S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/21/2016 - 23:38

వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నామినేషన్ వేసిన రోజే ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు ఒడిగట్టింది. తనను తన పిల్లలను, నరకయాతనకు గురిచేస్తూ క్రూరంగా హింసిస్తున్న రాజయ్యకు ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వవద్దని ప్రాధేయపడుతూ సోనియాగాంధికి సారిక ఉత్తరం రాసింది.

01/21/2016 - 04:21

తెలంగాణా ముఖ్యమంత్రిగారు ముస్లింలకు ప్రభుతోద్యోగాల్లో, ఇతర సంస్థల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించ నిర్ణయించామంటున్నారు. ఇది సహేతుకం కాదు. తెలంగాణాను ముస్లింలు 600 ఏళ్లకు పైగా, 1948 సెప్టెంబర్ వరకు పాలించారు, అన్ని భోగాలూ, విశేషాధికారాలూ, సంపదలూ అనుభవించారు. భాష, ఉద్యోగాధిపత్యాలు వారివే. అప్పటివరకు అణగత్రొక్కబడ్డ హిందువులతో పోలిస్తే ఎలా వెనుకబడ్డారు?

01/21/2016 - 04:20

విద్యారంగానికి సెకండరీ విద్యే ప్రాణం. అందుకే అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సెకండరీ విద్యను ఎంతో శక్తివంతం చేసుకున్నారు. ఈ పునాదులు గట్టిగుంటేనే ఉన్నత విద్య శక్తివంతవౌతుంది. పరిశోధనా వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మనమెంతో అభివృద్ధిని సాధించామని చెప్పుకుంటున్నప్పటికినీ తెలంగాణలో మండల కేంద్రాలలో సెకండరీ విద్యకు సంబంధించిన విద్యాలయాలు, కాలేజీలు సరిపోయేంతగా లేవు.

01/20/2016 - 05:17

రాష్ట్ర ప్రభుత్వం పాలనా సిద్ధాంతాల నుండి దూరంగా జరిగిపోతోందని పలువురు ప్రభుత్వ పాలనా సిద్ధాంతకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకోసం ప్రభుత్వం అనే ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రభుత్వం కోసం ప్రజలు అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం ఏర్పాటు జరిగింది మొదలుకొని ప్రజలకి ఇబ్బందులు ఇక్కట్లు మొదలయ్యాయని విమర్శలు బయల్దేరాయి.

01/20/2016 - 05:14

ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగంలోనూ శ్రామికుల పాత్ర కీలకం. యంత్రాలు వున్నా వాటిని నడపవలసింది వ్యక్తులే కదా. అందువల్లే చాలాకాలం క్రితమే శ్రామికులకు, వారి నైపుణ్యతకు ప్రాధాన్యం ఇవ్వబడింది. అర్ధశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ శ్రమ విభజన అవసరమని స్పష్టం చేశారు. శ్రమ విభజన ద్వారా కలిగే నైపుణ్యతను మనం ఇంతకాలం నిర్లక్ష్యం చేశామనే చెప్పాలి. కేవలం డిగ్రీలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చాం.

01/18/2016 - 07:31

బతుకు భారమై పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుండి తెలంగాణకు తరలి వస్తున్న కార్మికుల దైనందిన జీవితం దుర్భరంగా ఉంది. ఒడిషా కార్మికులపై ఇటుక బట్టీ యజమానుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయ. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇటుక బట్టీల్లో దాదాపు 11వేల మంది ఒడిషా వలస కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ వీరికి కనీస వసతులు లేవు. పలువురు పనిభారం ఎక్కువై అనారోగ్యం బారిన పడుతున్నారు.

01/18/2016 - 07:29

సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి గవర్నరు స్థాయికి ఎదిగినా నిరాడంబరతకు నిదర్శనంగా అంకిత భావానికి నమూనాగా నిల్చిన కర్మశీలి, జాతీయ ఉద్యమాన్ని ఆజీవన వ్రతంగా కొనసాగించి వెంట్రప్రగడ రామారావు తరతరాలకు ఆదర్శమూర్తి. జాతీయ ఉద్యమకారులకు స్ఫూర్తి.

01/15/2016 - 07:59

కుటుంబంలోని, సమాజంలోని సభ్యుల యొక్క, దేశంలోని ప్రజల యొక్క క్రమశిక్షణాయుత ప్రవర్తననుబట్టే, ఆయా వ్యవస్థల యొక్క ఆర్థికాభివృద్ధి, శాంతిభద్రతలూ ఆధారపడి వుంటాయి. అందరూ బాధ్యతను, సంస్కారాన్నీ ఎరిగి ప్రవర్తిస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయి. శాంతిభద్రతలు రక్షింపబడతాయి. వారు బాధ్యతలు మరచి, క్రమశిక్షణా రాహిత్యంతో ఎవరిష్టంతోవారు ప్రవర్తిస్తే కుటుంబం కాని, దేశం కాని వృద్ధిచెందవు.

01/15/2016 - 07:58

మన దేశంలో శాస్తవ్రేత్తలకు కొదవ లేదు. ఎంతో ఉన్నతమైన పరిశోధనలు వీరు చేస్తున్నారు. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే, శాస్తవ్రేత్తలు చేస్తున్న పరిశోధనా ఫలితాలు కేవలం సైన్స్ పత్రికలలో ప్రచురణలకే పరిమితం అవుతున్నాయి. అవి ప్రజలకు చేరడం లేదు. పాలకులు కూడ వివిధ రంగాలలో పరిశోధకులకు తగిన ప్రోత్సా హం ఇవ్వడం లేదు. అందువలన, ఎక్కువ మంది పరిశోధనల వైపుకు వెళ్ళడం లేదు.

01/14/2016 - 04:16

ఆవులను వ్యవసాయానికి మేలుచేసే జంతుజాతిని చంపవద్దని, వాటిని కాపాడాలని రాజ్యాంగం ప్రభుత్వాలను ఆదేశిస్తున్నది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉన్న విషయాలు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు. విశ్వవిద్యాలయాలు రాజ్యాంగానికి లోబడి చేయబడిన చట్టాలననుసరించి వ్యవస్థీకృతం చేయబడిన సంస్థలు.

Pages