S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/17/2016 - 07:50

విలువలు లేని విద్యా విషయాలవల్ల సమా జం మొత్తం తప్పుదారి పడుతోంది. ము ఖ్యంగా దైవప్రీతి, సంఘనీతి, పాపభీతి అనేవి మూడూ విద్యావ్యవస్థ ద్వారా సమాజం నేర్చుకోవాలి. వాస్తవంగా ప్రజలు సుఖశాంతులు కోరుకుంటున్న సందర్భంలో అవి ఎలా పొందాలి అన్న అంశాన్ని సులభంగా విద్యద్వారా అందించాలని మన సనాతన విద్యావిధానం చెబుతోంది. ప్లాటోరూసో వంటి పాశ్చాత్యుల సిద్ధాంతాలతో దేశవాళి విద్యావేత్తల విషయాలు మరుగున పరిచారు.

02/17/2016 - 07:49

మార్చి 21 నుంచి జరుగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలను నిఘా నేత్రం నీడలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. యావత్తు ఉపాధ్యాయలోకం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిఘానేత్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులను సీసీ కెమేరాల గురించి మానసికంగా సిద్ధం చేయకముందే నిర్ణయాన్ని ప్రకటించడం విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది.

02/15/2016 - 23:28

ఇటీవల వంటనూనెల్లో కల్తీ అనే మాట ప్రతినోట వినిపిస్తోంది. వాటిని ఆరగిస్తే ఆరోగ్యం ఆ వంటనూనె మంటలో కలిసిపోవడం ఖాయం. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో అధిక ధర ఉండే వంటనూనెతో చౌకరకాల నూనె కలపడం లేదా పశువుల కొమ్ములు, ఎముకలు కరిగించి తీసిన నూనెను సాధారణ నూనెలో కలపడం జరుగుతున్నది. కాబట్టి వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న నూనె ఎంత స్వచ్ఛమైనదో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి.

02/15/2016 - 01:22

జాతులు, మతాలు, వర్గాలు వంటి విభేదాలతో ముక్కలు చెక్కలుగా ఉన్న ప్రపంచం ‘విశ్వకుటుంబ భావన’వైపుకు మరలడం సాధ్యం కాదని వర్తమాన పరిస్థితులపై అవగాహన ఉన్నవారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.

02/12/2016 - 22:48

ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా పాటిస్తారు. ఇతర మతాచారాలను అవహేళన చేయకూడదు. ఈ విషయం అందరికి తెలుసు. భారతీయులు ఆసేతు హిమాచలం వివిధ దేవతలను పూజిస్తారు. చెట్లని పూజిస్తారు. జంతువులను పూజిస్తారు. ఎవరు ఏ రూపాన్ని భక్తితో పూజించినా ఆ పూజలన్నీ తనకే చేరుతాయని గీతలో శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణించాడు. మన సంప్రదాయాలని మనం గౌరవించుకోవాలి.

02/12/2016 - 05:28

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రేషన్ బియ్యం వివిధ మార్గాల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుండి లెవీ కింద కిలో బియ్యానికి రూ.23 చెల్లిస్తోంది. లబ్దిదారులకు 22 రూపాయల సబ్సిడీ ఇచ్చి కిలో రూపాయికి అందజేస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు ‘బ్లాక్’ మార్కెట్‌కు తెర తీశారు.

02/12/2016 - 05:26

దేశానికి బాహ్య ఉపద్రవం కంటె అంతర్గత కల్లోలం పెను ప్రమాదంగా తయారైంది. దీన్ని ‘అసహనం’, సెంట్రల్ యూనివర్సిటీ కృత్రిమ ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. దుర్ఘటనకు కారకులైన వారే ఎదురు దాడికి దిగడం పరిపాటిగా మారింది. కమ్యూనిస్టీకరణ, క్రైస్తవీకరణకు బలైన వారికి అండదండలు లేకుండా పోయాయి. కాంగ్రెస్ వ్యూహరచనకు కమ్యూనిస్టు, టెర్రరిస్టు గ్రూపులు వేదికలు తయారు చేస్తూ యువతను, దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

02/11/2016 - 06:04

కేరళ రాష్ట్రంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం 10 సంవత్సరాలలోపు బాలికలు, 50 సంవత్సరాల పైబడిన స్ర్తిలకు మినహాయించి మిగతా స్ర్తిలకు ఆలయ ప్రవేశం లేకపోవడంపై హిందూమతంలో స్ర్తిలపై వివక్ష చూపుతున్నారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. సనాతన ధర్మంలో ‘సృష్టికర్త’ నిరాకారుడన్న విషయం వాస్తవం. అయినప్పటికీ ముప్పది మూడుకోట్ల దేవతలను ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక నిష్ఠ.

02/11/2016 - 06:02

ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువుకున్నవారైతే ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా వుంటుంది. చదువుకున్న తల్లిదండ్రుల వల్ల పిల్లలకు వచ్చే చదువులో అర్థంకాని అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వుంటుంది. పిల్లలకు ప్రాథమిక దశలోనే ఏ సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారో దాన్ని గమనించి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించే అవకాశం వుంటుంది.

02/10/2016 - 04:43

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కొంతవరకైనా పోగొట్టాలంటే విశాఖపట్నం కేంద్రంగానే కొత్తగా రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జోన్‌ను ఏర్పాటుచేయడమే అన్నివిధాల సముచితం. విశాఖలోనే జోన్‌ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు గతంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు హామీనిచ్చారు. ఎన్నికల ముందు, అలాగే ఎన్.డి.ఎ.

Pages