S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/25/2019 - 03:15

విషజ్వరాలు వాటంతట అవి ఊరికే రావు. నేడు పల్లెలు, నగరాలనే తే డా లేకుండా దోమలు విజృంభించని ప్రదేశం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలు ఎలాగోలా ఇళ్ళలోకి చొరబడి మనల్ని కుడుతుంటాయి. ఇళ్లలో కిటికీలకు, ద్వారబంధాలకు ఇనుప మెస్‌లను అమర్చినా దోమలు కుట్టవనే భరోసా లేదు. స్నానాల గదిలో, బాల్కనీలో, చెట్లకొమ్మల్లో, చెత్తకుప్పల్లో దోమలు స్థిర నివాసం ఏర్పరచుకొని మన రక్తాన్ని పీల్చేస్తుంటాయి.

09/24/2019 - 03:26

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సబబే అని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అభిప్రాయపడింది. ఈమేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ న్యాయ విభాగం (సుప్రీం కోర్టు యూనిట్) తీర్మానించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరికి భిన్నంగా పార్టీ లీగల్ సెల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం విశేషం.

09/22/2019 - 03:42

పరస్పర ప్రయోజనాలను ఆశిస్తూ తెలంగాణ, అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఒక ఒప్పందం ఇటీవల కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా క్లీన్ టెక్నాలజీ (పరిశుభ్రమైన సాంకేతికత), వాణిజ్యం, విద్య, వ్యాపార రంగాల్లో ఉభయ ప్రాంతాలు పరస్పర ప్రయోజనం పొందేలా ఈ ఒప్పందం కుదిరింది. సోలార్ విద్యుత్‌లో ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఈ సందర్భంగా చెప్పారు.

09/20/2019 - 22:42

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా సింగపూర్ ప్రసిద్ధి చెందినా, అక్కడి ప్రజలు మలేషియా నుండి తాగునీటిని రోజూ విమానాలలో తెచ్చుకుంటారు. ఎక్కడైనా మానవ జీవనం అభివృద్ధి సాధించాలంటే నీరు అతి ముఖ్యమైన వనరు. అటువంటి నీటి వనరులు సింగపూర్‌లో లేవు. అయినప్పటికీ అతి తక్కువ కాలంలో సింగపూర్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇందుకు కారణం ఏమిటని సింగపూర్ ప్రధానిని ఒకరు ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబు- ‘విద్య’అని!

09/19/2019 - 02:40

యూపీఏ ప్రభుత్వం 2008-09లో ప్రారంభించిన బ్యాంకుల విలీనకరణ ప్రక్రియను ఇపుడు మోదీ సర్కారు కొనసాగించడం విడ్డూరం. 2008-09లో స్టేట్ బ్యాంక్‌లో దాని రెండు అనుబంధ బ్యాంకులైన సౌరాష్ట్ర, ఇండోర్ స్టేట్ బ్యాంకులను విలీనం చేశారు. 2016-17లో మిగిలిన అనుబంధ బ్యాంకులైన బికనీర్, హైద్రాబాద్, మైసూరు, ట్రావన్‌కూర్ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేశారు.

09/18/2019 - 02:10

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితికి చాలా కారణాలున్నాయి.

09/17/2019 - 02:27

ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించి యూ నివర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి విద్యార్థులు ఉత్సాహపడుతున్నా, వారి ఆకాంక్షలకు భిన్నంగా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగంలో వివక్షను నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా మారి విద్యార్థులు లాఠీదెబ్బలు, రబ్బర్ బుల్లెట్లకు సైతం లెక్కచేయకుండా పోరాడారు.

09/15/2019 - 00:52

భూమికి రక్షణ కవచంగా నిలిచేది ‘ఓజోన్ పొర’ అని శాస్తవ్రేత్తలు అభివర్ణిస్తుంటారు. సూర్యుడి నుంచి వెలువడే శక్తివంతమైన, ప్రభావవంతమైన అతి నీలలోహిత కిరణాలను శోషించుకుని, సకల జీవకోటికి రక్షణగా ఈ ‘పొర’ నిలుస్తోంది. ఓజోన్ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువు(ట్రై అటామిక్ ఆక్సిజన్ మాలిక్యూర్). ఇందులో ఉన్న అన్ని ఆక్సిజన్ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు.

09/13/2019 - 22:13

డెబ్బయి ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని కశ్మీరు సమస్య కేవలం డెబ్బయి రోజుల్లోనే తొలగిపోయింది. 370వ అధికరణం ఏ రణమూ లేకుండా బుట్టదాఖలైంది. గత పార్లమెంటు సమావేశాల్లో 30 బిల్లులను మోదీ ప్రభుత్వం ప్రవేశపెడితే, 20 బిల్లులు లోక్‌సభలోను, ఉభయ సభల్లో 14 బిల్లులు ఆమోదం పొందాయి.

09/13/2019 - 03:51

దేవాలయాలను నిర్మించేటప్పుడు ఆ కాలపు చరిత్ర ప్రతిబింబించాలని ఆగమశాస్త్రం చెప్పినట్టు ఎలాంటి దాఖలాలు లేవు. దేవాలయం అనేది భక్తికి, ఆధ్యాత్మికతకు ఆలవాలం. అందుకే అక్కడి పరిసరాలు తదనుగుణంగా వుండాలని భావించడం పరిపాటి. పవిత్రమైన దేవాలయం గాలిగోపురాలపై వివిధ భంగిమలలో శృంగార శిల్పాలు వుండటం గురించి సంఘసంస్కర్త, హేతువాది తాపీ ధర్మారావు‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ పేరిట ఓ గ్రంథానే్న రచించారు.

Pages