S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/24/2016 - 06:50

ఈ నెల 9న జెఎన్‌యులో అఫ్జల్ గురు వర్ధంతి కార్యక్రమాన్ని ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఏఎస్‌ఏ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలతో వీరు హోరెత్తించారు.

02/24/2016 - 06:49

ప్రపంచంలో ఏ దేశంలోను లేని విధంగా అనేక పురస్కారాలు లభిస్తున్నాయి మన భారతదేశంలో. భారతరత్న మొదలుకొని అర్జున్, ద్రోణాచార్య, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా పురస్కారాలు ప్రదానం చేస్తుంది మన ప్రభుత్వం. మన దేశాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే జవాన్లకు యిచ్చే ‘అశోకచక్ర’, ‘శౌర్యచక్ర’, ‘పరమవీర చక్ర’లాంటి పురస్కారాలలో మాత్రం నిజాయితీ, గుర్తింపు, గౌరవం వుందని భావించవచ్చు.

02/23/2016 - 05:32

చాలా ఆలస్యంగానైనా మానవ హక్కులకోసం ఆక్రమిత కాశ్మీర్ వాసులు స్పందించడం ప్రపంచ మానవ హక్కులను ప్రశ్నిస్తున్నది. ప్రపంచ మానవాళిక ఈ విచక్షణ ఒక కొరడా దెబ్బలాంటిది. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ప్రజాపాలనపై మానవతావాదులు ఏనాడు సై అన్నది లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పాక్ ప్రభుత్వ ఉక్కు కౌగిలినుండి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఏనాటినుండో అక్కడి ప్రజలు కోరుకొంటున్నారు.

02/22/2016 - 02:24

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు కొదవ లేదు. ప్రతి పార్టీకి ఆశయం ఒకటి వున్నది. కాని ప్రజలకు చేరువగా వుండి ప్రజల నిత్యజీవన సమస్యలు పరిష్కరించగలిగిన నాయకులు కరువయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల జీవనం సుఖమయం చేయటం రాజకీయ పార్టీల కర్తవ్యం. ఆ విషయాన్ని ప్రక్కనపెట్టి తమ స్వార్థమే పరమార్థంగా భావించే నాయకులే ఆయా పార్టీలలో మెండుగా వున్నారు.

02/21/2016 - 07:43

అది తెలంగాణ ఉద్యమకాలం. ఏప్రిల్ 2001లో పురుడు పోసుకున్న తెరాసకు స్వతంత్రించి అసెంబ్లీకి పోటీచేసే పరిస్థితి లేదు. నాటి తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ఆర్ తెలంగాణ కావాలంటూ సంతకాల సేకరణ చేయించిన సూత్రధారుడు కాకున్నా, పాత్రధారుడు కావడంతో, 2004 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌తో జతకట్టి తెరాస సాధించుకున్న అసెంబ్లీ స్థానాలు 28 కాగా, ఎంపి స్థానాలు 4.

02/19/2016 - 23:41

రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

02/19/2016 - 04:47

మన దేశంలో మంచి చెడు అన్న అంశాలపై విచక్షణతో పరిశీలించకుండా మీడియా, దేశ వ్యతిరేక శక్తులు అడ్డు పడుతున్నాయ. వాస్తవాలను అవాస్తవాలుగా ప్రచారం చేయటం నిరంతరం దేశంలో అలజడి సృష్టించటం వల్ల పలు వివాదాలు చోటు చేసుకుంటు న్నాయ. జరగాల్సిన చెడు పూర్తిగా జరిగిన తర్వాత అసలు సంగతులు బయటకు వస్తాయ. దీనిపై ఎవరికి వారు వౌనం వహించడం పరిపాటైపోయంది.

02/19/2016 - 04:44

విద్యార్థుల జీవితాలను అభివృద్ధి పథంలో నడిపించి, వారి జీవితాలను నిలబెట్టవలసిన విద్యాసంస్థల్లో రోజురోజుకు ర్యాగింగ్ పేట్రేగిపోతున్నది. అలా విద్యార్థుల జీవితాలను బలికోరుతున్నది. అప్పుడు రిషితేశ్వరి కావచ్చు, సాయినాథ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దీనికి ప్రాంతం ప్రదేశం, రాష్ట్రం, అనే తేడాలు ఏమీ లేవు. ఈ 21వ శతాబ్దపు విద్యార్థుల ముందు అనేక పెను సవాళ్లు కళ్ల ఎదుటే కదలాడుతున్నాయి.

02/18/2016 - 06:56

ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది. ‘కార్మికులు, కర్షకులు, కూలీలు, కడుపు కాలుతున్నవాళ్లూ మాత్రమే సేవ చేయదగ్గవాళ్లు’ అని ఒక పార్టీ అంటే ఫలాని ప్రాంతీయులంతా తమవారని ఇంకో పార్టీ చెబుతుంది. ఫలాని కులంవారు మాత్రమే తమకు ఆప్తులు అని ఒక పార్టీ అంటే, ఫలాని మతం వారు మాత్రమే తమకు ఆప్తులని ఇంకో పార్టీ అంటుంది.

02/18/2016 - 06:55

విద్యాప్రమాణాలు పెంచటానికై పాఠశాలల్లో వౌలిక వసతులు పెంచిన దానికన్నా టీచింగ్‌ను పటిష్టం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న భావనకు రాష్ట్ర ప్రభుత్వం రావడాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ఫిన్లాండ్, పోలెండ్, పోలెండ్ ప్రయోగాలు చూసిన తర్వాత అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నది. ప్రమాణాలు పెంచడానికై మొదటి అడుగు సమర్ధులైన ఉపాధ్యాయులను నియమించడం జరగాలి.

Pages