S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/08/2020 - 23:11

గత చరిత్రను, మన పూర్వికుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలను చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికే దినోత్సవాలు చేస్తూ ఉంటాము. ప్రపంచ వ్యాప్తంగా దేశాలవారీగా ఒక్కొక్క ప్రత్యేకతను పురస్కరించుకుని ఆయా సందర్భాలనుబట్టి దినోత్సవాలను జరుపుకుంటారు. అయితే మనం రోజూ బ్రతకడానికి తినే తిండిని అందిస్తున్న రైతును మాత్రం మరచిపోతున్నాం.

01/06/2020 - 23:25

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించినా, జాతీయ పౌర పట్టికను స్వాగతించినా అది జాతీయ వాదమని, మతతత్త్వమని, హిందుత్వానికి కొమ్ముకాయడమేనని వామపక్ష నేతలు, వారి మద్దతుదారులంటున్నారు. ఈ దారిలోనే అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ నక్సల్స్ చెలరేగిపోతున్నారు. తెలుపును తెలుపు, నలుపును నలుపు అనడం నేరమంటే ఎట్లా? వాస్తవాల్ని, సత్యాన్ని, నిజాన్ని పేర్కొంటే అది సంకుచితత్వమంటే ఎలా? జాతీయవాదమని నిరసిస్తే ఎలా?

01/04/2020 - 22:12

విల్ డ్యురాంట్ (1885-1981) 96 ఏళ్లు జీవించాడు. పదకొండు సంపుటాల ‘ప్రపంచ దేశ నాగరిక చరిత్ర’ను రచించాడు. మొదటి సంపుటం ప్రాచ్య నాగరికత (ఇండియా) చరిత్ర. ఈ సంపుటంలో ఆయన సముద్ర గుప్తుడిని గూర్చి, భారతదేశంలో ముస్లింల దండయాత్రలో దేవాలయాల విధ్వంసపు తబ్శీళ్ళను గూర్చి చాలా వివరాలు కూర్చాడు. సముద్ర గుప్తుడు భారతదేశ చరిత్ర స్వర్ణయుగానికి (క్రీ.పూ.4వ శతాబ్దానికి) చెందినవాడు.

01/03/2020 - 01:47

అమ్మభాషను కాపాడుకొనేందుకు, స్వాభిమానాన్ని చాటుకొనేందుకు అవసరమయ్యే నిర్మాణాత్మక ఉద్యమ సారథ్యానికి విజయవాడలో ఇటీవల జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు దిశానిర్దేశం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను నిర్బంధం చేయడంపై ఈ మహాసభల్లో నిరసన వ్యక్తమైంది.

01/02/2020 - 01:01

హిందుత్వం అంటే..మతం కాదు, భారత జీవన విధానమే హిందూమతం. ప్రపంచంలో అన్ని మతాలకన్నా అన్ని రకాల సంస్కృతులకన్నా హిందుత్వ విధానం చాలా పురాతనమైనది. ఈ భారత జీవన విధానంలో తరతరాలుగా యుగయుగాలుగా ఔదార్యం, ఉదారత్వం, త్యాగం, దానం, మిళితమైపోయాయి. ఈ త్యాగ, ఔదార్యాలవల్లనే ఎంతోమంది విదేశీయులు క్రీస్తుశతాబ్దానికి ముందే భారతదేశానికి వలసవచ్చారు. చుట్టపుచూపుగా వచ్చారు. ఇక్కడే తిష్టవేశారు.

01/01/2020 - 02:01

దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, అబద్ధాలే ప్రచారాస్త్రంగా సాగుతున్న, పౌరసత్వ సవరణ చట్టంను గురించే ఈ వ్యాసం. చట్టంలో ఏముందో స్పష్టంగా తెలుసుకునేందుకు, చట్టంలో ఆంగ్లంలో ఏమి ఉందో కూడా తెలుసుకోక తప్పదుగదా!

12/31/2019 - 00:12

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం 33వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రాజధాని పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

12/31/2019 - 00:01

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే. దేశంలో ఉన్న పౌరులలో 99శాతం మంది జన్మతః పౌరసత్వాన్ని పొందినవారే.

12/29/2019 - 02:12

ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా శాస్తవ్రేత్తలను కలవరపెడుతున్న సమస్య మైక్రోప్లాస్టిక్. ఇవి కంటికి కనబడని అతి సూక్ష్మ వ్యర్థాలు. ఇవి భూగోళమంతటా పేరుకుపోయాయని శాస్తజ్ఞ్రుల పరిశోధనల్లో తేలిన విషయం. అయితే ఈ మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మానవ శరీరాలలో కూడా చొచ్చుకుపోతున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీనిని నిర్ధారించడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు.

12/29/2019 - 02:09

నకిలీ మందులు అసలైన మందుల్లానే కనిపిస్తాయి- వాటి లేబుళ్లు, ప్యాకెట్లు కూడాను- కానీ అవి విలువ లేనివని తెలుసుకోండి. నకిలీ మందులు ఒక వ్యక్తిని నయం చేయవు కానీ వారి సమస్యలను మరింత తీవ్రతరం చెయ్యగలవు. దీనివలన చికిత్సపై ఎక్కువ వ్యయం అవుతుంది. నకిలీ మందుల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. భారతదేశాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Pages