S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/23/2016 - 04:10

ప్రముఖ ఆంగ్ల రచయిత విలియమ్ షేక్స్‌పియర్ పరమపదించిన రోజు, తెలుగు కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ గారు జన్మించిన రోజు. ఈ ఇద్దరూ సాహితీవేత్తలే.. ప్రపంచ పుస్తక దినోత్సవం కూడా ఈ రోజే కావడం విశేషం.

04/21/2016 - 23:45

హంగులు ఆర్భాటాలు ఏవీ లేకుండా మన పిల్లలకు చక్కని తెలుగు నేర్పే నాథులే కరువయ్యారు. తప్పులు లేకుండా మన తెలుగును చక్కగా ప్రచురించి మన పిల్లలకు అందచేయాలన్న బాధ్యతను విస్మరించారు. నాలుగో స్తంభంవారు (ఆంధ్రభూమి మాత్రం కాదు) సాంకేతిక సమస్యల వలన పూర్తి నిడివి వార్తలతో అక్షరమొక వరుసలో సున్న మరొక వరసలో ప్రచురించవలసి రావడాన్ని అర్ధం చేసుకోవచ్చు.

04/21/2016 - 23:43

ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్) కేంద్ర ప్రభుత్వంచే 1993 డిసెంబర్ 23న ప్రవేశపెట్టబడింది. అప్పుడు ప్రతి ఎంపీకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. దీన్ని 1994లో కోటి రూపాయలకు, 1998లో 2 కోట్ల రూపాయలకు, 2011లో ఐదు కోట్ల రూపాయలకు పెంచుతూ వచ్చారు. 1993-94లో ఈ పథకానికి కేటాయింపు రూ.37.80 కోట్లు వుంటే, ప్రస్తుతం అది రూ.4,000 కోట్లకు చేరుకుంది.

04/20/2016 - 22:04

నా చిన్నతనంలో మాదన్న మహామంత్రిని కొందరు విమర్శించేవారు. మరికొందరు గొప్పగా చెప్పుకునేవారు. ఈ నేపథ్యంలో మాదన్నను గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. పరిశోధన చేసాను’ అని చెప్పే భూపాలరావుగారి మాటల్లో స్థితప్రజ్ఞ గుణం స్పష్టంగా కన్పిస్తుంది. ఆ కాలంనాటి విలువల పాటింపు, క్రమశిక్షణ ఆయనలో మమేకమైపోయాయి. కీర్తి వ్యామోహం లేదు. తన పరిశోధనల వలన నలుగురిలో పేరుప్రతిష్టలు రావాలన్న ఆసక్తి అసలే లేదు.

04/20/2016 - 21:57

పంతులు పని డాక్టర్లు లేదా ఇంజనీర్ల మాదిరిగా ఒక వృత్తి కాదు. పంతులు పని తహసీలు ఆఫీసులో అధికార్ల మాదిరిగా అధికార ఉద్యోగం కాదు. ఉపాధ్యాయ వృత్తి శూన్యంలో నుంచి అనంతాన్ని చూడటం. ఇదొక బృహత్తర కార్యక్రమం. ఒక సామాజిక ప్రక్రియ సాధనం. ఒక సమాజాన్ని తరగతి నుంచి అల్లిక చేయటం. అందుకే ఫెరా అనే మహోపాధ్యాయుడు ఇలా అంటాడు. ‘‘ఉపాధ్యాయుడు ఒక సాంస్కృతిక కార్యకర్త’’ అని చెప్పాడు.

04/19/2016 - 23:57

దేశభక్తి, జాతీయత అనే వాటిని గురించి ఇవాళ చర్చించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలలో ‘‘దేశభక్తి’’పై తర్జన భర్జనలు ఉండవు. ‘‘దేశమునందు భక్తి’’అని చెప్తాం. ఇక్కడ భక్తి అంటే ఆరాధనా భావం. పూజనీయమైన భావం. ‘‘మేరా భారత్ మహాన్ హై’’ అనడం! ‘‘సారె జహాసె అచ్చా’’అని ప్రకటించడం. కానీ ఇవాళ దేశభక్తికి వికృత, విపరీత వ్యాఖ్యానాలు చేయడం మన దౌర్భా గ్యం! ఒక విధంగా పరిపాలకుల వైఫల్యం!

04/19/2016 - 23:55

నేటి యువత తెలుగు భాషకు దూరం కావడానికి వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, విద్యాలయాలే కారణం అని చెప్పవచ్చు. భారతీయ భాషల్లోకెల్లా అతి గొప్పది మన తెలుగు భాష. ఇప్పటివరకు ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా తెలుగు భాషకి ప్రాచీన హోదా లభించింది. అలాంటి భాషను నేడు తెలుగువారే నిర్లక్ష్యం చేయడం బాధాకరం. మాతృభాషను చిన్నచూపుచూస్తూ పరాయి భాషను నెత్తిన పెట్టుకోవడంతో మన పిల్లలు తెలుగు పదాలనే మరచిపోతున్నారు.

04/19/2016 - 00:41

జంబు ద్వీపం అనేది కలియుగం నాటికి తొమ్మిది వర్షాలుగా విభక్తమై ఉండేది. ఇందులో భరతవర్షం ఒకటి. ఇట్టి భరత వర్షము ఇప్పుడు పశ్చమాసియాగా పిలుస్తున్న ప్రాంతంనుండి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల వరకు, తూర్పు ఆసియాలోని అనేక దేశాల వరకు వ్యాపించి ఉండేది. రాజకీయ రాజ్యాంగ వ్యవస్థల పరంగా వేరువేరు ఖండాలుగా విభజించబడినప్పటికీ సనాతన సంస్కృతిగానే ఉండేది.

04/18/2016 - 06:33

నేటి ఆధునిక యుగంలో ఎక్కడ చూసినా అంతా కల్తీమయం. ఉదయం లేచినప్పటినుంచి మనం తాగే పాలు కల్తీ,తినే ఆహారంలో తీసుకునే పప్పులు, బియ్యం, మిరప పొడి, పసుపు, చక్కెర, తినే పళ్లు, అరటి, దానిమ్మ, మామిడి అన్నింటినీ కల్తీమయం చేస్తున్నారు వ్యాపారులు. వారికొచ్చే లాభాలనే ఆశిస్తున్నారు కానీ ఎదుటివారు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారో ఎవరు ఎంత నష్టపోతున్నారో ఆలోచించడం లేదు.

04/15/2016 - 23:57

సామాజిక శాస్త్రాలు, చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించి పాలకులకున్న చిన్నచూపు వల్ల కొత్తగా వస్తున్న తరాలకు తెలంగాణ చరిత్రే తెలియకుండా పోయే స్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక తెలంగాణ చరిత్రం సంస్కృతి, కళలకు సంబంధించి కొత్తతరం చదువుకుకునే స్థితి వచ్చింది. ఆ స్థితి రావడానికి ప్రధాన కారకుడు ప్రొఫెసర్‌ఐ ఘంటా చక్రపాణి.

Pages