S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/30/2019 - 02:03

రోడ్డు భద్రత విషయంలో వాహనాల చోదకుల తప్పిదాలే పెను ప్రమాదాలకు ఆలవాలమవుతుంది. రహదారులు రక్తసిక్తమై ప్రమాదంలో అసువులు బాసే వారు కొందరైతే, కాళ్లుచేతులు విరిగి శరీరంలోని అంగాలు కోల్పోయి జీవితాంతం దుర్భర దుస్థితికి చేరుకోవడం మరికొందరి వంతు అవుతుంది.

08/28/2019 - 02:00

భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటయ్యాక భారతీయులు జాతీయ భావనను కోల్పోయారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యతను జాతీయతకు ఇవ్వలేకపోతున్నారు. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ‘జాతీయ భాష’గా ప్రజలు భ్రమపడేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. హిందీ మన జాతీయ భాషగా గుర్తింపునకు నోచుకోలేదు.

08/25/2019 - 02:38

‘అమరావతి’.. అదో సంచలనం.. విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అందరికీ సుపరిచితమైంది. ఏ అండాదండా లేని రాజ్యానికి దిక్సూచిగా మారింది. గత అయిదేళ్ల కాలంలో- నిర్మాణాలేవీ లేకున్నా.. నవ్యాంధ్ర రాజధానిగా వార్తల్లో నిలిచింది. శాసనసభ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో ‘అమరావతి’ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకో తెలియని వెలితి చోటుచేసుకుంది.

08/23/2019 - 21:49

ప్రపంచం ఎటువైపు పరుగులు పెడుతున్నదో పరిశీలించాల్సిన అవసరముంది. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆసక్తిగలవారు ఈ విషయమై కించిత్ ఎక్కువ పరిశీలన చేయాల్సి ఉంటుంది. సమాజాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని, మార్పులు తీసుకొస్తామని, విప్లవం తెస్తామని కలవరించేవారు ఈ కీలక అంశాన్ని విస్మరించి తమ తమ ఊహాలోకాల్లో విహరిస్తూ, తమదైన ప్రత్యేక లోకానికే పరమితమై అదే ప్రపంచం.. అదే సర్వస్వం..

08/22/2019 - 01:46

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మన దేశంలో అసంక్రమిత వ్యాధుల మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గుండె జబ్బులు, క్యా న్సర్, మధుమేహం, రక్తపోటు లాంటి అసంక్రమిత వ్యాధుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతూ అకాల మరణాలకు గురయ్యేవారి సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక ప్రకారం దేశం మొత్తం మరణాలలోని అసంక్రమిత వ్యాధుల మరణాలు 1990లో 37.9 శాతంతో పోలిస్తే 2016లో 61.8 శాతానికి చేరింది.

08/21/2019 - 01:46

ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలు దానే్న కోరుకుంటున్నారు. అయితే, చైనా కమ్యూనిస్టులు మాత్రం నియంతృత్వ పోకడలను వదులుకోవడం లేదు. తన మార్క్ కమ్యూనిజాన్ని కాపాడుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన ‘మాట’ను తప్పుతోంది. హాంకాంగ్‌పై మరింత ‘ఉచ్చు’ బిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం.

08/20/2019 - 03:45

ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4 శాతమే. కాని ప్రపంచంలోని ప్రకృతి వనరులను 40 శాతం ఒక్క అమెరికాయే కొల్లగొడుతోంది. అంతగా భోగలాలసతకు ఆ దేశ ప్రజలు అలవాటుపడిపోయారన్నమాట. మార్కెట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోడానికి భారీ ఎత్తున వినియోగ వస్తువులను ఉత్పత్తిచేసేందుకు- అడ్డూఅదుపూ లేకుండా ప్రకృతి వనరులను అమెరికా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే.

08/18/2019 - 01:42

భరతవర్షంలోని ‘భరతఖండం’ సంస్కృతిపరంగా, రాజ్యాంగపరంగా ఒకటిగా వికసించిన దేశం. ఈ భరత ఖండం దాదాపు నాలుగువేల సంవత్సరాల నుండి విభజనకు గురవుతోంది. అఖండ భారత్ విభజన 1947 ఆగస్టు 15వ తేదీ వరకూ కొనసాగింది. రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థల నుండి భిన్నఖండాలుగా విభజించబడినప్పటికీ భారతీయ సంస్కృతి మాత్రం ఒక్కటే. అది సనాతన సంస్కృతి- వేద సంస్కృతి.

08/16/2019 - 22:00

దేశంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. సాయుధ విప్లవాల కన్నా సాంకేతిక విప్లవాలు మానవాళిని ముందుకు తీసుకెళతాయని మరోసారి రుజువుకానున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ ప్రముఖ పారిశ్రామిక- వ్యాపార సంస్థ రిలయన్స్‌తో కలసి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్లౌడ్ డేటా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది.

08/14/2019 - 05:11

‘చదవేస్తే ఉన్నమతి పోయిందన్నమాట’ వాడుకలో ఉంది. కొందరు సామాజిక, రాజకీయవాదులు దీ న్ని మరోసారి నిజం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ తెలంగాణ (మార్క్సిస్టు- అంబేద్కరిస్టు) (సిపీటిఎం-ఎ) పేర ఓ కొత్త రాజకీయ పార్టీని వారు ప్రకటించారు. ఈ ప్రకటన పై మాటకు సరిగ్గా సరిపోతుంది. భారత్‌లో 90 ఏళ్ళ కమ్యూనిస్టు పార్టీ, దాని భావజాలం విఫలమైందని కళ్లముందు కనిపిస్తోంది.

Pages