S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/29/2016 - 23:58

ప్రపంచ ఒలింపిక్ పోటీలలో బాడ్మిమింటన్‌లో రజతాన్ని పి.వి. సింధు, జిమ్నాస్టిక్‌లో కాంస్య పతకాన్ని దీపాకర్మాక్, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసారు. అందుకు వారు అభినందనీయులు- సన్మాన సత్కారార్హులు.

08/29/2016 - 00:41

తెలుగు మన మాతృభాష. మధురమైన భాష. వనె్న తరగని భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడిన భాష. అచ్చ తెలుగు నుడికారాలు, ఛందస్సులు, పదప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాల వారీగా యాసలు మొత్తంమీద మన తెలుగు నిజంగా వెలుగు భాషే. ఆధునిక తెలుగుభాషా సాహిత్య యుగకర్త అయినటువంటి గిడుగు వెంకట రామమూర్తి జయంతి (ఆగస్టు 29)ని మనం తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే..

08/27/2016 - 07:22

హరిత విప్లవం వల్ల మనం తీవ్ర కరవులను నివారించినా, మన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి తగ్గుతూ వస్తున్నది. ఆహార ధాన్యాల పెరుగుదలలో స్థిరత్వం లేదు. ఉత్పత్తి పెరగటం, మరల తగ్గటం సాధారణమై పోయింది. వివిధ ధాన్యాల ప్రగతిలో వ్యత్యాసాలు బాగా వున్నాయి. వరి, గోధుమలలో ప్రగతి బాగున్నా, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాల విషయంలో ఆశించిన ప్రగతి లేదు.

08/25/2016 - 23:53

భారతదేశం ఒక మట్టిముద్దకాదు. ‘్భరతమాత’ అని పిలవబడే దేవత. అనాదిగా అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణలకు, ఉన్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారాలకు జన్మస్థానంగా ఉంది. ఈ దేశం ఒక కోటలాగా సుస్థిరంగా తన ఆధ్యాత్మిక ఉన్నత ఆదర్శాన్ని అత్యంత సంపూర్ణమైన స్వచ్ఛతతో నిలుపుకోగలదు. భారతదేశం ప్రపంచానికి గురువు. ప్రపంచం తన మంచికోసం భారతదేశాన్ని రక్షించుకోవాలి.

08/25/2016 - 23:52

ఒకపక్క ఏటా ఐదు కోట్లుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ.15కోట్లకు పెంచమని కోరటం, మరొక పక్క కేటాయించిన నిధులనే 50 శాతం మంది సకాలంలో ఖర్చుచేయలేక పోవటంతో మరొక్కసారి ‘యం.పి.లాడ్స్’ అంశం వార్తలకెక్కింది.

08/24/2016 - 23:58

సామాజికపరంగా నైతిక దృష్టి కొరవడి అత్యాధునికత పేరిట సృష్టికే ఆటంకం కలిగించే దృష్ట పరిణామాలు చోటుచేసుకోవడం సమాజ దుస్థితికి అద్దంపడుతోంది. విద్యావంతులు, పామరులు, ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సైతం లింగ వివక్షతను పాటిస్తూ, సృష్టిక్రమానికి అడ్డువేయాలని భ్రమించడం నైతిక పతనానికి పరాకాష్ఠ.

08/24/2016 - 23:56

ఇరవయ్యవ శతాబ్దంలో తరగతి గది చుట్టుపక్కల వున్న సమాజానికి ప్రతిబింబం. కానీ 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిణామాలు తరగతి గది మొత్తం వసుదైక కుటుంబానే్న ప్రతిబింబించే స్థాయికి ఎదిగింది. సమస్త మానవ కోటి, జీవరాశి తరగతి గదికి వచ్చేసింది. తరగతి గది బోధనా పద్ధతులైనా, నేర్చుకునే పద్ధతుల్లో కూడా మార్పురావటం సహజం.

08/24/2016 - 07:41

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ఆంధ్ర సన్నఖాదీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పేటెంటు హక్కులను కల్పించింది. పొందూరు ఖాదీని రక్షించేందుకు, నకిలీ ఖాదీని అరికట్టేందుకు ఈ పేటెంటు హక్కులు ఉపయోగపడతాయి. ప్రైవేటు సంస్థలు కాని, ప్రైవేటు వస్త్ర వ్యాపారులు కాని పొందూరు ఖాదీ పేరుతో విక్రయాలు జరిపినా, దుకాణాలు నిర్వహించినా వారిపై చట్టపరమైన చర్యలు ఉం టాయి.

08/24/2016 - 07:36

మన ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికావాలని కోరుతుంది. వివిధ అర్జీలు తెలుగులో వ్రాస్తే వాటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటించింది. తెలుగును అధికార భాషగా చేయడానికి అధికార భాషా సంఘాన్ని నియమించింది. పరిపాలన విషయంలో వీలైనంతవరకు తెలుగు ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేస్తున్నది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాఠశాలల్లో తెలుగు భాష ప్రమాణాలు దిగజారిపోతున్నాయి.

08/22/2016 - 23:51

ఒక అడుగు ముందుకు.. నాల్గు అడుగులు వెనుకకు ఇది తెలంగాణ విద్యాశాఖ పరిస్థితి. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రకటనలు విద్యావంతులు, మేధావులను అయోమయానికి గురిచేశాయ. ఈ ఏడాది మొదట్లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎన్నికలవల్ల ఆపేశారు. మరల మార్చినెల మొదటివారంలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మరో రోజు తర్వాతే కేంద్రం టెట్ విధానాలు మారుస్తుందంటూ వాయిదావేశారు.

Pages