S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/09/2016 - 07:25

చాలామంది ప్రజాప్రతినిధులు అంటూ వివిధ రకాలైన రాజకీయ నాయకులు చాలామంది బయల్దేరారు. వీరందరికీ లక్షల్లో జీతాలు ఇవ్వాలని వారికి వారే రాసేసుకుని చట్టాలు చేసేసుకుని జీతాలు దండుకుంటున్నారు. ఇంతకంటే నైతిక దివాలాకోరుతనం ఎక్కడా ఉండదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ప్రజాధన పరిరక్షణ బాధ్యతని విస్మరించి లక్షల్లో జీతాలు పెన్షన్లు పుచ్చుకోవటం స్వాతంత్య్రోద్యమ త్యాగస్ఫూర్తికి విరుద్ధం.

05/07/2016 - 06:29

ఈ మధ్య మన దేశంలో ఒక కొత్త సామాజిక సమస్య మొదలైంది. రోజురోజుకు పెళ్ళికాని ప్రసాదుల జాబితా చాంతాడులా పెరిగిపోతున్నది. ఈ సమస్య ఉత్పన్నం కావటానికి కొంత స్వయంకృతాపరాధం ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు వైద్యపరీక్షల సహాయంతోనో లేక మరో విధంగానో ఆడపిల్లల జననాలను నిరోధించి మగపిల్లలను కనిపెంచేవారు. దీనివలన మగ పిల్లలు 100% ఉంటే ఆడపిల్లలు 85% మించి లేరు.

05/06/2016 - 00:45

జన ఆరోగ్య వ్యవస్థకు కట్టుదిట్టమైన ధీమా ఇవ్వాల్సిన ఔషధరంగమే డొల్లపోయి, వివిధ ఔషధాల కంపెనీలు ఉత్పత్తిచేస్తున్న మందులు మానవాళికి అనారోగ్యకర ప్రభావం చూపుతున్నాయంటే అవి వ్యాధి నిరోధక మందులా? లేక అనారోగ్యాన్ని ప్రేరేపించే మృత్యుపాశాలా అనిపించక మానదు. ప్రజారోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్న 344 ఔషధాల ఉత్పత్తి, సరఫరాలపై కేంద్ర ఔషధ నియంత్రణ నిషేధం విధించింది.

05/06/2016 - 00:44

ప్రపంచ చిత్రపటంలో మూడోవంతు నీరు ఉన్న ఒక్కవంతు భూభాగంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సంక్షోభం తప్పడం లేదు. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని కాపాడటంలో విఫలమవుతున్నాడు.

05/05/2016 - 06:40

చాలాకాలం క్రితం అనగా సుమారు ఏభై ఏళ్ల క్రితం పల్లెలలో అస్పృశ్యత స్వల్పంగా ఉండేది. పట్టణాలలో అస్పృశ్యత అనే సమస్య లేదు. ఇప్పుడు పల్లెలలో కూడా దళితులు వివిధ వృత్తులు నేర్చుకుంటున్నారు. ఆయా పనులు చేయడానికి వారు అగ్రవర్ణాల వారి ఇళ్లలోకి వస్తున్నారు. పల్లెటూళ్లలో ఎవరిది ఏ కులమో, సులువుగా తెలుస్తుంది. అందువలన వారు దేవాలయాలలోకి రావడం లేదు. వచ్చినా ఎవరూ అభ్యంతరం చెప్పరు.

05/05/2016 - 06:38

బోధన సామాజిక ప్రక్రియ. ఒక మార్పు తీసుకురావాలంటే ఆ మార్పు యొక్క పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలిసి ఉండాలి. విద్య ద్వారా సమాజ పరివర్తన తీసుకురావాలని అంబేద్కర్ చెప్పాడు. విద్య ఒక రోడ్ రోలర్ అన్నాడు. విద్య ద్వారా సమాజంలో వున్న అసమానతలు చదును చేయాలన్నాడు. ఈ మార్పును తీసుకురావటానికై తరగతి గది ఒక సాధనం అన్నాడు. ఈ తరగతి గది యొక్క డ్రైవర్ ఉపాధ్యాయుడు. కాబట్టి మొదట టీచర్ సమాజాన్ని అధ్యయనం చేయాలి.

05/04/2016 - 07:01

విద్య... ధనం లాంటిది. చదువుకున్నవాడు ధనవంతుని లాంటివాడు. తరతరాలనుండి అనేకానేక చారిత్రక కారణాల వలన ధనం ధనవంతులవద్దనే కేంద్రీకృతమై పెరిగిందో, అలాగే విద్యకూడా ఆయా కాలాలలోని విద్యాధికుల, జ్ఞానుల వద్దే కేంద్రీకృతమై పెరిగింది.

05/04/2016 - 06:59

ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించి, తమ జీవితంలో ఒక్కసారి అయిన కుంభమేళాలో స్నానమాచరిస్తే తమ జీవితం ధన్యమైనట్లే అని భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా మన దేశంలోని ఉజ్జయిని, అలహాబాద్, హరిద్వార్, నాసిక్‌లలో జరుగుతాయి. కుంభమేళాకు అశేష జనసందోహం హాజరవుతారు. ఈ జన సందోహాన్ని నియంత్రించడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పనికాదు.

05/03/2016 - 00:41

‘శ్రీకృష్ణునకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణ అనువారు ఎనిమిది మంది (అష్ట) భార్యలుగా కీర్తించబడుతున్నారు. అష్ట్భార్యలు సృష్టిలో అష్టవిధ ప్రకృతులకు ప్రతీకలు. అష్టమహిషులతో శ్రీకృష్ణ కళ్యాణ వైభవాన్ని మహాకవి పోతన తమ భాగవతంలో అత్యంత మనోహరంగా వర్ణించారు. తరువాతి కాలంలో ప్రసిద్ధ కవులు కొందరు వ్రాసారు.

05/02/2016 - 04:22

మన సమాజంలో సంప్రదాయక నీతి, సౌశీల్యం, నిజాయితీ, అనుబంధాలు వగైరా ఉత్తమమైన, సహజమైన సాంఘిక లక్షణాలు అడుగంటిపోవడానికి కొన్ని తమాషా కోర్టు తీర్పులు- తెలిసో తెలియకో దోహదం చేస్తున్నాయి. శని సింగణాపూర్ దేవాలయంలోకి స్ర్తిలను అనుమతించకపోతే ఆరు నెలలజైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని డిహెచ్ వాఘేలా, ఎంహెచ్ సోసక్‌లతో కూడిన బొంబాయి హైకోర్టు ధర్మాసనం గత మార్చి 30న తీర్పు ఇచ్చింది.

Pages