S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/24/2015 - 04:11

మీకు న్యాయం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ టీచర్లకు గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీపై గత ఆరునెలలుగా ఢిఎస్‌సి క్వాలిఫైడ్ టీచర్లు కొండంత ఆశతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్టల్రోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సుమా రు వెయ్యిమంది క్వాలిఫైడ్ టీచర్లు తెలంగాణ సచివాలయం, విద్యాశాఖ మంత్రి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

12/24/2015 - 04:11

నేను తరగతి గది నుంచి రాగానే టీచర్స్ రూమ్‌కు వెళ్లేవాణ్ణి. నాగలి విడిచిన ఎద్దు మాదిరిగా కాకుండా బడి విడిచిన పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చినట్లు వెళ్లేవాణ్ణి. ఆనాడు టీచర్స్ రూమ్ అంటే అదొక విద్యామండలి. ఎవరికివారుగా వాళ్ల సొంత విషయంకన్నా ప్రతివాడు తరగతి గదిలో ఏం జరిగిందో చర్చకు పెట్టేవారు. ప్రతి ఉపాధ్యాయుడు అన్ని క్లాసులకు పోడు. ఈ చర్చవలన ప్రతి ఉపాధ్యాయుడికి ఏ తరగతిలో ఏం జరుగుతున్నదో తెలిసేది.

12/23/2015 - 03:14

తెలుగు భాష అజంత భాష. అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష అని అర్థం. రామయ్య, సీతమ్మ, సుబ్బమ్మ ఇవన్నీ అజంత పదాలు. భాష కూడా ముత్యాల్లా గుండ్రంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది. తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని నన్నయ యుగంతో మొదలుపెడ్తే అప్పటి నుంచి ఇప్పటివరకు భాష అనేక మార్పులు చెంది కాలానుగుణంగా ఆధునిక భాషగా పరివర్తన చెందింది. నన్నయకు ముందున్న కాలాన్ని ప్రాఙ్నన్నయ యుగమంటారు.

12/23/2015 - 03:13

ఈ మధ్య అనేక వ్యాసాలలో ఉత్తరాలలో హిందూ మతం నశించిపోవటానికి ఆ మతంలోని లౌకిక వాదులతో సహా ఇతర మతాల ప్రచారం, ప్రలోభాలూ కారణమనీ అనేక మంది తమ ఆవేదనని వ్యక్తం చేశారు. అవన్నీ చదివినప్పుడూ చదువుతున్నపుడూ నన్ను వేసుకున్న ప్రశ్న, ‘దీనికి నిజంగా కారణమెవర’ని. ‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటూ ధర్మప్రచారకులూ, పండితులూ నిరంతరం ప్రజలకి బోధించడానికి శ్రమపడుతున్నారు.

12/22/2015 - 04:38

యజ్ఞం లేదా యాగం అనేది వేదకాలంలో విస్తృతంగా ఆచరించిన క్రతువు. మనదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేద మంత్రాల సహితంగా జరుగుతున్నది. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం.

12/21/2015 - 04:50

సువ్యవస్థితమైన సమాజాన్ని నిర్మాణం చేయుటకు రమ్యమైన, రసమయమైన, మధురమైన భావావేశముతో మానవ సమాజాన్ని సర్వాంగీణ వికాసం చేసే ప్రయత్నంలో తమస్సునుండి ఉషస్సు వైపు మానవ మస్తిష్కాలకు పదునుపెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వాటిని తరతరాలుగా కొనసాగించేందుకు ఉపయుక్తంగా ఉండే విధంగా రచనలు చేసేవారే రచయితలు, కవులు, పండితులు.

12/19/2015 - 00:02

ప్రస్తుతం మన దేశ రాజకీయాలు అన్నీ ఆవు చుట్టూరా తిరుగుతున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని ఒక ముస్లిం కుటుంబంవారు ఇంట్లో ఆవు మాంసం ఉంది అనే ఆరోపణతో కొందరు దుండగులు దాడి చేశారు. ఈ సంఘటనకు అసలు కారణం మాత్రం ఇంతవరకు తెలియలేదు.దేశంలో ఎన్నో ప్రధాన ముఖ్యమైన సమస్యలు ఉండే ఇలాంటి అతి సామాన్య విషయాలకు ప్రాధాన్యత కల్పిస్తూ చిలవలు పలవులుగా చేసి దేశ సమగ్రతను, శాంతి సామరస్యాలను భంగపరిచే రీతిలో ప్రచారం జరుగుతున్నది.

12/17/2015 - 23:51

'తాతలు నేతులు తాగారు- మా మూతులు వాసన చూడమంటే, పాచి కంపుకొడతాయి’. ప్రస్తుతం మన దేశంలోని కొందరు మేధావుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇందుకు కారణం పాలకపక్షాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రాచీన కాలంనుంచి భారతీయులు అద్భుతమైన మేధస్సును కలిగిఉన్నారు. విద్య, వైద్య, వైజ్ఞానిక, గణిత, జీవ, భౌతిక, రసాయన మొదలైన శాస్త్రాలలో భారతీయుల విజ్ఞానం అపారం.

12/17/2015 - 23:50

దేశానికి ప్రధానిగా పనిచేసిన తొలి దక్షిణ భారతీయుడు పివి నరసింహారావు. మేధావి, బహుభాషా కోవిదుడు. దేశాన్ని దుర్భర స్థితి నుంచి బయటపడేసిన రాజనీతిజ్ఞుడు. అందునా మన తెలుగువాడు. అటువంటి విశిష్ట వ్యక్తికి భారతరత్న ఇవ్వడం ఆ పురస్కారానికే వనె్నతెస్తుంది. ఏవో ఒకటీ అరా లోపాలను పట్టుకొని వాటినే పట్టుకొని వేళ్లాడటం ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా పరిశీలించటం ఎలా అవుతుంది?

12/17/2015 - 05:01

ఈ మధ్యలో ప్రైవేటు ఉపాధి రంగంలో కూడా వాటాలు, కోటాలు, ‘ముంగాపులు’ (ఇది ‘రిజర్వేషన్స్’కు తెలుగు పదం) ఉండాలి, వాటికోసం చట్టం కూడా చేయాలి అంటూ కొందఱు వాదిస్తున్నారు; అందుకోసం ఏకంగా ఒక మహా ఉద్యమమే సాగాలంటున్నారు మఱి కొందఱు. అసలు ప్రాథమికంగా గాని, వౌలికంగా గాని ఉద్యోగార్థికి ఉండాల్సిన అర్హత ఏమిటి? ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆ అర్హత అనేది విద్య- లేక-విజ్ఞానము మాత్రమే.

Pages