S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/13/2016 - 07:43

భారతదేశంలో ప్రాచీన కాలంలోను, మధ్యయుగాల్లోనూ, ఆమాటకొస్తే బ్రిటిష్ వారాక్రమించుకునే వరకూ, వివిధ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులూ వుండేవారు. వారి పాలన మాటెలావున్నా వారి జీవనశైలి అతి ఆడంబరంగా వుండేది. రాజుగారు బయలుదేరితే ఏనుగు అంబారీపై కూర్చుని వెళ్ళేవారు. ఆ ఏనుగుకు ముందు ఆయుధ పాణులైన నలుగురు సైనికులు గుఱ్ఱాలమీద వెళ్ళేవారు. అలాగే వెనుక నలుగురు, వారి వెనుక గజాలు, గుఱ్ఱాలూ వెళ్ళేవి. రథాలుండేవి!

04/13/2016 - 07:42

వాతావరణ మార్పు అభివృద్ధి నిరోధక శక్తిగా మారింది. అనేక అంతర్జాతీయ సదస్సులు జరిగినా ఫలితం వుండటం లేదు. భూతాపం పెరుగుతూనే వుంది. అభివృద్ధి వలన, ముఖ్యంగా పారిశ్రామికీకరణ వల్ల వెలువడే కర్బన్ ఉద్గారాలు ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.

04/12/2016 - 00:18

నిత్యసత్యానే్వహణే జీవితపరమావధిగా ఎంచి, తన సర్వస్వాన్ని అందుకోసం ధారవోసి, సిద్ధి పొందిన తాపసి ప్రముఖ చారిత్రక పరిశోధకుడు సంగనభట్ల నరహరిశర్మ. కరీంనగర్ జిల్లాచరిత్రతో, ధర్మపురికి చెందిన నరహరి శర్మకు విడదీయజాలని అనుబంధం ఉంది. శాతవాహన చక్రవర్తుల తొలి రాజధానిగా గుర్తింపునొందిన కోటిలింగాల చరిత్ర వెలికితీతకు సంబంధించి నరహరి చేసిన అవిశ్రాంత కృషి అనన్య సామాన్యం.

04/11/2016 - 05:09

‘మనువు’ మానవుని మనుగడకు మార్గదర్శనం చేసిన మహనీయుడు. సనాతన ధర్మంలోని భారతీయ జీవన సత్యంలో తల్లిని మించిన దేవత మరోటి లేదనేది యుగాలను అధిగమించిన భారత జాతీయ స్వభావానికి నిదర్శనం. అక్షరాలు దిద్దంచే ఉపాధ్యాయుడి కంటే సంస్కారాలను అందించే ఆచార్యుడు పదిరెట్లు గౌరవనీయుడు. ఆచార్యుడు కంటే జన్మకు కారకుడైన తండ్రి నూరురెట్లు వందనీయుడు.

04/09/2016 - 00:10

దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల వారితో సమానంగా పరిగణిస్తూ రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా విరుద్ధం. హిందువులుగా వున్న షెడ్యూల్డ్ కులాల, ప్రజల హక్కులకు పూర్తిగా హాని కలిగించే చర్య ఇది.

04/07/2016 - 22:46

నేడున్న పరిస్థితుల్లో ఇండియా వంటి వ్యవసాయ దేశాల్లో పేదరిక నిర్మూలనకు వ్యవసాయ అభివృద్ధే మేలైన మార్గమని 2008 ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఇతర ఆదాయ మార్గాలతో పోల్చితే వ్యవసాయం పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో రెండు రెట్లు అధిక సానుకూలమైందని ఆ నివేదిక నొక్కి చెప్పింది. గ్రామాల్లో 80 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారని 2012 అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

04/07/2016 - 06:30

గతంలో ఎన్నడూ లేని దుర్గతి నేటి ప్రాథమిక సెకండరీ విద్యలకు పట్టింది. ఈ తిరోగమన విధానమే ప్రైవేటు పాఠశాలల దినదినాభివృద్ధికి అవకాశం కల్గించింది. పూర్వం ప్రైవేటు పాఠశాలలు లేవు ఆనాడు పురపాలక సంఘాలు జిల్లా బోర్డులు ఎయిడెడ్ సంస్థలు పాఠశాలలు నిర్వహించేవి. ఆ పాఠశాలలన్నీ ప్రభుత్వ విధానాలు అమ లు జరిపేవి. ప్రభుత్వ ఉదాసీన విధానాలవలన 1970వ దశకం నుండి ప్రైవేటు పాశాలలు శరవేగంగా పెరిగి నేడు విశ్వరూపం దాల్చాయి.

04/07/2016 - 06:29

కొత్తగా టీచరైన కాలంలో పాఠం చెప్పేటప్పుడు నా ఉపోద్ఘాతమంతా కూడా లెక్కల గురించి గొప్పతనం చెప్పడమే చేశాను. లెక్కలు మనిషి యొక్క అద్భుతమైన ఆవిష్కరణలో ఎంత కీలకమైన పాత్ర వహించాయో చెప్పటం, పిల్లల యొక్క అటెన్షన్ పెంచటం. లెక్కలు నేర్చుకోవటం ఆషామాషీ కాదు. ఎంతో కష్టపడితే అర్థమవుతుందని చెప్పటం నా తొలి ఉపాధ్యాయ రంగంలో వేసిన అడుగులవి. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే?

04/06/2016 - 07:07

అసదుద్దీన్ ఒవైసీ ఏదో అన్నాడని దానిమీద ఇంత రభస అవసరమా? - ఆయన మానాన దాన్ని వదిలేసి ఉంటే ఇంత ప్రాముఖ్యం లభించేది కాదు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకుని ఉండేవారుకాదు. రజాకార్ల కాలంలో రాష్ట్ర ప్రధానిగా పనిచేసిన మీర్ లాయక్ అలీ పోలీసుచర్య తర్వాత గృహ నిర్బంధంనుంచి తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయాడు. ఈ సంగతి విన్న సర్దార్‌పటేల్ దీన్ని ఏదో రోజుజరిగే వ్యవహారంగా తీసుకొని ఏ చర్యాతీసుకోలేదు.

04/06/2016 - 07:06

ప్రతి మనిషి నిత్యజీవితంలో ఉదయం లేవగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంలోకి కూరగాయల అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి కూరగాయల్ని పండించే రైతులు నేడు విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు కూరగాయల్ని పండించి ప్రస్తుతం ఎంతో నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోని రైతులు క్వింటాళ్ళకు క్వింటాళ్ళు తగిన ధర లేక తెంపి పారబోస్తున్నారు.

Pages