S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/20/2017 - 21:48

సాహిత్యంతోనే భాషని తేలికగా మార్చవచ్చు!

09/20/2017 - 01:18

ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే తప్ప మరొకరికి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? అధికార పార్టీ తమకు (ప్రతిపక్షాలకు) జవాబుదారీగా ఉండాలని విపక్షాలు ఉబలాటపడుతున్నాయనిపిస్తోంది. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం చేపట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా పరిపరివిధాలా ప్రయత్నిస్తున్నాయి.

09/18/2017 - 01:02

ముప్పావలా సరుకు.. మూడు రూపాయల పన్ను అన్నదే పెట్రోనీతి. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజల పట్ల ప్రభుత్వం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తోందో తేటతెల్లమవుతోంది. ప్రపంచ విపణిలో ముడి చమురుతో, దేశీయ ఇంధన ధరలు ముడిపెట్టామని, అది రోజువారీగా మార్పులకు లోనవుతుందనీ ప్రభుత్వం చెప్పింది. ఆ రకంగా చూస్తే అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడల్లా ఇక్కడ వినియోగదారునికి ఆ మేరకు ఊరట కలగాలి.

09/17/2017 - 02:24

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా - విలీనమా అని వాదనలు చేస్తున్నవారెవరూ ఆ రోజుకున్న ప్రాధాన్యతను, దాని నేపథ్యాన్ని ప్రస్తావించడంలేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుండి వేరు చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాలమధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో విలీనమయింది.

09/14/2017 - 23:45

నిమ్మజాతి పండ్లలో అధికంగా ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యానికి అది ఎంతో ఉపకరిస్తుందని అందరికీ తెలిసినదే. కానీ లుకేమియా వంటి కేన్సర్‌ను నిరోధించే విషయంలో విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. తాజా అధ్యయనం ఈ విషయాన్ని రూఢీ చేసింది. ‘సెల్’లో ప్రచురితమైన ఓ నివేదికలో ఈ విషయం పొందుపరిచారు.

09/14/2017 - 00:28

ఏ భాష మనుగడలో వుండాలన్నా, దాని ప్రయోగం, వాడకం అత్యంత ఆవశ్యకం. అప్పుడే భాష ప్రకాశిస్తుంది. భారతదేశం విభిన్న భాషలు మాట్లాడేవారికి నిలయం. కానీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష హిందీ. తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాత్ వంటి ఎన్నో ప్రాంతీయ భాషలున్నాయి. ప్రతి దేశానికి అంతటికీ ఒక జాతీయ భాష అవసరం వుంటుంది.

09/13/2017 - 00:51

ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో భారత్ మరింత దిగజారింది. విశ్వవ్యాప్తంగా వెయ్యి ఉత్తమ విశ్వవిద్యాలయాల వార్షిక ర్యాంకుల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఎప్పటిలా ఆక్స్‌ఫర్డ్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదికన్నా మెరుగుపడిన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ రెండోర్యాంకుతో ద్వితీయస్థానం సాధించింది.

09/10/2017 - 00:46

కూలి, నాలి చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న నేరెళ్ల గ్రామవాసులు ఇపుడు మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈ పల్లెప్రజలపై ఇటీవల జరిగిన దౌర్జన్య సంఘటన వెనుక వున్న చీకటి కో ణాలు- తెలంగాణ ప్రభుత్వం ఆరంభం నుండే పురుడుపోసుకున్నాయని అనిపిస్తుంది. నేరెళ్ల, జిల్లేల గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడైనా ప్రకృతి సంపద స్థానికులకు వరంగా మారుతుంది.

09/09/2017 - 00:54

ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయి మనుగడ కోసం తిప్పలు పడుతున్న చేనేత రంగం ఇక మరింతగా కష్టాల పాలయ్యే పరిస్థితి ఏ ర్పడింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లోని పెట్టుబడిదారులను ఉద్దేశించి ‘చిరుతపులి చర్మంపై మచ్చలు మారవచ్చు.. కానీ మీరు మాత్రం మారరు’ అని దివంగత నేత ఆచార్య ఎన్.జి.రంగా అన్నట్టుగా- కేంద్రంలో ప్రభుత్వాలు మారినా చేనేత రంగంపై నిర్లక్ష్య ధోరణి అలానే కొనసాగుతోంది.

09/08/2017 - 00:37

‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడన్న’ట్లు తెలుగు భాషాదిన్సోవం రానూ వచ్చింది, పోనూ పోయింది. ‘తెలుగుభాషకి ఎన్నో వరాలిస్తుంది తెలుగుదేశం’ అనుకున్న వాళ్లకి తీవ్ర నిరాశే మిగిల్చి వెళ్లిపోయింది. తొలి ఆధునిక తెలుగు భాషా శాస్తవ్రేత్త, ఆధునిక తెలుగు భాషా విమర్శకుడు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీకి భంగం కలుగలేదు.

Pages