర్తి ప్రత్యక్ష దైవం మానవజాతికి మార్గదర్శకం. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎవరో గొడవ చేసి బావుకోవాలనుకోవడం సరైంది కాదు. ఏ ఇతర మతాల విషయంలో ఇటువంటి వాటిలో తలదూర్చని కోర్టులు హిందూమతం వచ్చేసరికి చులకన చేయ డం ధర్మం కాదు. హిందూమతంలో అక్కరలేని జోక్యాలను నివారించడం మంచిది.

05/21/2016 - 04:40

ప్రతి మనిషి జీవితంలో స్నేహం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అది నేడు చాలావరకు కలుషితమైపోయింది. నాడు అవసరానికి అదుకునే వారు స్నేహితుడు, నేడు అవసరానికి వాడుకొని వదిలేసేవాడు స్నేహితుడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వార్థంతో స్నేహం చేస్తున్నారే తప్ప నిజమైన స్నేహం కనుచూపుమేరలో కన్పించడం లేదన్నది అక్షరసత్యం. ముందు తీయగా మాట్లాడి ఆ తర్వాత అసలు రూపం చూపిస్తారు.

Pages