S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/10/2016 - 04:25

మనిషి పరిసరాలు లేకుండా బతకలేడు. మనిషి లేకుండా ప్రకృతి బతకలేదు. భూమండలాన్ని కాపాడటం ప్రతి మానవుని కర్తవ్యం. భూమండలం కాలుష్యానికి కూడా మనిషే కారకుడు. చివరకు మనిషి బతకలేని పరిస్థితి వస్తుందా అనే అనుమానం వస్తున్నది. ఓజోన్ పొర కరిగిపోవటం కార్బన్‌డై ఆక్సైడ్ పెరగటం, కార్తెలు మారటం ప్రమాదానికి సంకేతం. భూగోళమంటే రాజధానులు, దేశాల పేర్లు చెప్పటం కాదు.

03/08/2016 - 23:36

తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గిపోయి క్రమంగా ఇంగ్లీషుకు ఆదరణ పెరిగిపోతోందని జనం అనుకుంటున్న రోజులు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడ తెలుగు మాధ్యమం చదువులు మానివేసి ఆంగ్ల మాధ్యమంలో చదవటానికి ఆసక్తి చూపుతున్నందున ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదనల మధ్య ఈ భాషాదోషాల సొద ఎందుకనుకోవచ్చు.

03/08/2016 - 23:35

బారత రాజ్యాంగం సమగ్రంగానే వుంది. దానిలో స్వేచ్ఛ, పౌర హ క్కులు, సమానత్వ సూత్రాలు పటిష్టంగానే వున్నాయి. ఫ్రెంచి విప్లవాన్ని ఉత్ప్రేరితం చేసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే త్రి సూత్రాల స్ఫూర్తి మరింత వనె్నతేరి, రాజ్యాంగాన్ని విస్తృతం చేసాయి. హక్కుల పత్రమైన బ్రిటిష్ ‘మేగ్నాకార్టా’ను మించి వుంది. అమెరికాలో ‘లిబర్టీ విగ్రహం’ కంటే దృఢంగా వుంది.

03/08/2016 - 05:22

మన వ్యవసాయం లాభసాటిగా లేకపోగా రైతులను నష్టాలకు గురిచేసి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది. మన రైతులు ఎదుర్కొనే సమస్యలు అనేకం. చైనా దిగుబడితో పోలిస్తే మన వ్యవసాయ దిగుబడి బాగా తక్కువ. కమతాల పరిమాణం తగ్గుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో లేదు. ఎరువులు, విత్తనాలు వాడటంలో రైతులు ఇంకా తప్పులు చేస్తున్నారు. ఒక్క మద్దతు ధరే రైతులను కాపాడలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరగడంవల్ల మద్దతు ధర పెరగవచ్చు.

03/07/2016 - 04:41

అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రభుత్వం తేనున్న కార్మిక చట్టాలకు సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి 10వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ఖరారు చేసాయి. అదే నెలాఖరున ఒక సామూహిక తీర్మానం కోసం పెద్దఎత్తున కార్మిక సమీకరణను తలపెట్టాయి. కార్మిక సంఘాలు జనవరిలో 15 డిమాండ్లతో వినతిని కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించాయి. వాటి సాధనకు ఈ రెండు కార్యక్రమాలను 11 జాతీయ సంఘాలు చేయనున్నాయి.

03/04/2016 - 23:25

ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు కనుమరుగైపోతోంది. ఏ తెలుగు అన్నది అప్రస్తుతం. తెలంగాణ తెలుగైనా, ఆంధ్రా తెలుగైనా తెలుగే. తెలుగు ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు ఈ విభేదాలను కొండంత చేస్తే నష్టపోయేది తెలుగేకదా! ఇరు రాష్ట్రాలు కలిసి తెలుగు వెలుగుకోసం ప్రయత్నించాలి. ‘‘గతంగతః’’అన్నారు. భాషాశాస్త్రం తెలియక ‘‘యాస’’అనీ, ‘‘అప్రామాణికం’’అనీ అన్నది నిజమే. ఇప్పుడటువంటి భావాలకి స్వస్తిచెప్పాలి.

03/04/2016 - 06:25

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అగ్నిమాపక కేంద్రాలు (ఫైర్ స్టేషన్లు) అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రాల పరిధి ఎక్కువ ఉంటుంది. సదుపాయాలు తక్కువ. వేసవి మొదలైంది. మేల్కొనాలి పాలకులు. అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాల్లో అగ్నిమాపక శకటాలు (ఫైర్ ఇంజన్లు) సరైన సమయానికి రాకపోతే భారీ నష్టం వాటిల్లుతుంది.

03/04/2016 - 06:23

హైదరాబాద్‌లోని హెచ్.సి.యు.లో, న్యూఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన సంఘటనలను సాకుగా తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు మావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. నిన్న మొన్నటి వరకు గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగిన అసహనం ఇప్పుడు విశ్వవిద్యాలయంలో తిష్ఠవేసింది.

03/03/2016 - 05:50

ప్రపంచ వ్యాప్తంగా భూవిస్తీర్ణం ఏనాటికి పెరగబోదు. అంతేకాదు దేశంలో నా నాటికీ తగ్గిపోతున్న సహజ, ఖనిజ వనరుల్ని, ఇంధనానికి నెలవైన ఖనిజాన్ని, గనుల్ని త్రవ్వుకుపోతుంటే అవి తరిగిపోయి భవిష్యత్ తరాలకు మిగలకుండాపోయే ప్ర మాదం పొంచి ఉంది. అందుకే 2015 సంవత్సరంలో ప్రజాప్రయోజనాల్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గనులు, ఖనిజాల చట్టసవరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

03/03/2016 - 05:43

కొన్ని సందర్భాలలో టీచింగ్ మాత్రమే ఉంటుంది. లెర్నింగ్ ఉండదు. కొన్ని సందర్భాలలో టీచింగ్, లెర్నింగ్ రెండు కూడా ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో లెర్నింగ్ మాత్రమే ఉంటుంది. పిల్లలు ఒక పువ్వును పరిశీలిస్తూ దానిలో రెక్కలు, వివిధ భాగాలను ఎవరి సహాయం లేకుండానే నేర్చుకుంటాడు. కొంతమంది సమాజంలో వున్న వివిధ ప్రక్రియలను పరిశీలించి నేర్చుకుంటారు. దీనే్న శాస్ర్తియ పరిణామమంటారు. పిల్లలు కొన్ని ప్రయోగాలు చేస్తారు.

Pages