S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/21/2020 - 00:49

మాతృభాష తల్లి పాలతో సమానం. శిశువుకు తల్లిపాలు లభించనట్లయితే ఏ విధంగా అనారోగ్యం పాలవుతాడో మాతృభాష అభ్యసించలేని విద్యార్థి కూడా విషయాలు నేర్చుకోవడంలో వెనుకబడతాడు. 1999వ సంవత్సరంలో యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడంతో 2000 సంవత్సరంనుండి ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ భాషలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

02/20/2020 - 00:27

1848 ఫిబ్రవరి 21. ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నిద్రాణంగా ఉన్న జర్మనీ తాత్విక పునాది నుండి నాడు విరిసిన గులాబి నేటికీ విముక్తి సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది. నాడు జర్మనీ కార్మికవర్గ విముక్తి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అనతి కాలంలోనే విశ్వనరుని విముక్తి గీతంగా మారింది.

02/18/2020 - 02:12

సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు భారత పాలక వర్గాలు లొంగిపోయి వచ్చే ఏడాదికి 30 ఏళ్లు పూర్తికానున్నది. ఈ లొంగుబాటు పర్యవసానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్ఫుటమవుతోంది. ఇక నుండి ఈ రాష్ట్రాన్ని ఆంగ్లప్రదేశ్ అని పిలుచుకోవడమే సమంజసంగా ఉంటుంది.

02/16/2020 - 02:57

ఎన్నికలలో ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి గెలుపు కోసమే పోటీ చేస్తారు. చివరి వరకు అందుకోసమే ప్రయత్నిస్తారు. అంతేకానీ, ఇంకొకరి గెలుపు ఓటముల కోసం పోటీ చేసే పార్టీ సహజంగా అయితే ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలు కొందరు అభ్యర్థులు వేరొకరి గెలుపు/ఓటమికి ఉపకరించేందుకు ఎన్నికల బరిలో దిగడం ఉంటుంది. అయితే, అలాంటి పార్టీలు అట్టే కాలం మన లేవు. మఖలో పుట్టి పుబ్బలో పుటుక్కుమని పోతాయి.

02/15/2020 - 23:35

ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభువులుగా సామాన్య ఓటర్ల ప్రజాధికార పాలనా వ్యవస్థ లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత రాజ్యాంగ నిర్దేశిత పవిత్ర సూత్రాల ప్రాతిపదికపై కొనసాగుతోంది.

02/13/2020 - 02:00

ఫిబ్రవరి 11వ తేదీ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం డెబ్బది స్థానాలున్న అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీతో ఆప్ అధికారం చేజిక్కించుకున్నది. బీజేపీ ద్వితీయ స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆప్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ముస్లింలీగ్ మాత్రమేకాక కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగంగా మద్దతునివ్వటం విశేషం.

02/12/2020 - 01:21

తారేఖ్ పతాహ్ సింథ్‌లో పుట్టారు, పాకిస్తాన్‌లో చదువుకున్నారు, కెనడా పౌరసత్వం స్వీకరించి అక్కడే వుంటున్నారు. తరచూ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి వివిధ టి.వి. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు అద్భుతంగా ఉంటాయి. ఎంతో తార్కికంగా, హేతుబద్ధంగా, విజ్ఞానదాయకంగా ప్రసంగాలు చేస్తారు. గొప్ప రచయిత, టెలివిజన్ వ్యాఖ్యతగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

02/11/2020 - 01:20

రాజధాని రైతుల నిరసనల పోరాటం 50 రోజులు దాటింది. రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతూనే వున్నాడు. ఎవరి గోల వారిదే! చంద్రబాబు మాత్రం తన కొత్త నేస్తం సీపీఐ నారాయణను వెంటేసుకొని పొలాలెంబడి, పల్లెలెంబడి ‘జగన్’పై గర్జిస్తూ చిందులు వేస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ మాత్రం తన పాత కొత్త నేస్తం బీజేపీతో తిరిగి చెలిమికి శ్రీకారం చుట్టేశాడు.

02/09/2020 - 23:55

గతంలో రాజులు- రాజ్యాల మధ్య వైరం, వైరుధ్యాలుండేవి. వర్తమాన ప్రజాస్వామ్యంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య వైరం, వైరుధ్యాలు కనిపిస్తాయి. అవి స్నేహపూర్వకమైనవి, స్పర్థతో కూడినవి కావచ్చు..

02/08/2020 - 22:41

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి జాదవ్‌పూర్ యూనివర్సిటీని స్థాపించిన మహాత్ముడు చిత్తరంజన్‌దాస్. ఇది ప్రాథమికంగా ఉన్నత పాఠశాలగా నెలకొన్నది. ఇప్పుడు మార్క్సిస్టుల ఉసిళ్ళపుట్టగా రూపొందింది. సమస్త భారతదేశానికి మహాత్మగాంధీ ఎంత మహనీయుడో ఆనాటి బెంగాల్‌కు చిత్తరంజన్‌దాస్ అంతటి మహాత్ముడు.

Pages