S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/18/2019 - 01:42

భరతవర్షంలోని ‘భరతఖండం’ సంస్కృతిపరంగా, రాజ్యాంగపరంగా ఒకటిగా వికసించిన దేశం. ఈ భరత ఖండం దాదాపు నాలుగువేల సంవత్సరాల నుండి విభజనకు గురవుతోంది. అఖండ భారత్ విభజన 1947 ఆగస్టు 15వ తేదీ వరకూ కొనసాగింది. రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థల నుండి భిన్నఖండాలుగా విభజించబడినప్పటికీ భారతీయ సంస్కృతి మాత్రం ఒక్కటే. అది సనాతన సంస్కృతి- వేద సంస్కృతి.

08/16/2019 - 22:00

దేశంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. సాయుధ విప్లవాల కన్నా సాంకేతిక విప్లవాలు మానవాళిని ముందుకు తీసుకెళతాయని మరోసారి రుజువుకానున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ ప్రముఖ పారిశ్రామిక- వ్యాపార సంస్థ రిలయన్స్‌తో కలసి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్లౌడ్ డేటా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది.

08/14/2019 - 05:11

‘చదవేస్తే ఉన్నమతి పోయిందన్నమాట’ వాడుకలో ఉంది. కొందరు సామాజిక, రాజకీయవాదులు దీ న్ని మరోసారి నిజం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ తెలంగాణ (మార్క్సిస్టు- అంబేద్కరిస్టు) (సిపీటిఎం-ఎ) పేర ఓ కొత్త రాజకీయ పార్టీని వారు ప్రకటించారు. ఈ ప్రకటన పై మాటకు సరిగ్గా సరిపోతుంది. భారత్‌లో 90 ఏళ్ళ కమ్యూనిస్టు పార్టీ, దాని భావజాలం విఫలమైందని కళ్లముందు కనిపిస్తోంది.

08/13/2019 - 04:01

ఎదుటివారి వైపు ఒక వేలు చూపెడితే, నాలుగు వేళ్ళు మనవైపు చూపెడుతుంటాయన్నది అందరికీ తెలిసిన సత్యం. రాజకీయ నాయకులు తమ తమ పార్టీల సమావేశాలలో, ఆత్మీయ సమ్మేళనాలలో ఈ సామెతను గుర్తుచేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంస్థాగతంగా ప్రక్షాళన చర్యలు చేపడతారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అవేవీ జరుగుతున్న దాఖలాలు లేవు.

08/10/2019 - 22:54

‘ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే ప్రజ’..అంటూ ‘ఏక్తా భారత్’ నినాదంతో అలనాడు జనసంఘ్ పార్టీ పుట్టింది. కాలక్రమంలో జనసంఘ్ భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందింది. భారతీయ జనతాపార్టీకి ‘సిద్ధాంత రూపకర్త’గా వ్యవహరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఉద్దేశం కూడా అదే.

08/09/2019 - 22:47

ఆర్యభట్టు క్రీ.శ.476లో పాటలీ పుత్రానికి సమీపంలోని కుసుమపురంలో జన్మించాడు. ఈయనే మొదటి ఆర్యభట్టు అని చరిత్రకారులు చెబుతారు. ఈయననే భారతీయ ఖగోళ శాస్త్రానికి ఆద్యునిగా, గణిత శాస్తజ్ఞ్రునిగా పేర్కొంటారు. ‘ఆర్యభటీయం’, ‘ఆర్యభట సిద్ధాంతం’ ఈయన ప్రధాన రచనలు. భారతదేశంలోనే గాక, ఇతర దేశాలలో కూడా ఎందరో ఖగోళ శాస్తజ్ఞ్రుల అధ్యయనాలపై ఆర్యభట్టు ప్రభావం ఎంతగానో ఉంది.

08/08/2019 - 22:41

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సాగునీటి వనరులను మెరుగు పరచాలి. అయతే, ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యం ఆ ప్రాంతం పట్ల పాలకుల వివక్ష కు నిదర్శనంగా మారింది. పరిపాలనా పరమైన అనుమతి లభించిన తర్వాత కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు దేశంలోనే ఇది మొట్ట మొదటిది. ఒకే ప్రాజెక్టుకు రెండుసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు శిలాఫలకాలు వేసిన ప్రాజెక్టు కూడా ఇదే.

08/07/2019 - 23:08

పాకిస్తాన్‌కు చెందిన మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతుల వారని ప్రచారం చేసి భారత్‌ను విభజించేలా చేశాడు. మతం వేరు అయినంత మాత్రాన జాతీయత మారదు. భారతీయ ముస్లింలలో అత్యధికులు ఈ గడ్డమీదే పుట్టినవారు. అరబ్బులు, తురుష్కులు, ఆఫ్గన్‌లు భారత్‌పై దాడులు చేసి ఎంతోమంది హిందువుల చేత బలవంతంగా మతం మార్పించారు.

08/07/2019 - 02:15

మావోయిస్టుల ‘అమరవీరుల సంస్మరణ వారోత్సవం’ చివరి రోజున (ఆగస్టు 3) వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోట వద్ద ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మరణించారు. వీరిలో ఐదుగురు మహిళా గెరిల్లాలుండటం గమనార్హం. కీలక నేత సుఖ్‌దేవ్ మృతుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తాజా ‘అమరత్వం’తో మావోల ఆశయ సాధనలో ముందడుగు పడిందా? అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానమొస్తుంది.

08/06/2019 - 01:59

కుటుంబ సభ్యులంతా కలసి చూసే టీవీ కార్యక్రమాలపై ఇటీవల విమర్శలు హోరెత్తుతున్నాయి. చెడు పోకడలు చూపే కార్యక్రమాల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ చానళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోవడం.. అందులో కొన్ని కార్యక్రమాలు మరీ శ్రుతిమించి ఉండడంతో ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది.

Pages