S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/02/2016 - 04:50

మన దేశం సత్వరం అభివృద్ధి చెందాలనే కాంక్షతో విదేశీ కంపెనీలను విదేశీ వ్యాపార సంస్థలను విచ్చలవిడిగా ఆహ్వానించటం చాలా ప్రమాదకరం. ప్రభుత్వం ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలామంది రాజకీయ నాయకులు తమ తమ విదేశీ పర్యటనల్లో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. వీరికి నీరు, భూమి, వసతి, సౌకర్యాలు అన్నీ ఇస్తాము అంటారు.

03/02/2016 - 04:48

గురువుకు మన సమాజంలో ఆచార్య దేవోభవ అని ఉన్నత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నాము. దేశ ప్రగతికి మూలస్తంభాలు వారు. తమవద్ద చదువుకొనే విద్యార్థులకు మంచి విద్యాబోధన చేసి వారిలో జ్ఞానజ్యోతులు వెలిగించి, మానవతా విలువలు నేర్పి దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపించటానికి తమ వృత్తిని తపస్సుగా చేస్తారు.ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఈ వృత్తిలోకి వచ్చిన వారికి నిరాశ, నిస్పృహలే మిగులుతున్నాయి.

03/01/2016 - 06:23

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులు వెట్టిచాకిరీకి గురవుతున్నారు. కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. చాలీచాలని వేతనాలు ఇచ్చి కాంట్రాక్టర్లు అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారు. ట్రాన్స్‌కోలో ‘ప్రైవేట్’గా నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2వేల మంది కాంట్రాక్టర్లు శ్రమదోపిడీ యదేచ్ఛగా చేస్తున్నారు.

02/29/2016 - 06:53

‘‘వివేకానందుడు కులవ్యవస్థ సమర్థకుడు,స్ర్తి ద్వేషి, తప్పుడు మేధావి, తనను తాను అధికంగా భావించేవాడు, వివేక హీనుడు, శాస్తబ్రద్ధంకాని ప్రసంగాలు చేసేవాడు, నిజమైన తెలివితేటలు కలవాడు కాదు, ఇలాంటి వ్యక్తి జయంతిని మన కేంద్ర విశ్వవిద్యాలయంలో, ఆనవాయితీగా జరపడం పట్ల నేను ఆశ్చర్యపోతున్నాను, నిరుత్సాహ పడుతున్నాను..’’ అంటూ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి, 2016,జనవరి 8న తన ఫేస్‌బుక్‌లో ఉంచిన వ్యాఖ

02/28/2016 - 07:25

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జిన్నా యూనివర్సిటీగా మారింది. అక్కడ అల్లా హో అక్బర్ నినాదాలిచ్చే విద్యార్థులు కనబడుతన్నారు. రాహుల్ గాంధీ కూడా వారితో కలిసిపోయారు. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలిస్తున్న వారిలో రాహుల్ గాంధీ కలవడం విమర్శలకు తావిచ్చింది. అఫ్జల్ గురుపై ఎనిమిదేళ్ల విచారణ తరువాత ఉరిశిక్ష వేసింది తమ ప్రభుత్వమేనన్న యింగితం కూడా ఆయనకు లేకుండా పోయింది.

02/26/2016 - 23:40

‘విద్య’ వినయాన్ని పెంచి, ఆలోచనాశక్తినీ, వివేకాన్నీ, విచక్షణా జ్ఞానాన్నీ రేకెత్తిస్తుందనీ, ‘విశ్వవిద్యాలయాలు’ విజ్ఞాన కేంద్రాలనీ ఒకప్పటి భావన. చాలా కాలం క్రిందటే ఆ భ్రమలు తొలగిపోయినప్పటికీ- ఏదో ఆశ. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలు. కుల విద్వేషాలకీ, మత రాజకీయాలకీ ప్రధాన కేంద్రాలు.

02/26/2016 - 06:15

మేం అధికారంలోకి రాగానే నిజాం సుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చక్కెర కర్మాగారంపై ఆధారపడిన రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తామన్న టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికుల పొట్టకొట్టింది. కార్మికులు, ఉద్యోగులు నిజాం దక్కన్ సుగర్స్ లేఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమస్య సవాల్‌గా మారింది.

02/26/2016 - 06:14

అయ్యదేవర కాళేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్పీక ర్. తొలితరం నేతలు కాశీనాథుని నాగే శ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టం గుటూరి ప్రకాశం పంతులు కాగా మలి తరం నేతల్లో డాక్టర్ పట్టాని సీతారామ య్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబ మూర్తి మొదలైన వారు ముఖ్యులు. కాళేశ్వరరావు 1881, జనవరి 22న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు.

02/25/2016 - 00:20

విదేశీ పెట్టుబడులుకోసం నేడు భారత్ ఎదురుచూస్తోంది. నేటి ప్రభుత్వం వివిధ దేశాల బహుళ కంపెనీలు భారత్‌కు రావాలని ఆశిస్తోంది. కేంద్రం దారిలోనే తెలుగు రాష్ట్రాలు విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 150 సంవత్సరాల క్రితం చరిత్ర పునరావృతానికి దారితీస్తోందనిపిస్తోంది. దేశం అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ సమస్య తొలగాలి. అందరికీ విద్య అందాలి. రైతులో ఉత్సాహం పెంపొందించాలి.

02/25/2016 - 00:18

విద్య సామాజిక ప్రక్రియ. సమాజంలో ప్రతి ఘడియన మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయ. ముఖ్యంగా సాంకేతిక యుగంలో నూతన ఆవిష్కరణలు ఎంతో వేగంగా వస్తున్నాయి. అవి ప్రజలకు అందుబాటులోకి వుండడానికి సాంకేతిక రంగం కూడా దానికన్నా ఎక్కువ వేగంగా వ్యాపించాలి. అప్పుడే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. విద్యారంగం ఒక ఎడతెగని ప్రవాహం. ప్రతి దేశంలో కూడా సంస్కరణలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ.

Pages