S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/28/2016 - 04:50

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో స్థానాన్ని పొందిన మన దేశం ఒలింపిక్ క్రీడలలో మాత్రం ఇంకా అట్టడుగునే వుండటం బాధాకరం. భారత్ కంటే చిన్న దేశాలు ఇటీవలి రియో ఒలింపిక్స్‌లో పతకాలను కైవసం చేసుకోవడంలో ముందు వరుసలో నిలిచాయ. మన దేశానికి ఒక్క స్వర్ణ పతకం కూడా దక్కలేదు. రజత, కాంస్య పతకాలను సాధించిన ఇద్దరు యువతులు రియో ఒలింపిక్స్‌లో భారత్ పరువు నిలిపారు.

09/27/2016 - 01:47

రాజకీయ జోక్యం, అభిమానుల కులతత్వం, వెబ్‌సైట్ రివ్యూలు.. మా సినిమా ఆడకుండా కక్షకట్టి ప్రచారం చేస్తున్నాయి! దానివలన కోట్లు ఖర్చుపెట్టి విదేశాల్లో నిర్మించిన మా సినిమాలు ఆడకుండాపోతున్నాయి! ప్రేక్షకులు కూడా ఆ ప్రచారాలను నమ్మి సినిమాలను కనె్నత్తి కూడా చూడటం లేదు.. అని నేడు కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలు లబోదిబోమని ఏడుస్తున్నారు! ప్రెస్‌మీట్‌లు పెట్టి గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

09/26/2016 - 03:21

వర్షాకాలంలో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా పట్టణాలలో, గ్రామాల్లో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు బాధించకుండా వుంటాయి. మురికి గుంటలు, నీరు నిల్వవుండే తొ ట్టెల్లో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి. పశువులను ఇళ్ల మధ్య కాకుండా ప్రత్యేక ప్రదేశాల్లో పోషించాలి. మరుగుదొడ్లు, స్నానాల గదుల్ని వెలుతురు వుండేలా చూసుకోవాలి.

09/24/2016 - 00:40

ఎటు చూసినా బాంబులు అది రెస్టారెంటైనా కావొచ్చు, పాఠశాలైనా కావొచ్చు లేదా మసీదు, చర్చి, దేవాలయమైనా కావొచ్చు. ఐ.ఎస్ ఉగ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. తాజాగా ఢాకాలో పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ ఆలీ ఆబాదీ కరాదాలోని ఘటనా స్థలికి వస్తే ‘దొంగ’గా అభివర్ణిస్తూ ప్రధాని కాన్వాయ్‌పై రాళ్ళు, చెప్పుల వర్షం కురిపించారు.

09/22/2016 - 22:38

ప్రపంచంలో 50 శాతం మందికి, భారతదేశంలో 70 శాతం మందికి, తెలుగు రాష్ట్రాలలో అయితే 85 శాతం మందికి ప్రధాన ఆహార ధాన్యం బియ్యమే. ఈ బియ్యం తయారీకి ముడి పదార్థమైన వరిని పండిస్తేనే సరికాదు. దానిని సక్రమంగా మరపట్టి బియ్యంగా మా ర్చాలి. ఈ క్రతువులో బియ్యం మిల్లులదే అగ్రస్థానం. ఒకప్పుడు బియ్యం మిల్లుల యజమానులు తలఎగరేసుకుని తిరిగేవారు.

09/22/2016 - 22:36

చెట్టుముందా లేక విత్తనమా, కోడి ముందా లేక గుడ్డా అని ప్రశ్నిస్తే ఎంతటి పండితుడైనా సరియైన జవాబు చెప్పలేడు. సరిగ్గా ఇలాం టి చిక్కు సమస్యనే నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దేశం లో ఇతర ప్రాంతాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు నక్సల్ ప్రభావిత క్షేత్రాలలో చేపట్టకపోవడంవల్లనే నక్సల్స్ విస్తరిస్తున్నారు, విజృంభిస్తున్నారు. రక్తపాతం జరుగుతున్నదనేది సత్యం.

09/22/2016 - 06:54

అలనాడు యావత్ ప్రపంచానికి దిక్సూచిగా పనిచేసిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. అయి తే, అదే భారతదేశం ప్రస్తుతం పలు రంగాలలో చుక్కాని లేని నావలా సాగుతున్నది. పాశ్చాత్య దేశాలు నేడు ఎంతో అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో దూసుకెళ్తున్నాయి. దీనికి కారణం, పాశ్చాత్యులు సైన్స్‌ను మతం, రాజకీయాలు నుంచి వేరుచేయడమే. అదే మన దేశంలో మతం చుట్టూ రాజకీయాలు, సైన్స్ పరిశోధనలు జరుగుతున్నాయి.

09/22/2016 - 06:51

ఎస్సెస్‌మెంట్‌లో ఒక భాగం ప్రతి రోజు పునశ్చరణ చేయటం. అది ప్రతి రోజు జరుగుతుంది. వారానికి ఒక రోజు జరుగవచ్చును. నెలకు ఒకసారి కూడా జరుగవచ్చును. కొన్నిసార్లు వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాతపూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా, కొన్ని సమయాల్లో రాత పూర్వకంగా జరుగుతుంటుంది. అది వౌఖికంగా జరిగినా టీచర్ దాన్ని రికార్డుచేసుకోవలసి ఉంటుంది. రాతపూర్వకంగా జరిగితే ప్రతి వాక్యం చదవాలి.

09/20/2016 - 22:15

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపాలనాకాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధిని, పారిశ్రామికాభివృద్ధినీ సాంకేతిక భాషలో చెబుతుంటారు. దేశంలో జిడిపి ఇంతగా పెరిగిందని, తలసరి ఆదాయం అంత పెరిగిందని చెబుతుంటారు. ఈ లెక్కలు సాధారణ ప్రజలకేమీ అర్థం కావు. విద్యావంతులక్కూడా అర్థం కావు. అసలు జిడిపి అంటే ఏమిటో, దానినెలా లెక్క కడతారో ప్రజలకర్ధమయ్యేలాగున ఒక్కరుగాని, ఒక్కసారి గాని చెప్పరు.

09/20/2016 - 22:14

భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలైన అర్చకులు ‘‘అర్చక నిధి చంద్రశేఖరా’’అంటూ మొత్తుకుంటున్నారు. భక్తి ఎక్కువగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా ధూప దీప నైవేద్యాలు నిలిపేసి, అర్చకులు ఆందోళన చేసినప్పటికి వారి సమస్యల పరిష్కారం ఇంకా ‘‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది’అన్నట్లు ఉంది.

Pages