S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/14/2016 - 04:10

తరగతి గదిలో అన్నింటిలో జరిగేది రెండు ఆత్మల సంయోగం. ఒక కార్యక్రమం మాత్రం ఇద్దర్ని విడచేసి సంధించే హోంవర్క్ చాలామందికి విద్యార్థిపైన భారం వేస్తున్నారని కొందరంటే మరికొందరు మరికొంత హోంవర్క్ ఇవ్వండని ప్రాధేయపడతారు. ఇది పిల్లల అల్లరిని నియంత్రించేందుకు వేసిన ఎత్తుగడ కాదు. దీనికి కూడా కొంత ఫిలాసఫి ఉన్నది. తరగతి గది సామూహిక ప్రక్రియ. అదే హోంవర్క్ వ్యక్తిగత ప్రక్రియ కావాలని ఉపాధ్యాయుడు ఆశిస్తాడు.

01/13/2016 - 07:05

‘‘మేము సహించబోము...ఏమిటి? మనం సహించబోము అని జ్ఞానులు ఎవరైనా నాకు జ్ఞానోదయం కలిగిస్తారా దయచేసి? సహనాన్నా? అసహనాన్నా? సహనం, అసహనం రెండూ కూడా మన వైవిధ్యభరితమైన భారతదేశం యొక్క విడదీయలేని రెండు పార్శ్వాలు అని నమ్మే బహుసంఖ్యాక అల్పజ్ఞానులలో నేను ఒక దాన్ని.

01/13/2016 - 07:04

నూట ముప్పై సంవత్సరాలనుండి నిరంతరంగా కొనసాగుతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాటివరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు దాదాపు పదహారు వందల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ఆయా పార్టీలు ఆవిర్భావం నాటినుండి ఈనాటివరకు ఒకే కుటుంబీకులు పార్టీ అధినేతలుగా అవుతున్నారు. అంటే ముత్తాత నుండి ముని మనుమడి వరకు కొనసాగడానికే మన ప్రజాస్వామ్యం బాటలు వేసింది.

01/12/2016 - 06:57

స్వామి వివేకానందునిది విలక్షణ వ్యక్తి త్వం. నరేంద్రుడుగా వారు ఒక జ్ఞాన పిపాసి. ప్రశ్నించే తత్వం ఆయన ప్రత్యేకత. శ్రీరామకృష్ణుని శిష్యరికంతో పరిపూర్ణ ఆధ్మాత్మికత వారికి తోడైంది. ‘‘అర్హత కలిగిన శిష్యుడేనా’’ అన్న లక్ష్యంతో ప్రపంచంలో కొత్త శిష్యులకు గురువు పరీక్షలకు పెట్టడం సాధారణం. దీనికి పూర్తి భిన్నంగా నరేంద్రుడు శ్రీరామకృష్ణుడిని ప్రశ్నించడంతోనే వారి పరిచయం ప్రారంభమైంది.

01/11/2016 - 04:38

ఇటీవల పాఠశాలలో నీతి బోధనలు ప్రవేశపెట్టి నైతిక విలువలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. వీరు సూచించిన విషయాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలలో నైతిక విలువలు పెంచే పాఠాలుంటాయని భావించాలి. మంచిదే. ఈ కమిటీలో విద్య శాఖకు సంబంధించిన ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల తనిఖీలోను, ఉన్నత పాఠశాలల తనిఖీలోను విశేష అనుభవంగల వారు లేరు.

01/09/2016 - 04:11

గడచిన కొనే్నళ్ళుగా చాలా జిల్లాల్లో మొత్తం ఐదు తరగతులకూ ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే విద్య కొనసాగించే పరిస్థితి. ఇందువల్ల ఏ తరగతికీ పూర్తి స్థాయి న్యాయం చేయలేని దుస్థితి ఏఒక్కరు సెలవుపెట్టినా ఆరోజుకి కొన్ని తరగతులు బోధన పూర్తిగా నిలిచిపోయే స్థితి. ఇలా మొత్తంమీద ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన, ప్రమాణాలు దయనీయ స్థితుల్లో ఉండేవి.

01/08/2016 - 06:13

ప్రపంచ జనాభాలో మనది రెండవ స్థానం. 2020నాటికి ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో మన స్థానం ఎక్కడ అంటే భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిందే. దీని కారణం క్రీడలకు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం, కనీస సౌకర్యాలు లేకపోవడమే. అన్ని క్రీడలకు సంబంధించిన సంఘాలు మన దేశంలో ఉన్నాయి. అయితే, అవి రాజకీయ నాయకులకు, మాజీ బ్యూరోక్రాట్స్‌కు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి.

01/08/2016 - 06:12

కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నతమైన సివిల్ సర్వీసులకు ఎంపిక పరీక్షలను రాజ్యాంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అయితే, సివిల్ సర్వీసు తరువాత క్రమంగా క్రింది స్థాయిలయిన గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాలను పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పడిన ‘స్ట్ఫా సెలక్షన్ కమిషన్’ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించటం ద్వారా భర్తీ చేస్తుంది.

01/07/2016 - 00:05

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయంగా హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లోని గ్రంథాలయం వుండేది. ఇప్పుడది తెలుగు రాష్ట్రాల విభజనానంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయం అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ పౌర సంచాలకుల కార్యాలయం తాత్కాలికంగా అఫ్జల్‌గంజ్ గ్రంథాలయంలో కార్యకలాపాలు సాగిస్తోంది.

01/06/2016 - 23:59

తరగతి గదిలో జరిగేది ప్రాసెస్ కానీ ప్రాజెక్ట్ కాదు. విద్యార్థికి హోంవర్క్ ఇవ్వగానే సరిపోదు. తల్లి వంట చేయగానే సరిపోదు. ఆ వంట తిని పిల్లలు కేరింతలు వేస్తేనే తల్లి ఉల్లాసంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ హోంవర్క్‌ను లెన్స్ పెట్టుకుని చూడాలి. కొన్నిసార్లు ఉపాధ్యాయుడికి కూడా విద్యార్థి పాఠం చెప్పవచ్చును. ఈ విద్యార్థికి వచ్చిన ఐడియా తనకెందుకు రాలేదని ఉపాధ్యాయుడు సంతోష పడుతుంటాడు. విద్యార్థిది ఫ్రెష్ మైండ్.

Pages