S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/24/2016 - 00:21

భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రులు కొందరు అడ్డుఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు.

05/23/2016 - 04:44

నేడు భారతదేశంలోనే కాక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నీటి సమస్య అధికమైంది. ఎన్నో సంవత్సరాలుగా శాస్తవ్రేత్తలు మేధావులు నీటి సమస్య వస్తుందని చెప్పినప్పటికీ, రాజకీయ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వస్తే గిస్తే మూడో ప్రపంచ యుద్ధం నీటిపైనే వస్తుందనటంలో సందేహం లేదు.

05/22/2016 - 02:12

ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నది. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థది మూడోస్థానం. పార్లమెంట్ చేసే చట్టాలకు రాజ్యాంగానికి, భంగం వాటిల్లకుండా చూడడం, పాలనా వ్యవస్థ అదుపుతప్పితే వ్యాఖ్యానించడం, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలివ్వడం న్యాయవ్యవస్థ విధి.

05/21/2016 - 04:38

కరీంనగర్ జిల్లా గతకీర్తికీ, ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచి వెలుగుతోంది. రాష్ట్ర పురావస్తుశాఖ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా ప్రాక్చచరిత్ర 50 వేల సంవత్సరాలకు పూర్వమున్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీకాదు.

05/20/2016 - 00:44

విద్యార్థి అనేపదానికి విద్యను అర్థించేవాడు అని అర్ధం. కాని ఈ పదం నేటి పాఠశాలలలో చదువుకునే వారికి ఎంతమాత్రం వర్తించదు. ఇంగ్లీషులో స్టూడెంట్ అనే పదానికి సరైన తెలుగు పదం కనిపించడం లేదు. కనుక ఈ పదాన్ని తప్పని పరిస్థతుల్లో వాడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తోంది. దీనితోపాటు భోజనం పుస్తకాలు కూడా ఉచితమే. అనేక వసతి గృహాలున్నాయి.

05/20/2016 - 00:43

ప్రపంచంలో ఏ దేశంలో కులాలు లేవు. మన దేశంలో మాత్రమే కులాలు ఉన్నాయ. కుల రహిత సమాజం ఐనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వర్గాల వారికి దేవుడిలాంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మా వాడని చెప్పుకోవడానికి అగ్రవర్ణాలైన ముఖ్యమంత్రులు పోటీపడి ఎతె్తైన విగ్రహాలను స్థాపించడానికి పూనుకొనడం రాజకీయ ఎత్తుగడలో భాగం. కుల నిర్మూలన జరగాలంటే కులాలకతీతంగా వివాహాలు జరగాలి.

05/20/2016 - 00:48

డాక్టర్ నీలం సంజీవరెడ్డి గొప్ప జాతీయ నాయకుడు మాత్రమేకాదు మహోన్నత జాతీయవాది. భారతీయులు గర్వించదగ్గ నిష్కళంక తేజోమూర్తి. స్వయం ప్రతిభతో, స్వయం కృషితో, అంచలంచలుగా ఎదిగి, రాజకీయాలలో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన జీవిత కాలంలో అధికభాగం దేశ సేవకే అంకితంచేశారు.

05/19/2016 - 07:25

విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే మా అబ్బాయి అచ్చు చిన్న డబ్బా చేతిలో పట్టుకుని వచ్చాడు. ‘‘రోడ్డుపై ఉమ్మివేయటం అనైతికమైనది ఆ క్రిములు వాతావరణంలో కలిసి కలుషితం చేస్తాయి. రోడ్లపై బైట మాత్రం, మల విసర్జనలు చేయటం ఏ రకంగా తప్పో, అనైతికంగా భావిస్తామో, రోడ్డుపై ఉమ్మివేయటం కూడా తప్పే’’అని మా అబ్బాయి అచ్చు అన్నాడు.
దీంట్లో అనైతికం ఏం ఉందిరా? అని అడిగాను.

05/17/2016 - 23:54

ఆంధ్రదేశంలో విజ్ఞాన ఉద్యమం ప్రారంభికులలో ముఖ్యుడు కొమర్రాజు లక్ష్మణరావు. తెలుగు భాషలో చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ముద్రించి ఆంధ్రులు విజ్ఞానవంతులు కావడానికి ప్రాతిపదికను ఏర్పరచారు. ఈయన కృషి ఆంధ్ర దేశంలో పునరుజ్జీవన ఉద్యమానికి దోహదపడింది. 18 మే, 1877లో కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో గంగమ్మ, వెంకటప్పయ్యదంప తులకు జన్మించారు.

05/17/2016 - 23:48

సర్కారీ ఉపాధ్యాయులు బృందాలుగా పిల్లల వేటలోమండుటెండలను కూడా లెక్క చేయకుండా,పాంప్లెట్లు, ఫ్లెక్సీలతో ఊళ్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు సర్కారు ఎప్పటికప్పుడు బడి ఈడు పిల్లల్ని లెక్కకడుతోంది. ఇంతకీ ఎందుకీ శ్రమ? ఇన్నాళ్లూ లేని ఆర్భాటాలు-ప్రచారాలు ఎందుకు?

Pages