S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/05/2015 - 03:59

అతి సర్వత్రా వర్జయేత్ అనేది పెద్దల సూక్తి. కాని నేటి మన రాజకీయ నేతలు శృతి చేయడంలో మొనగాళ్లు. పదవి లేనిదే బతుకు లేదనే స్థాయకి కొందరు నేతలు దిగజారారు. కడుపు నిండిన అమ్మ, కుక్కల పెళ్లి చేసిందన్న సామెతలా ప్రజాసమస్యలను గాలికి వదిలి కొత్త చిక్కులు తెస్తున్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య వంటి పెద్దలు. అవసరం అనుకుంటే బీఫ్ ఫెస్టివల్ మేళాలు నిర్వహించి గొడ్డుమాంసం తింటాడట. గోవధపై కూడా అనవసర రగడ.

12/04/2015 - 03:47

అమీర్ ఖాన్‌కు భారతదేశంలో భ్రదత లేదట! ఇంతకు ముందు షారూక్ ఖాన్‌కు, సల్మాన్ ఖాన్‌కు భ్రదతలేదని పించింది. కృష్ణజింకను చంపిన కేసులో శిక్షపడలేదు. మద్యంమత్తులో కారు నడిపి రహదారి పక్కన పడుకున్న వారిని చంపిన కేసులో కూడా శిక్ష పడిన గంటలోగానే స్టే లభించింది. నిజమే ఇటువంటి దేశంలో మంచివారికి భద్రత లేదు. ఆ విషయానే్న సల్మాన్ ఖాన్ చెబుతు న్నాడు. మనం ఆ మాటను తప్పుగా అర్థం చేసుకుంటు న్నాం!

12/03/2015 - 03:09

యావత్ రాష్ట్రం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంచడం శుభపరిణామం. ప్రజల వ్యతిరేకత, నిఘా వర్గాల నివేదికలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికారపార్టీకి వాటిల్లబోయే నష్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటిం చింది.

12/02/2015 - 05:35

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్‌లు జారీ చేస్తుంది. అలా జారీ చేయడంతోపాటు, ప్రశ్నల నిధి, మోడల్ పేపర్లు, మాదరి ప్రశ్నా పత్రాలను కూడా విడుదల చేయవలసినదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు మనవి చేస్తున్నాం.
- కె. వెంకటేశ్వర్లు, కరీంనగర్
బాధ నుంచి దేశభక్తి పుట్టాలి

12/01/2015 - 05:21

మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడం సము చితం. విచారణ చేపట్టిన 20 నెలలలోపే శిక్షలు ఖరారు చేయడం ద్వారా నిందితునికి సరైన శిక్ష పడటంతో పాటు దేశంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఇనుమడిం చింది. తొలుత ముంబయ పోలీసులు సకాలంలో స్పం దించకపోయనా, మహారాష్ట్ర హోం మంత్రి జోక్యంతో విచారణ వేగవంతమైంది.

11/30/2015 - 06:19

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయితే ప్రణాళికా లోపంవల్ల అందరికీ పండుగలా ఉండవలసిన కార్యక్రమం, ప్రభుత్వానికి ప్రదర్శన వేదికగా, పిల్లలకు వారి తల్లిదండ్రులకు పరుగుల పందెంగా తయారైంది.

11/28/2015 - 04:27

ఎం.వి.ఆర్. శాస్ర్తీగారు రచించిన వంకర టింకర సెక్యులరిజం వ్యాసంలో ఓట్లకోసం రాజకీయ నాయకులు సర్కస్‌ఫీట్లను చక్కగా వివరించారు. కర్ణాటక ముఖ్య మంత్రే స్వయంగా గోమాంస భక్షణకై లొట్టలేస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం. రాబోయే కాలంలో సున్తీ చేయంచుకుంటే తప్పేంటి? ఆరోగ్యకరం కాదా? అని రాజకీయ నాయ కులు సన్నాయనొక్కులు నొక్కినా ఆశ్చర్యం లేదు.

11/27/2015 - 05:44

ప్రభుత్వం అధికారికంగా పండుగలూ, ఉత్సవాలూ నిర్వహించడం, విందులూ, దుస్తులు పంచిపెట్టడం, కులం మతం ప్రాంతం పేరుతో నజరానాలు, భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నది. ఇవేమీ ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు కానేకావు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల విశ్వాసం కలిగి మరోసారి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుంది. అధినేతతో మాట్లాడేందుకు మంత్రులకే అపాయంట్‌మెంట్ లభించడంలేదు.

11/26/2015 - 04:57

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలంగాణలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు యూనివర్సిటీ ప్రస్తుతం లేదు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమీ కూడా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది లేదు. ఇక ఉర్దూ అనేది జాతీయ భాష కాదు.

11/25/2015 - 04:59

దేశంలో ప్రస్తుతం 30వేల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇవి ప్రజా జీవితంలో దాదాపు అన్ని పార్శ్వాలను స్పృజిస్తున్నాయి. ఉదాహరణకు గోహత్యను దాదాపు 12 రాష్ట్రాలు నిషేధించినప్పటికీ, చట్టం మాత్రం అమలు కావడంలేదు. అదేవిధంగా వరకట్న నిషేధ చట్టం, జంతువుల హింస నిషేధ చట్టం, తప్పుడు మార్గాల్లో మత మార్పిడులు వంటివి.

Pages